For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon: 4 గంటలు పనిచేయండి.. నెలకు రూ.60వేలు సంపాదించండి: ఎలాగంటే..?

|

ఈ -కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఓ మంచి అవకాశం కల్పిస్తోంది. అమెజాన్ ఇండియా డబ్బు సంపాదించే ఛాన్స్ ప్రజలకు ఇస్తోంది. ఇక నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే దీన్ని సదావకాశంగా భావించొచ్చు. మీకు వీలున్న సమయంలో పనిచేయడం ద్వారా నెలకు రూ. 55వేల నుంచి రూ.60వేల వరకు సంపాదించొచ్చు. అయితే కేవలం నాలుగు గంటలు మాత్రమే పనిచేయడం ద్వారా నెలకు రూ.60వేల వరకు సంపాదించొచ్చు. ఇలాంటి మంచి ఆఫర్ ఏ కార్పొరేట్ కంపెనీ కూడా ఇవ్వదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం...

 డెలివరీ త్వరగా చేయాలని...

డెలివరీ త్వరగా చేయాలని...

అమెజాన్ భారత్‌లో శరవేగంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఒక ప్రాడక్ట్‌ను డెలివరీ చేసే సమయం వీలైనంత తక్కువగా చేయాలనే ఆలోచనతో ఉంది. ఇందుకోసం చర్యలు కూడా ప్రారంభించింది. ఈ ఉత్పత్తులను హోమ్ డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్ తప్పనిసరిగా ఉండాలి.

ముందుగా గోడౌన్‌ నుంచి ప్రాడక్ట్ కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత కస్టమర్‌కు ఆ ఉత్పత్తిని డెలివరీ చేయాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్‌గా మీరు పని చేయగల సామర్థ్యం ఉంటే మీరు నివాసం ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోని అమెజాన్ గోడౌన్‌ను సందర్శించి అక్కడ మీకు కావాల్సిన సమాచారంను తెలుసుకోండి

 రోజుకు 150 పార్శిల్స్ డెలివరీ...

రోజుకు 150 పార్శిల్స్ డెలివరీ...

అమెజాన్ సూచించిన ప్రకారం... డెలివరీ బాయ్ గోడౌన్ నుంచి ఉత్పత్తిని తీసుకుని ఆ ప్రాడక్ట్‌పై ఉన్న కస్టమర్ అడ్రస్‌కు డెలివరీ ఇవ్వాలి. ఇలా రోజుకు రూ.100 నుంచి 150 పార్శిల్‌లు డెలివరీ చేయాల్సి ఉంటుంది. డెలివరీ చేయాల్సిన కస్టమర్ అడ్రస్ గోడైన్ నుంచి 10 నుంచి 15 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఉంటాయి.

ఈ డెలివరీలను 4 నుంచి 5 గంటల సమయంలో చేరవేసే లక్ష్యంతో పనిచేయాలి. సకాలంలో చేరవేసేందుకు ప్రయత్నించాలి. డెలివరీ సమయం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం 8 గంటలకల్లా ముగించాలి. అయితే మీకు నచ్చిన సమయంలో ఈ పనిని ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎలా అప్లయ్ చేయాలి..?

ఎలా అప్లయ్ చేయాలి..?

ఇక అమెజాన్ డెలివరీ బాయ్స్‌ ఉద్యోగం కోసం అప్లయ్ చేయాలనుకుంటే ఇక్కడ((https://logics.amazon.in/applynow)ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి. లేదా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి. అయితే డెలివరీ బాయ్‌కు ఉండాల్సని విద్యార్హతలను కూడా అమెజాన్ ఇండియా సంస్థ స్పష్టం చేసింది. అభ్యర్థి కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలనే నిబంధన పెట్టింది. పాఠశాల లేదా కాలేజ్‌లో విద్యను పూర్తి చేసిన వారు ఇందుకు సంబంధించి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే డెలివరీ కోసం సొంతంగా బైక్‌ లేదా స్కూటర్ కలిగి ఉండాలి. ద్విచక్రవాహనంకు తప్పనిసరిగా ఇన్ష్యూరెన్స్‌తో పాటు ఆర్సీ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.

 జీతభత్యాలు ఎలాగుంటాయి

జీతభత్యాలు ఎలాగుంటాయి

డెలివరీ బాయ్‌కు ప్రతి నెలా రెగ్యులర్‌గా జీతం వస్తుంది. అంటే నెలకు రూ.12వేల నుంచి 15వేలు ఉంటుంది. ఇక పెట్రోల్‌ ఛార్జీలను డెలివరీ బాయ్ సొంత జేబు నుంచే భరించాల్సి ఉంటుంది. అయితే డెలివరీ చేసే ఒక్కో వస్తువుపై రూ.10 ఇన్సెంటివ్‌గా ఇవ్వబడుతుంది. అంటే రోజుకు 150 పార్శిళ్లను కస్టమర్ల అడ్రస్‌కు డెలివరీ చేస్తే రోజుకు రూ.1500 వస్తుంది. దీంతో నెలకు సంపాదన రూ.45వేలు అవుతుంది. ఇక జీతం ఎలాగు రూ. 12 నుంచి రూ.15వేల వరకు వస్తుంది కాబట్టి ఈ మొత్తం రూ.60వేలకు చేరుకుంటుంది. ఇందులో పెట్రోల్ ఛార్జీలు రూ.8వేలు పక్కకు తీసినా మీ సంపాదన రూ.52వేలు ఉంటుంది.

చిన్న సంస్థలను ప్రోత్సహిస్తున్న అమెజాన్

చిన్న సంస్థలను ప్రోత్సహిస్తున్న అమెజాన్

అమెజాన్ సంస్థ MSMEలను కూడా ప్రోత్సహిస్తోంది. వాటికి వ్యాపార అవకాశాలను కూడా కల్పిస్తోంది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్‌ ఈవెంట్‌ను జూలై 26-27వ తేదీల్లో నిర్వహించింది. 100కు పైగా చిన్న మరియు మధ్యతరహా వ్యాపారవేత్తలకు విక్రయ అవకాశాలను కల్పించింది. ఇందులో లాన్ మరియు గార్డెన్, కిరాణా, ఎలక్ట్రానిక్స్, ఇల్లు మరియు వంటగది సామాన్లు, ఫ్యాషన్, బ్యూటీ ప్రాడక్ట్స్, జ్యువెలరీ, మరియు స్టేషనరీలతో సహా 2400 ఉత్పత్తులకు పైగా అమ్మకానికి పెట్టింది.

English summary

Amazon:work for 4 hours and earn Rs 60000 a month,Here is How

E-Commerce giant Amazon had issued a notification to fill up delivery boys posts. Nice salary is promised by the company.
Story first published: Thursday, August 12, 2021, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X