For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్డ్ డిపాజిట్స్‌పై అత్యధిక వడ్డీరేటును అందిస్తున్న పది బ్యాంకులు

|

కరోనా నేపథ్యంలో వివిధ బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గాయి. కస్టమర్లకు అందించే వివిధ రుణాల కంటే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల పేరిట కూడా పలు బ్యాంకులు కాస్త ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే కాకుండా గ్యారెంటీ ఆదాయం కోసం ఎదురు చూసే ఇన్వెస్టర్లకు ఇది ఎంతో ప్రయోజనకరం. ఇప్పటికీ గ్రామాల్లో, చిన్న పట్టణాలలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీలపై ఆధారపడే వారు ఎంతోమంది ఉన్నారు. అయితే గ్యారెంటీ వడ్డీ వస్తుందని ఉన్నప్పటికీ, కరోనా కాలంలో వడ్డీ రేట్లు భారీగా తగ్గడంతో, ఆదాయం కూడా పడిపోయింది. ద్రవ్యోల్భణానికి సమానమైన రాబడికి మీరు ప్లాన్ చేస్తే స్వల్పకాల వ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్ సరిపోతుందని నిపుణుల సూచన. FD చేయడానికి ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీరేటు ఉందో తెలుసుకుందాం.

రూ.2 కోట్ల కంటే తక్కువ FDపై టాప్ 10 బ్యాంకులు

రూ.2 కోట్ల కంటే తక్కువ FDపై టాప్ 10 బ్యాంకులు

బ్యాంక్ బజార్ ప్రకారం... ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్న వివిధ బ్యాంకులు.

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FD - సాధారణ వడ్డీ రేటు 2.90% నుండి 5.40%, సీనియర్ సిటిజన్లకు 3.40% నుండి 6.20%.

- ICICI బ్యాంకు FD - సాధారణ వడ్డీ రేటు 2.50% నుండి 4.40%, సీనియర్ సిటిజన్లకు 2.50% నుండి 4.40%.

HDFC బ్యాంకు FD - సాధారణ వడ్డీ రేటు 2.50% నుండి 5.50%, సీనియర్ సిటిజన్లకు 3.00% నుండి 6.25%.

పంజాబ్ నేషనల్ బ్యాంకు FD - సాధారణ వడ్డీ రేటు 2.90% నుండి 5.25%, సీనియర్ సిటిజన్లకు 3.50% నుండి 5.75%.

కెనరా బ్యాంకు FD - సాధారణ వడ్డీ రేటు 2.90% నుండి 5.25%, సీనియర్ సిటిజన్లకు 2.90% నుండి 5.75%.

యాక్సిస్ బ్యాంకు FD - సాధారణ వడ్డీ రేటు 2.50% నుండి 5.75%, సీనియర్ సిటిజన్లకు 2.50% నుండి 6.50%.

బ్యాంక్ ఆఫ్ బరోడా FD - సాధారణ వడ్డీ రేటు 2.80% నుండి 5.25%, సీనియర్ సిటిజన్లకు 3.30% నుండి 5.75%.

IDFC బ్యాంకు FD - సాధారణ వడ్డీ రేటు 2.75% నుండి 5.75%, సీనియర్ సిటిజన్లకు 3.25% నుండి 6.25%.

బ్యాంక్ ఆఫ్ ఇండియా FD - సాధారణ వడ్డీ రేటు 2.85% నుండి 5.05%, సీనియర్ సిటిజన్లకు 3.35% నుండి 5.55%.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు FD - సాధారణ వడ్డీ రేటు 3.00% నుండి 5.30%, సీనియర్ సిటిజన్లకు 3.50% నుండి 5.60%.

అత్యధిక వడ్డీ రేటు

అత్యధిక వడ్డీ రేటు

పైవాటిలో అత్యధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోన్న బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకు అయిదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలపరిమితిపై 5.75 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఆ తర్వాత యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా 5.60 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.

ఆ తర్వాత HDFC బ్యాంకు అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

యస్ బ్యాంకు అత్యధికం

యస్ బ్యాంకు అత్యధికం

ఇతర బ్యాంకుల్లో రూ.2 కోట్ల కంటే దిగువన ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అత్యధిక వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంకుల్లో యస్ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులో సాధారణ వడ్డీ రేటు 3.25 శాతం నుండి 6.50 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.75 శాతం నుండి 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించింది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేటు తగ్గింది.

English summary

ఫిక్స్డ్ డిపాజిట్స్‌పై అత్యధిక వడ్డీరేటును అందిస్తున్న పది బ్యాంకులు | Fixed Deposit Interest Rates of Top 10 Banks

Fixed Deposit Interest Rates of Top 10 Banks
Story first published: Friday, September 17, 2021, 19:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X