For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Alert: ఈరోజు నుండి ఇవి చెల్లవు.. మార్పులు ఇవే! ఐటీ రిటర్న్స్ షాక్, వీటిపై ఊరట

|

నేటి నుండి (ఏప్రిల్ 1, 2021) కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీంతో మన జీవన గమనంలో చాలా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బడ్జెట్‌లో ప్రకటించిన ప్రతిపాదనలకు తోడు ధరల పెరుగుదల, తగ్గుదల సహా ఎన్నో అంశాల్లో మార్పులు ఉంటాయి. ఉదాహరణకు బ్యాంకు చెక్కుబుక్కులు పని చేయవు. ఐటీ రిటర్న్స్ గడువు ఇప్పటికే ముగిసింది. అలాగే, ఆధార్-పాన్ కార్డు లింకింగ్ తేదీ గడువు నిన్నటికే ముగిసినప్పటికీ, మరోసారి పొడిగించారు. ఇలా మార్పులు ఉంటాయి.

వీటిలో ఊరట

వీటిలో ఊరట

- పాన్-ఆధార్ కార్డు లింక్ గడువు మార్చి 31, 2021 వరకు ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిని మరో మూడు నెలలు అంటే జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

- రీచార్జీలు, ఓటీటీ, డీటీహెచ్, యుటిలీటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై వినియోగదారులకు ఆర్బీఐ ఊరట కల్పించింది. ఆటోమేటిక్ చెల్లింపులకు అదనపు ధ్రవీకరణ (AFA) తప్పనిసరి చేసే కొత్త మార్గదర్శకాల అమలును ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వాయిదా వేసింది. మొదట ఈ గడువు నిన్నటి వరకే ఉంది. తాజాగా దీనిని పొడిగించారు.

- కేంద్రం కొత్తగా తీసుకు వచ్చిన నాలుగు కార్మిక స్మృతుల (లేబర్ కోడ్స్) అమలు వాయిదా పడింది. కొన్ని రాష్ట్రాలు లేబర్ కోడ్స్‌కు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయలేదు. దీంతో ఏప్రిల్ 1 నుంచి శాలరీ స్ట్రక్చర్ మార్పులు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం మార్పు ఉండటం లేదు.

ఈఫీఎఫ్ భారం

ఈఫీఎఫ్ భారం

పీఎఫ్ ఖాతాలో ఉద్యోగులు, యాజమాన్య వాటా కలుపుకొని ఏడాదిలో రూ.2.50 లక్షలకు మించి జమ అయినట్లయితే దానిపై లభించే వడ్డీకి పన్ను పడుతుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తోంది. ఈ అంశానికి సంబంధించి గతవారం లోకసభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భగా నిర్మలమ్మ మాట్లాడారు. పీఎప్ పరిమితి గురించి ప్రస్తావించారు. అలాగే, రెండేళ్ల పాటు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే మీ టీడీఎస్, టీసీఎస్ రేటు రెండింతలు అవుతుంది.

ఈ చెక్కు బుక్స్ చెల్లవు

ఈ చెక్కు బుక్స్ చెల్లవు

ఆంధ్రా బ్యాంక్, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్‌లకు చెందిన పాస్ బుక్స్, చెక్ బుక్స్ ఏప్రిల్ 1వ తేదీ నుండి పనిచేయవు. ఈ ఏడు బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనం అయ్యాయి. విలీనమైన బ్యాంకులకు చెందిన చెక్ బుక్స్ ఖాతాదారులు తీసుకోవాల్సి ఉంటుంది. దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో, ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)లో, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకలు యూనియన్ బ్యాంక్‌లో, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్ విలీనమయ్యాయి.

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే షాక్

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే షాక్

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే బ్యాంకు డిపాజిట్లపై మూలం వద్ద పన్ను మినహాయింపు (TDS) రెట్టింపు ఉంటుంది. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. అంటే ఆదాయ పన్ను స్లాబ్‌లో లేనివారు కూడా ఐటీఆర్‌ దాఖలు చేయకపోతే రెట్టింపు టీడీఎస్‌ను కట్టాల్సి వస్తుంది. ఐటీ రిటర్న్స్ దాఖలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. గత రెండేళ్లలో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ ఉన్నవారికి నిర్దిష్ట రేటు కంటే రెట్టింపు లేదా 5 శాతం (ఏది ఎక్కువైతే అది పద్ధతిలో)ను వసూలు చేస్తారు.

