For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారులో వెళ్తున్నారా.. మీ కోసమే, డిసెంబర్ 1 నుంచి FASTag తప్పనిసరి: ఏమిటిది.. ఎలా?

|

న్యూఢిల్లీ: జాతీయ రహదారుల్లో ఇబ్బందులులేని ప్రయాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర, జాతీయ రహదారుల్లో ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు డిజిటలైజ్డ్ ఫాస్ట్ ట్యాగ్ (FASTag) ద్వారా కేంద్రం సులభతరం చేస్తోంది. టోల్ ప్లాజాల వద్ద డబ్బులు కట్టడానికి సమయం వృథా అవడంతో పాటు కొన్ని సందర్భాలలో ట్రాఫిక్ కూడా నిలిచిపోతుంది. ఇలాంటి సందర్భాలల్లో FASTag ద్వారా లింక్ చేసిన మీ బ్యాంకు అకౌంట్ నుంచి లేదా డిజిటల్ వ్యాలెట్ నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతాయి.

LIC: డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీలు! పాతవారికి నో టెన్షన్LIC: డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీలు! పాతవారికి నో టెన్షన్

FASTag తప్పనిసరి.. ఇవి లాభాలు

FASTag తప్పనిసరి.. ఇవి లాభాలు

జాతీయ రహదారుల్లో FASTag లేకుంటే రాకపోకలు సాగించే వాహనదారుల జేబులకు కూడా చిల్లు పడుతుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూను తొలగించేందుకు FASTag వ్యవస్థ ఎంతో సహాయపడుతోంది. టోల్ ప్లాజా వద్ద ఇంధనం ఆదా చేయడానికి, అవినీతిని అరికట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. FASTag ఇప్పటి వరకు ఐచ్చికంగా ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారుల్లో ప్రయాణించే వారికి ఇది తప్పనిసరి కానుంది.

FASTag లేకుంటే....

FASTag లేకుంటే....

FASTag లేకుండా రాకపోకలు సాగిస్తే చెల్లించాల్సిన దాని కంటే డబుల్ కట్టాల్సి వస్తుంది. ఉంటే మాత్రం పాత ఛార్జీలే వర్తిస్తాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) విధానంలో టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అన్ని టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ETC విధానాన్ని 2016లో ప్రారంభించినప్పటికీ దీనిని డిసెంబర్ 1, 2019 నుంచి తప్పనిసరి చేయాలని రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది.

FASTag ఇలా తీసుకోండి...

FASTag ఇలా తీసుకోండి...

డిసెంబర్ 1వ తేదీ నుంచి FASTag తప్పనిసరి. కాబట్టి రాష్ట్ర, జాతీయ రహదారుల్లో దీనిని ఉపయోగించవలసి ఉంటుంది. కొత్తగా కొనుగోలు చేసిన కార్లు ఇప్పటికే FASTag అమర్చబడి ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఒకవేళ పాతకారును ఉపయోగిస్తుంటే మాత్రం HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, Paytm, అమెజాన్ నుంచి ఈ ట్యాగ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. వీటితో ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

FASTagకు కావాల్సినవి..

FASTagకు కావాల్సినవి..

FASTag కావాలంటే పైన పేర్కొన్న బ్యాంకుల్లో వాహనం ఆర్సీ, గుర్తింపు కార్డు జిరాక్సులు రెండు సెట్లు, ఓ పాస్ పోర్టు సైజు ఫోటో, ఛార్జ్ చెల్లించాలి. గుర్తింపు కార్డు అంటే ఆధార్ లేదా పాన్ లేదా ఓటరు కార్డు వంటివి ఉపయోగించవచ్చు.

టోల్ ప్లాజాల్లో ఉండే నిబంధనలు వర్తిస్తాయి

టోల్ ప్లాజాల్లో ఉండే నిబంధనలు వర్తిస్తాయి

FASTag ధర వాహనాన్ని బట్టి ఉంటుంది. రూ.100 నుంచి ప్రారంభం అవుతుంది. అన్ని టోల్ గేట్ల వద్ద కూడా నాలుగు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజాల్లో ఉండే నిబంధనలు అన్ని కూడా FASTagతోను వర్తిస్తాయి.

FASTagతో ప్రయోజనాలు

FASTagతో ప్రయోజనాలు

FASTagతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

- ఈజీ పేమెంట్. టోల్ ట్రాన్సాక్షన్స్ కోసం డబ్బులు వెంట తీసుకెళ్లవలసిన అవసరం లేదు.

- సమయం ఆదా అవుతుంది.

- టోల్ ప్లాజా వద్ద వాహనం ఆగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఫ్యూయల్ కాస్ట్ ఆ మేరకు సేవ్ అయినట్లే.

- ఆన్ లైన్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెఫ్ట్, ఆర్టీజీఎస్, నెట్ బ్యాంకింగ్.. ఎలాగైనా రీచార్జ్ చేసుకోవచ్చు.

- టోల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఎస్సెమ్మెస్ అలర్ట్ వస్తుంది. తక్కువ బ్యాలెన్స్ ఉన్నా కూడా అలర్ట్ మెసేజ్ వస్తుంది.

- కస్టమర్ల కోసం ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది.

- 5 ఏళ్ల వ్యాలిటీడీ ఉంటుంది.

నగదు రూపంలో చెల్లింపుకు కుదింపు

నగదు రూపంలో చెల్లింపుకు కుదింపు

2019 డిసెంబర్ 1వ తేదీ నుంచి టోల్ ప్లాజాల వద్ద ఛార్జీలను నగదు రూపంలో చెల్లింపుకు పరిమిత సంఖ్యలోనే కౌంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదాహరణకు ఓ టోల్ ప్లాజా వద్ద ఓ వైపు ఆరు టోల్ గేట్లు ఉంటే రెండింటిని నగదు చెల్లింపుకు కేటాయిస్తారు. నాలుగు గేట్లు ఉంటే ఒక మార్గంలోనే నగదు ఛార్జీలకు అనుమతిస్తారు.

English summary

కారులో వెళ్తున్నారా.. మీ కోసమే, డిసెంబర్ 1 నుంచి FASTag తప్పనిసరి: ఏమిటిది.. ఎలా? | FASTag mandatory from Dec 1: All you need to know

With a completely digitized system, FASTag has made it easier and faster to pass through toll plazas located on state and national highways.
Story first published: Thursday, November 14, 2019, 11:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X