For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ బ్యాంక్ కస్టమర్‌కైనా కార్డు లేకుండా ICICI ఏటీఎం నుంచి నగదు, ఇలా తీసుకోండి

|

డెబిట్ కార్డు లేకుండానే ATM నుంచి నగదును ఉపసంహరించుకునే సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 వేల ఏటీఎం కేంద్రాలలో రూ.20 వేలకు మించకుండా కార్డ్ లేకుండానే నగదును తీసుకోవచ్చునని తెలిపింది.

<strong>ఇల్లు కట్టుకుంటున్నారా? అనుమతి కోసం తిరగాల్సిన అవసరంలేదు!</strong>ఇల్లు కట్టుకుంటున్నారా? అనుమతి కోసం తిరగాల్సిన అవసరంలేదు!

రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఉపసంహరణ

రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఉపసంహరణ

ఐమొబైల్ (iMobile) యాప్ నుంచి రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఈ కార్డ్‌లెస్ ఉపసంహరణ సేవలను వినియోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ సేవలను మంగళవారం నాడు ప్రారంభించింది. రోజుకు రూ.20,000 ఈ పద్ధతి ద్వారా తీసుకోవచ్చు. ఐమొబైల్‌కు విజ్ఞప్తి ద్వారా దేశంలోని పదిహేను వేల ఏటీఎం కేంద్రాలలో ఈ నగదు తీసుకోవచ్చు. ఇది అత్యంత సులువైన, సౌకర్యవంతమైన మార్గమని ఐసీఐసీఐ తెలిపింది.

కార్డ్‌లెస్ విత్‌డ్రా ప్రయోజనాలు

కార్డ్‌లెస్ విత్‌డ్రా ప్రయోజనాలు

- భారత దేశంలో ఏ ప్రాంతంలో అయినా 24X7 ఈ రిక్వెస్ట్, క్యాష్ విత్ డ్రా సదుపాయం అందుబాటులో ఉంటుంది.

- క్యాష్ విత్ డ్రా చేసుకునే వారు ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ అయి ఉండవలసిన అవసరం కూడా లేదు.

- ఏటీఎం కార్డు లేకుండానే క్యాష్ తక్షణమే పొందవచ్చు.

- అన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం నెట్ వర్క్ నుంచి ఈ ఉపసంహరణ అందుబాటులో ఉంది.

- ఇది సురక్షిత ప్రాసెస్.

ఎలా విత్ డ్రా చేసుకోవాలి?

ఎలా విత్ డ్రా చేసుకోవాలి?

- ఐసీఐసీఐ మొబైల్ యాప్ iMobile కు లాగిన్ కావాలి.

- Services ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం Cash Withdrawal at ICICI Bank ATM సెలక్ట్ చేసుకోవాలి.

- అప్పుడు మీకు రిఫరెన్స్ OTP వస్తుంది.

- ఏ ఐసీఐసీఐ బ్యాంకుకు అయినా వెళ్లి కార్డ్‌లెస్ ఉపసంహరణను సెలక్ట్ చేసుకోవాలి.

- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

- రిఫరెన్స్ OTPని ఎంటర్ చేయాలి.

- టెంపరరీ PIN ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత మీరు తీసుకోవాలనుకున్న అమౌంట్ ఎంటర్ చేయాలి.

- క్యాష్ విత్ డ్రా రిక్వెస్ట్, ఓటీపీ నెక్స్ట్ డే మిడ్ నైట్ వరకు వ్యాలిడ్‌గా ఉంటుంది.

ఏటీఎం లొకేటర్ కోసం..

ఏటీఎం లొకేటర్ కోసం..

మీకు సమీపంలో ఏటీఎం ఎక్కడ ఉందో తెలియకుంటే.. ఐసీఐసీఐ ఏటీఎంను గుర్తించేందుకు ఎస్సెమ్మెస్ చేస్తే సరిపోతుంది. ATMCC <> to 9222208888 కు ఎస్సెమ్మెస్ చేస్తే చాలు.

English summary

ఏ బ్యాంక్ కస్టమర్‌కైనా కార్డు లేకుండా ICICI ఏటీఎం నుంచి నగదు, ఇలా తీసుకోండి | ICICI Bank introduces new way of ATM cash withdrawal

ICICI Bank today announced the launch of a ‘cardless cash withdrawal’ facility from its ATMs. This service allows the bank customers to withdraw cash from any ICICI Bank ATM without a debit card 24X7.
Story first published: Wednesday, January 22, 2020, 8:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X