విమానం ఖరీదు

విమానం ఖరీదు

ఏప్రిల్ నుండి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు (ASF) పెరుగుతోంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులపై ఏఎస్‌ఎఫ్‌ను పెంచాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తున్నాయి.

క్రిప్టో లెక్కలు

క్రిప్టో లెక్కలు

కంపెనీలు ఏప్రిల్ 1 నుండి తమ వద్ద ఉండే క్రిప్టోకరెన్సీ వివరాలు ఆర్థిక ఖాతాల్లో వెల్లడించాలి. కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలు వాటాదారులకు తెలియాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది. ఆర్థిక ఫలితాలను ప్రకటించే తేదీ నాటికి ఎంత మేర క్రిప్టోకరెన్సీ ఉందన్నదో చెప్పాలి. అంతేకాదు వాటిపై వచ్చిన లాభం, నష్టాలను పేర్కొనాలి. ఈ కరెన్సీల్లో ట్రేడింగ్/పెట్టుబడులకు ఇతరుల నుండి తీసుకునే డిపాజిట్లు, అడ్వాన్సులను ఆయా కంపెనీలు చెల్లించాలి.

జీఎస్టీ ఇన్వాయిస్

జీఎస్టీ ఇన్వాయిస్

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్‌లో కూడా మార్పులు ఉన్నాయి. ఈ-ఇన్వాయిసింగ్ తప్పనిసరి చేశారు. రూ.50 కోట్ల టర్నోవర్ దాటితే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్‌కు ఇది తప్పనిసరి.

ధరల పెరుగుదల

ధరల పెరుగుదల

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కార్లు, బైక్స్ ధరలు పెరుగుతున్నాయి. పలు కంపెనీలు జనవరిలో ఇప్పటికే రేట్లు పెంచాయి. అంతర్జాతీయ సరఫరా కొరత కారణంగా కమొడిటీ, లోహ ధరలు పెరగడంతో కార్లు, బైక్స్ సంస్థలు రేట్లు పెంచుతున్నాయి. టీవీలు, ఏసీల ధరలు మూడువేల రూపాయల నుండి రూ.6వేల రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజరేటర్ల ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఏసీ ధరలు రూ.1500 నుండి రూ.2000 వరకు పెరగవచ్చు.

ఎల్టీసీ క్యాష్ వోచర్

ఎల్టీసీ క్యాష్ వోచర్

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీంను ప్రవేశ పెట్టింది. ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీంకు గడువు మార్చి 31 ముగిసింది. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా పండుగ సీజన్‌లో డిమాండ్ పెంచేందుకు ఆర్థిక శాఖ ఈ ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నాన్-సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సహా పలువురికి దీనిని అందుబాటులోకి తెచ్చారు.

ఎల్టీసీ వోచర్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. 12 శాతం లేదా ఆ పైన జీఎస్టీ ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అది కూడా డిజిటల్ రూపంలో ఉండాలి. అక్టోబర్ 12, 2020 నుండి మార్చి 31, 2021 లోపు ఎల్టీసీ క్యాష్ వోచర్‌ను వినియోగించాలి. అయితే ఎల్టీసీ వోచర్‌కు మూడు రెట్ల ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి రూ.50వేల వోచర్‌కు అర్హులు అనుకుంటే రూ.1.50 లక్షలు ఖర్చు చేయాలి. జీఎస్టీ నెంబర్, జీఎస్టీ వివరాలు తెలియజేయాలి.

English summary

financial year FY22: You need to keep tab on these issues from today

As the financial year 2020-21 ends, you have less than a day to invest or spend to be eligible for tax exemptions.
Story first published: Thursday, April 1, 2021, 12:40 [IST]
Company Search