For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New income tax portal: కొత్త ఐటీ పోర్టల్‌లోకి ఇలా లాగ్-ఇన్ కావాలి

|

ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి ఐటీ శాఖకు చెందిన కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/ లోకి లాగ్-ఇన్ కావాలి. ఇందులోకి లాగ్-ఇన్ కావడానికి ముందు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాలి. జూన్ 7వ తేదీ 2021 నుండి అందుబాటులోకి వచ్చింది. కొత్త ఈ-పోర్టల్‌తో మరింత ఈజీగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగ్-ఇన్ కావడానికి ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, స్టాటిక్ పాస్‌వర్డ్‌తో పాటు ఇతర మార్గాలు ఉన్నాయి.

లాగిన్ మెథడ్ - క్రెడెన్షియల్స్ అవసరం ఇలా...

లాగిన్ మెథడ్ - క్రెడెన్షియల్స్ అవసరం ఇలా...

- OTP on Registered Mobile / email ID User ID (PAN) & Password

- Aadhaar OTP (including the case where e-Filing vault option is enabled) User ID (PAN),

- Aadhaar Number (Only for Individual taxpayers) User ID (Aadhaar),

- Net Banking (e-Filing vault higher security enabled) User ID & Password,

- Net Banking (e-Filing vault higher security NOT enabled) Net Banking User ID and password,

- Static Password User ID (PAN) & Password,

- Bank / Demat Account EVC (e-Filing Vault Higher Security enabled) User ID (PAN) & Password,

- DSC User ID (PAN) & Password,

- ITD Mobile App - Scan QR Code* -,

- ITD Mobile App - Push Notification* -,

- ITD Mobile App-T-OTP* -,

- Login using User ID - for CA, TAN User, ERI, External Agency User ID (PAN) & Password,

- Login using User ID - for ITDREIN User User ID (PAN) & Password,

- Login using DSC (when e-Filing Vault Higher Security is enabled) - for CA, TAN User, ERI, External Agency User ID (PAN) & Password

మొబైల్ నెంబర్/మెయిల్ ద్వారా లాగ్-ఇన్ కావడానికి...

మొబైల్ నెంబర్/మెయిల్ ద్వారా లాగ్-ఇన్ కావడానికి...

- ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ https://www.incometax.gov.in/ లోకి లాగ్-ఇన్ కావాలి.

- హోం పేజీ పైన కనిపించే Login Here ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

- ఐడీ టెక్స్ట్ బాక్సులో మీ పాన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. Continue పైన క్లిక్ చేయాలి.

- సెక్యూరిటీ యాక్సెస్ సందేశాన్ని నిర్ధారించుకోవాలి. పాస్ వర్డ్‌ను ఎంటర్ చేసిన తర్వాత Continue పైన క్లిక్ చేయాలి.

- వాయిస్ కాల్ ద్వారా 6 అంకెల ఓటీపీ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఇది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. enter పైన క్లిక్ చేయాలి.

- మీ రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఈ-మెయిల్‌కు పంపించిన ఆరు డిజిట్స్ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత Login పైన క్లిక్ చేయాలి. ఈ-ఫైలింగ్ డ్యాష్ బోర్డు కనిపిస్తుంది.

- ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు... మీ ఓటీపీ వ్యాలిడిటీ 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది.

- కరెక్ట్ ఓటీపీని ఎంటర్ చేసేందుకు మీకు మూడు అవకాశాలు మాత్రమే ఉంటాయి.

- ఓటీపీ ఎక్స్‌పైరీ టైమ్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.

- రీసెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే కొత్త ఓటీపీ కూడా వస్తుంది.

ఆధార్ ఓటీపీ ద్వారా లాగ్-ఇన్

ఆధార్ ఓటీపీ ద్వారా లాగ్-ఇన్

- ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలోకి లాగ్-ఇన్ కావాలి.

- యూజర్ ఐడీ టెక్స్ట్ బాక్స్‌లో ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. కంటిన్యూ బటన్ పైన ట్యాప్ చేయాలి.

- సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ కన్ఫర్మ్ అయ్యాక, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కోసం ఓటీపీని ఎంచుకోవాలి. ఆ తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.

- హైయ‌ర్ సెక్యూరిటీ ఆప్ష‌న్ కోసం ఆధార్ ఓటీపీని ఉపయోగించాలని భావిస్తే, యూజ‌ర్ ఐడి, పాస్‌వ‌ర్డ్‌తో లాగ్-ఇన్ అయి హైయ‌ర్ సెక్యూరిటీ ఆప్ష‌న్ పేజీలో ఆధార్‌-రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసి కంటిన్యూ చేయాలి.

- మీకు అప్పటికే ఓటీపీ వచ్చి ఉంటే ఆరు అంకెల ఓటీపీని ఎంటర్ చేసి లాగ్-ఇన్ కావాలి.

- ఒకవేళ రాకపోతే వెరిఫికేషన్ కోసం ఆధార్ వివరాలు వ్యాలిడేట్ చేసేందుకు అంగీకరిస్తున్నట్లు బాక్సులో మార్క్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి.

- అప్పుడు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, లాగ్-ఇన్ కావాలి. ఈ-ఫైలింగ్ పోర్టల్ డ్యాష్ బోర్డు కనిపిస్తోంది.

నెట్ బ్యాంకింగ్ ద్వారా

నెట్ బ్యాంకింగ్ ద్వారా

- ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్ హోంపేజీలో క‌నిపించే లాగ్-ఇన్ పైన క్లిక్ చేయాలి.

- అధిక సెక్యూరిటీ ఆప్ష‌న్‌గా నెట్ బ్యాంకింగ్‌ను ఎంచుకుంటే యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేసి నెట్ బ్యాంకింగ్‌ని క్లిక్ చేసి కావాల్సిన బ్యాంకును ఎంచుకోవాలి.

- లేదా ఈ-ఫైల్లింగ్ వ్యాలెట్ హైయ‌ర్ సెక్యురిటీ ద్వారా కాకుండా పేజీ దిగువ‌న నెట్ బ్యాంకింగ్‌ని క్లిక్ చేసి, మీ బ్యాంక్‌ను ఎంపిక చేసుకోవాలి.

- అక్కడ కనిపించే వివరాలను చ‌దివి అర్థం చేసుకున్న త‌ర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.

- ఇక్క‌డ మీ నెట్ బ్యాంకింగ్ యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎంట‌ర్ చేసి అకౌంట్‌ను యాక్సెస్ చేయవచ్చును.

- లాగ్-ఇన్ తర్వాత బ్యాంకు వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్ లింక్‌పై క్లిక్ చేస్తే, ఇ-ఫైలింగ్ డ్యాష్‌బోర్డ్ క‌నిపిస్తుంది.

English summary

New income tax portal: కొత్త ఐటీ పోర్టల్‌లోకి ఇలా లాగ్-ఇన్ కావాలి | How to login into new income tax portal?

To file your ITR online you need to use the Income Tax Department’s new e-filing portal at https://www.incometax.gov.in/. But before you can log in you will need to register yourself on the e-filing portal. Click here to find out how you can register on the government’s new ITR e-filing portal.
Story first published: Wednesday, December 1, 2021, 9:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X