For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ గుడ్‌న్యూస్: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం, గడువు, ఫీజు, ఏ ప్రాంతాల్లో... వివరాలు ఇవే...

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 30, 2018 నాటికి ఉన్న స్థలాలకు క్రమబద్ధీకరణ అవకాశమిచ్చారు. స్థలాలను DPCP క్రమబద్ధీకరణ చేయనుంది. తన పరిధిలో HMDA స్థలాలను క్రమబద్దీకరించనుంది. కొత్తగా ఏర్పాటైన 73 పురపాలక సంఘాలు, నగర పాలస సంస్థల పరిధిలో అనుమతులు లేకుండా, అక్రమంగా నిర్మించిన లే అవుట్ల క్రమబద్దీకరణ (LRS)కు అవకాశమిచ్చారు.

రైతు భరోసాకు రూ.1,000 పెంచారు కానీ, అందుకే ఇలా చేశారా?రైతు భరోసాకు రూ.1,000 పెంచారు కానీ, అందుకే ఇలా చేశారా?

90 రోజుల గడువు.. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..

90 రోజుల గడువు.. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..

2018 మార్చి 30వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న LRSను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మంగళవారం నుంచి (అక్టోబర్ 15) 90 రోజుల గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆన్ లైన్ ద్వారానే స్థలాల క్రమబద్దీకరణ దరఖాస్తులు స్వీకరిస్తారు. కొత్తగా ఏర్పడిన 73 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోనూ ఇది అమలు కానుంది.

ఎంత చెల్లించాలి.. 10 శాతం లేదా రూ.10,000

ఎంత చెల్లించాలి.. 10 శాతం లేదా రూ.10,000

మొత్తం క్రమబద్దీకరణ వ్యయంలో 10% చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా రూ.10,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండింట్లో ఏది తక్కువ అయితే దానిని చెల్లించవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధీకృత లేఖ జారీ అనంతరం HMDA లేదా DTCP (డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్) విభాగాలకు చెల్లించాలి.

ఇవి తప్పనిసరి..

ఇవి తప్పనిసరి..

లే అవుట్లలో రోడ్లు, డ్రైనేజీ పనులు, నీటి సరఫరా వ్యవస్థ, వాననీటి సంరక్షణ ఏర్పాట్లు, వీధి దీపాలు ఏర్పాటయి ఉండాలి. ఖాళీ స్థలాలు అయితే ప్రహరీ లేదా ఫెన్సింగ్ వంటివి తప్పనిసరిగా ఉండాలి. భూమి మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా ఛార్జ్ నిర్ణయిస్తారు.

ఆరు నెలల్లో క్రమబద్ధీకరణ.. తిరస్కరిస్తే అప్పీలేట్‌కు...

ఆరు నెలల్లో క్రమబద్ధీకరణ.. తిరస్కరిస్తే అప్పీలేట్‌కు...

ఛార్జీ మొత్తం చెల్లించిన తర్వాత ఆరు నెలల లోపు క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. నివాస స్థలాలు కాని ప్రాంతాలకు నిబంధనల మేరకు అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. ఏ కారణంతో అయినా అప్లికేషన్ తిరస్కరించబడితే దరఖాస్తుదారులు అప్పీలేట్ అథారటికీ వెళ్లవచ్చు.

ఇక్కడ క్రమబద్ధీకరణ నో...

ఇక్కడ క్రమబద్ధీకరణ నో...

నాలా పరిధి, శిఖం, నీటి వనరులు, నదీ పరివాహక ప్రాంతాల పరిధిలోని వాటికి గ్యాస్, ఆయిల్ పైప్ లైన్లు ఉన్న ప్రాంతాల్లోని లే అవుట్లకు క్రమబద్దీకరణ ఉండదు.

LRS ద్వారా వందల కోట్ల ఆదాయం

LRS ద్వారా వందల కోట్ల ఆదాయం

2015లో వచ్చిన LRSలో గ్రేటర్ హైదరాబాదుతో పాటు శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, పంచాయతీలకు అవకాశం కల్పించారు. ఈసారి ఎల్ఆర్ఎస్‌ను కొత్త కార్పోరేషన్లు, మున్సిపాలిటీలకు అవకాశం కల్పించారు. గతంలో ఎల్ఆర్ఎస్ ద్వారా HMDAకు రూ.950 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా వందల కోట్ల ఆదాయం వస్దుందని భావిస్తున్నారు.

