For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PF ఉపసంహరణ కోసం బ్యాంకు ఖాతా అప్‌డేట్ చేయండి ఇలా

|

EPFO సబ్‌స్క్రైబర్లు ప్రావిడెంట్ ఫండ్ నుండి ఉపసంహరించుకోవడానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొన్ని నిబంధనలు రూపొందించింది. UNA (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) ప్రవేశ పెట్టిన తర్వాత సబ్‌స్క్రైబర్లు ఆన్‌లైన్‌లో పీఎఫ్ మొత్తాన్ని చాలా ఈజీగా ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించింది. UNA 12 అంకెలతో కూడిన ప్రత్యేక నెంబర్. సబ్‌స్క్రైబర్లు ఒక్కొక్కరికి ఒక్కో UAN నెంబర్ ఉంటుంది. ఇది పర్మినెంట్‌గా ఉంటున్నందున ఉద్యోగాలు మారినప్పటికీ UNA మాత్రం ఒక్కటే ఉంటుంది.

అందుకే తిరస్కరణ

అందుకే తిరస్కరణ

UNA నెంబ‌ర్ ద్వారా ఈపీఎఫ్ పోర్ట‌ల్‌లోకి లాగిన్ కావడం ద్వారా పీఎఫ్ మొత్తాన్ని నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉపసంహరించుకోవచ్చు. అయితే క్లెయిమ్స్ ఆల‌స్యమవుతున్నాయ‌ని, తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతున్నాయ‌ని ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకు కార‌ణం స‌రైన బ్యాంక్ ఖాతా వివ‌రాలు ఇవ్వ‌క పోవ‌డ‌మేన‌ని EPFO స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతా నెంబర్, IFSC కోడ్ వివ‌రాల్లో త‌ప్పులుంటే మీ క్లెయిమ్స్ తిర‌స్కరించే అవకాశముంది. ఆన్ లైన్ ద్వారా EPFO ఖాతాలో మీ బ్యాంకు వివరాలు అప్ డేట్ చేసుకోవడం సులభం. కానీ దీనికి కంపెనీ యాజమాన్యం ఆమోదం అవసరం.

బ్యాంకు ఖాతా అప్‌డేషన్

బ్యాంకు ఖాతా అప్‌డేషన్

- మొదట EPFO అధికారిక పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. https://www.epfindia.gov.in/site_en/index.php

- UAN ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావాలి.

- Manage పైన క్లిక్ చేసి, KYC ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

- Documents పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Bank ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

- బ్యాంకు అకౌంట్ వివరాలు అప్ డేట్ చేయడానికి అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. అలాగే IFSC కోడ్ కూడా పేర్కొనాలి.

- ఆ తర్వాత Save ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

- KYC ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతుంది.

డాక్యుమెంట్ ప్రూఫ్

డాక్యుమెంట్ ప్రూఫ్

మీ సంస్థ ఆమోదం కోసం డాక్యుమెంట్ ఫ్రూవ్‌ని సమర్పించాలి. ఈ వివరాల‌ను సంస్థ య‌జ‌మాని వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత మీకు KYC డిజిట‌ల్ అప్రూవ్ అయిన‌ట్లుగా చూపిస్తుంది. టెస్ట్ మెసేజ్ రూపంలో మీ మొబైల్‌కు సందేశం వ‌స్తుంది.

English summary

PF ఉపసంహరణ కోసం బ్యాంకు ఖాతా అప్‌డేట్ చేయండి ఇలా | EPF: How to change bank account number for PF withdrawal

For Provident Fund (PF) withdrawal, the Employees' Provident Fund Organisation (EPFO) has made certain rules for EPFO subscribers. After the introduction of UAN (Universal Account Number), which is a unique 12-digits code like one's PF account number, one can easily withdraw one's PF/EPF money online.
Story first published: Thursday, May 6, 2021, 18:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X