For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI debit card Green PIN: ఫోన్ కాల్‌తో SBI పిన్ జనరేట్ చేసుకోండి ఇలా..

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. బ్యాంకు బ్రాంచీకి రాకుండానే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు పిన్ నెంబర్‌ను తక్షణమే జనరేట్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకు వచ్చింది. దీనిని గ్రీన్ పిన్ కార్డుగా చెబుతున్నారు. ఎస్బీఐ ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుండే ఐదు నిమిషాల్లో ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని ఎస్బీఐ పేర్కొంది.

ఇలా పిన్ జనరేట్ చేసుకోవాలి

ఇలా పిన్ జనరేట్ చేసుకోవాలి

ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా ఎస్బీఐ త‌న ఖాతాదారులు డెబిట్ కార్డు పిన్ కార్డ్ జనరేట్ చేసుకునే వెసులుబాటు ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎస్బీఐ టోల్ ఫ్రీ IVR సిస్టమ్ ద్వారా 1800-112-211ఫోన్ నంబ‌ర్‌కు గానీ, 1800-425-3800 ఫోన్ నెంబ‌ర్‌కు కాల్ చేయాలి. మొదట ఈ టోల్ ఫ్రీ ఫోన్ నంబ‌ర్ల‌లో ఒక నెంబర్‌కు కాల్ చేసి, అనంతరం పిన్‌ జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6ను ఎంచుకోవాలి.

SBI యాన్యుటీ స్కీం: ఇలా చేస్తే నెలకు రూ.10,000 ఆదాయం: ఇది తెలుసుకోండి..SBI యాన్యుటీ స్కీం: ఇలా చేస్తే నెలకు రూ.10,000 ఆదాయం: ఇది తెలుసుకోండి..

ఓటీపీ ద్వారా..

ఓటీపీ ద్వారా..

ఆ తర్వాత ఎస్బీఐ కార్డుపై ఉన్న నెంబర్, పుట్టిన తేదీ, కార్డు చివరి తేదీ న‌మోదు చేయాల‌ని ఎస్బీఐ సూచించింది.ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలో ఖాతాదారులు న‌మోదు చేసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు లేదా మెయిల్ ఐడీకి ఆరు అంకెల OTP వస్తుంది. త‌ర్వాత నాలుగు అంకెల‌తో కూడిన‌ పిన్ నెంబర్ కస్టమర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దానిని మరోసారి ధృవీకరించుకునేందుకు మళ్లీ టైప్ చేయాలి. ఆ తర్వాత IVRలో పిన్ జనరేట్ అయినట్లు సందేశం వస్తుంది.

24 గంటల్లో మార్చుకోవచ్చు

24 గంటల్లో మార్చుకోవచ్చు

గ్రీన్ పిన్ జనరేట్ అయిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సందేశం వస్తుంది. కస్టమర్‌కు వచ్చిన పిన్ నెంబర్‌ను దగ్గరలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లి 24 గంటల్లోపు మార్చుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ ద్వారా కూడా మార్చుకోవచ్చు.

English summary

SBI debit card Green PIN: ఫోన్ కాల్‌తో SBI పిన్ జనరేట్ చేసుకోండి ఇలా.. | How to generate SBI debit card Green PIN? Here are three ways

State Bank of India (SBI) customers can now generate the PIN of their ATM-cum-debit card instantly without visiting the bank branch. This is called a Green PIN - it is a convenient way of generating one's debit-cum-ATM card PIN via channels like IVR, Internet banking, SMS.
Story first published: Monday, February 22, 2021, 8:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X