అప్లికేషన్ ఫామ్‌లో ఏమున్నాయంటే?

అప్లికేషన్ ఫామ్‌లో ఏమున్నాయంటే?

- LRS అప్లికేషన్ ఫామ్‌లో మీ వివరాలు నింపవలసి ఉంటుంది. ఇందులో దరఖాస్తుదారు పేరు, పోస్టల్ అడ్రస్, డోర్ నెంబర్, వీధి పేరు, మీరు ఉండే లోకాలిటీ, నగరం లేదా పట్టణం, ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలి.

- వీటితో పాటు లే అవుట్ పేరు లేదా కాలనీ పేరు, సర్వే నెంబర్, రెవెన్యూ విలేజ్, మండలం, జిల్లా వివరాలు ఇవ్వాలి.

- లే అవుట్ ఎక్సెంట్ అయితే అందుకు సంబంధించిన వివరాలు, ప్లాట్ ఏరియా వంటి వివరాలు ఇవ్వాలి. 30-03-2018 నాటికి మార్కెట్ వ్యాల్యు వివరాలు కూడా ఇవ్వాలి.

- మాస్టర్ ప్లాన్ ప్రకారం ల్యాండ్‌ను ఎందుకు ఉపయోగించాలనుకున్నారనే వివరాలు ఇవ్వాలి.

- ఆ తర్వాత చెల్లింపులకు సంబంధించిన వివరాలు.. డీడీ నెంబర్, తేదీ, బ్యాంకు పేరు, బ్రంచీ వివరాలు ఇవ్వాలి.

ఈ 73... మున్సిపాలిటీలు/కార్పోరేషన్స్!

ఈ 73... మున్సిపాలిటీలు/కార్పోరేషన్స్!

1. మంచిర్యాల జిల్లాలో 4 ఉన్నాయి. నస్పూర్ మున్సిపాలిటీ, చెన్నూర్ మున్సిపాలిటీ, క్యాంతంపల్లి మున్సిపాలిటీ, లక్సెట్టిపేట మున్సిపాలిటీ

2. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపాలిటీ

3. కరీంనగర్ జిల్లాలో 2 ఉన్నాయి. చొప్పదండి మున్సిపాలిటీ, కొత్తపల్లి మున్సిపాలిటీ.

4. జగిత్యాల జిల్లాలో 2 ఉన్నాయి. రాయికల్ మున్సిపాలిటీ, ధర్మపురి మున్సిపాలిటీ.

5. పెద్దపల్లి జిల్లాలో 2 ఉన్నాయి. మంథని మున్సిపాలిటీ, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు.

6. వికారాబాద్ జిల్లాలో పరిగి మున్సిపాలిటీ, కొడంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి

7. రంగారెడ్డి జిల్లాలో మీర్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్, జాలపల్లి మున్సిపాలిటీ, శంషాబాద్ మున్సిపాలిటీ, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ, నార్సింగ్ మున్సిపాలిటీ, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పోరేషన్, ఆదిబట్ల మున్సిపాల్టీ, శంకరపల్లి మున్సిపాలిటీ, తుక్కుగూడ మున్సిపాలిటీ, ఆమంగల్ మున్సిపాలిటీ ఉన్నాయి.

8. మేడ్చల్ - మల్కాజిగిరి పరిధిలో బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్, దమ్మాయిగూడ మున్సిపల్ కార్పోరేషన్ నాగారం మున్సిపాలిటీ, పోచారం మున్సిపాలిటీ, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, తూంకుంట మున్సిపాలిటీ, నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్, కొంపల్లి మున్సిపాలిటీ, దుండిగల్ మున్సిపాలిటీ. చివరి రెండు స్లైడ్స్‌లలో మొత్తం మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పేరు చూడవచ్చు.

English summary

తెలంగాణ గుడ్‌న్యూస్: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం, గడువు, ఫీజు, ఏ ప్రాంతాల్లో... వివరాలు ఇవే... | Telangana announces Layout Regularisation Scheme

The Telangana government has issued orders for a new scheme to regularise unapproved layouts for the newly constituted municipal corporations and municipalities.
Story first published: Wednesday, October 16, 2019, 10:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X