అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సరికొత్త పథకం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి తీసుకుంటారు. అలాంటి వారు విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు లేక ఇబ్బందులు పడతారు. అలాంటి వారి కోసం వైయస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని తీసుకువచ్చారు.

ఆరోగ్యశ్రీ ఆసరా కింద రోజుకు రూ.225
ఆపరేషన్ అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5వేలు ఈ పథకం ద్వారా అందిస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడంలో దేశంలో ఇదే మొదటిసారి. కుటుంబంలోని పెద్దలు ఎవరైనా జబ్బుపడితే ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో ప్రతి సంవత్సరం లక్షలాదిమంది లబ్ధి పొందుతారని భావిస్తున్నారు.

48 గంటల్లో గంటల్లో డబ్బులు జమ
ఆపరేషన్ చేయించుకున్న వారు డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోపు రోగి బ్యాంకు ఖాతాలోకి ఈ సాయం మొత్తాన్ని జమ చేస్తారు. సోమవారం ఈ కార్యక్రమం ప్రారంభం సందర్బంగా జగన్ కొంతమంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఉపాధి లేని రోగులు పస్తులు ఉండకుండా చేసేందుకు ఈ పథకం తెచ్చినట్లు జగన్ చెప్పారు. జనవరి 1 నుంచి అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.

డబ్బులు అందకుంటే ఏం చేయాలి?
ఆపరేషన్ చేయించుకున్న రోగులకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5వేలు గరిష్టంగా ఆర్థిక సాయం చేస్తారు. అయితే అర్హులైన వారు ఎవరికైనా ఈ నగదు అందకుంటే వారు టోల్ ఫ్రీ నెంబర్ 104కు ఫోన్ చేయవచ్చు.

ఆరోగ్య ఆసరా స్కీం వివరాలు.. క్లుప్తంగా
వైయస్సార్ ఆరోగ్య ఆసరా పథకానికి ప్రతి సంవత్సరం రూ.300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. వైయస్సార్ ఆసరా వివరాలు...
మొత్తం స్పెషాలిటీ విభాగాలు - 26
ఎన్ని రకాల శస్త్ర చికిత్సలు - 836
రోజుకు ఇచ్చే మొత్తం - రూ.225
నెల రోజుల విశ్రాంతికి - రూ.5000
లబ్ధిదారుల సంఖ్య - నాలుగు లక్షలకు పైగా
ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చు - రూ.300 కోట్లు

రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ
ఇప్పటికే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1200 రోగాలు పెంచారు. మొత్తం 2వేల వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా జనవరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఆ తర్వాత దశలవారీగా 2వేల వ్యాధులకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం వర్తింప చేస్తారు. రూ.1000 ఖర్చు దాటితే పథకం వర్తింపచేస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు. జనవరి 1 నుంచి తలసేమియా, సికిల్ సెల్ రోగులకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications