For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌ను మార్చిన కొన్ని బడ్జెట్‌లు ఇవే..

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. భారత్‌లోని ప్రతి ఒక్కరు ఇప్పుడు బడ్జెట్ వైపు చూస్తున్నారు. నిత్యావసరాలు మొదలు ప్రతి వస్తువు ధర ఈ బడ్జెట్‌తో ముడివడి ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశ దశ-దిశను మార్చె బడ్టెట్లు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని...

1950 ఫిబ్రవరి 28వ తేదీన నాటి ఆర్థిక మంత్రి జాన్ మత్తయి తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రణాళిక కమిషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది ఆ బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనే. అదే ఏడాది మార్చి నాటికి ప్రణాళిక కమిషన్ ఏర్పాటయింది. అనంతరం 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకు వచ్చింది.

'బ్రీఫ్‌కేస్' సీక్రెట్ తెలుసా, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది?'బ్రీఫ్‌కేస్' సీక్రెట్ తెలుసా, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది?

Few Budgets that changed India

1968 ఫిబ్రవరి 29న నాటి ఆర్థికశాఖ మంత్రి మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉత్పాదక రంగానికి ఊపిరలూదినట్లుగా చెబుతారు. ఈయన పది బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ఫలితంగా దాదాపు అన్ని రంగాల్లోనూ ఉత్పత్తులు పెరిగి జీడీపీ పరుగులు పెట్టింది. ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరికింది.

1986 ఫిబ్రవరి 28న వీపీ సింగ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ద్వారా పరోక్ష పన్నులకు బీజం పడింది. దీంతో ఖజనాకు రాబడి పెరిగింది. నాడు వీపీ సింగ్ ప్రవేశ పెట్టిన పన్నుల మూల సూత్రాల మీదే జీఎస్టీ రూపుదిద్దుకుంది. 1991 జులై 24న నాటి మన్మోహన్ ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ ద్వారా ఎగుమతులు, దిగుమతుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.

1997 ఫిబ్రవరి 28న దేశానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషించిన బడ్జెట్ ఇది. బడా బాబుల నివాసాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీయడానికి ఈ బడ్జెట్‌లో పలు అంశాలను పొందుపరిచారు.

English summary

భారత్‌ను మార్చిన కొన్ని బడ్జెట్‌లు ఇవే.. | Few Budgets that changed India

All Budgets are important, but some Budgets are more important than others. Few budgets changed India.
Story first published: Sunday, January 26, 2020, 16:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X