For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకిగ్ పనితీరును నిర్ధారించే నిబంధనలు, నిష్పత్తులు...!

|

ప్రతి పరిశ్రమకు కూడా వారి పనితీరును నిర్ణయంచే కొన్ని పారామితులు ఉంటాయి. ఏ దేశానికైనా ఆర్థికంగా వెన్నెముక బ్యాంకింగ్ పరిశ్రమ. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. బ్యాంకుకు సంబంధించి ఎన్పీఏలు, బ్యాడ్ లోన్, ప్రొవిజన్ కవరేజ్ రేషియో, స్టాండర్డ్ లేదా సబ్ స్టాండర్డ్ అసెట్స్, క్యాపిటల్ అడిక్వెన్సీ రేషియో, ఎన్ఐఐ, ఎన్ఐఎం వంటివి ఉన్నాయి.

ఎన్పీఏ

ఎన్పీఏ

ఎన్పీఏ... బ్యాంకుకు సంబంధించి వినే అత్యంత సాధారణ పదం. బ్యాంకుల ఆస్తి నాణ్యత గురించి ఇది తెలియచేస్తుంది. బ్యాంకుకు ఆస్తి అంటే పంపిణీ చేసిన రుణాలు, వాటిపై సంపాదించే వడ్డీ. అయితే ఇలా ఇచ్చిన రుణాల్లో కొన్ని బ్యాడ్ లోన్ లేదా మొండి బకాయిలుగా మిగులుతాయి.

ఎన్పీఏలో జీఎన్పీఏలు ఉంటాయి. ఇవి నాన్-రికవరబుల్‌గా ఉంటాయి. ఎన్పీఏలు అధికంగా ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి కూడా ఆసక్తి తగ్గుతుంది. ఎందుకంటే ఆ బ్యాంకు డిఫాల్ట్ అయ్యే పరిస్థితిని కొట్టి పారేయలేం. అయితే కమర్షియల్ బ్యాంకులకు ఇలాంటి ఇబ్బంది తలెత్తినప్పుడు మాత్రం ఆర్బీఐ ద్వారా నెట్టుకు వస్తాయి. ఎన్పీఏ, జీఎన్‌పీఏ, ఎన్ఎన్‌పీఏలు ఉంటాయి.

ప్రొవిజన్ కవరేజ్ రేషియో

ప్రొవిజన్ కవరేజ్ రేషియో

తీసుకున్న రుణాల్లో తిరిగి రాలేనివి ఉంటాయి. ఇలాంటి వాటికి ప్రొవిజనింగ్ అని కొన్ని నిధులను కేటాయించారు. ఈ నిష్పత్తి 70 శాతానికి పైగా ఉంటే డిఫాల్ట్ రుణాలకు సంబంధించి ఆ బ్యాంకు బెట్టర్‌గా వ్యవహరిస్తుందని భావించవచ్చు. దీనిని ప్రొవిజన్ కవరేజ్ రేషియో(PCR)గా వ్యవహరిస్తారు.

క్యాపిటల్ అడిక్వెన్సీ రేషియో(CAR)

క్యాపిటల్ అడిక్వెన్సీ రేషియో(CAR)

క్యాపిటల్ అడిక్వెన్సీ రేషియో నిష్పత్తి అపెక్స్ బ్యాంకు ద్వారా నిర్ణయించబడుతుంది. అంటే ఆర్బీఐ నిర్ణయిస్తుంది. పంపిణీ చేసిన రుణం, మూలధనం నిష్పత్తి ఇది. ఈ నిష్పత్తిలోనే బ్యాంకు అంటే ఆర్బీఐ నిర్దేశించిన మూలధనాన్ని తీసుకోకుండా భవిష్యత్తు బాధ్యతలు నిర్వర్తించాలి. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల CAR 9 శాతం, PSB 12 శాతంగా ఉంది.

నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కం(NII), నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ (NIM).. ఈ రెండు ఆర్థిక పనితీరుకు సూచిక. ఇందులో NII సంపాదించిన లాభాన్ని వెల్లడిస్తుంది.

English summary

బ్యాంకిగ్ పనితీరును నిర్ధారించే నిబంధనలు, నిష్పత్తులు...! | Banking Terms And Ratios To Decide On Their Performance

For every industry there are some of the parameters based on which their performance can be judged, likewise banking industry which forms the economic backbone of any country has several facets to it that are of high importance.
Story first published: Tuesday, July 13, 2021, 12:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X