For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా రీఫండ్ కాలేదా? ఇలా చేసి చూడండి!

|

న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసినా సమయానికి మీకు రీఫండ్ కాలేదా? అయితే ఆందోళన అవసరం లేదు. మీరు బ్యాంకు వివరాలు తప్పుగా ఇవ్వడంతో పాటు ఆలస్యం కావడానికి వివిధ రకాల కారణాలు ఉంటాయి. ఇదివరకు ట్యాక్స్ రీఫండ్ చెక్ రూపంలో లేదా నేరుగా బ్యాంకు అకౌంట్లో జమ చేయబడేది. ప్రస్తుతం బ్యాంకు అకౌంట్లో జమ అవుతోంది. ఈ బ్యాంకు అకౌంట్ పాన్‌తో లింక్ అయి ఉండాలి. మీ ఆదాయం నుంచి ఎక్కువ ట్యాక్స్ డిడక్ట్ అయితే రీఫండ్ మార్గంలో దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు ఇందుకు సంబంధించిన వివరాలు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి.

వ్యక్తిగత ఆదాయపుపన్ను రిలీఫ్: స్లాబ్స్, మినహాయింపులు మారొచ్చు, అద్దె చెల్లింపుపై పన్ను బ్రేక్వ్యక్తిగత ఆదాయపుపన్ను రిలీఫ్: స్లాబ్స్, మినహాయింపులు మారొచ్చు, అద్దె చెల్లింపుపై పన్ను బ్రేక్

నిమిషాల్లో స్టేటస్.. రీఫండ్ కోసం వెయిట్ చేయాలి

నిమిషాల్లో స్టేటస్.. రీఫండ్ కోసం వెయిట్ చేయాలి

ట్యాక్స్ రీఫండ్ స్టేటస్‌ను మీరు చూసుకోవచ్చు. ఇదివరకు రీఫండ్ గురించి తెలుసుకోవడానికి సంబంధిత అధికారులను కలుసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నిమిషాల్లో మీ రీఫండ్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన అనంతరం రీఫండ్ మీ అకౌంట్లో జమ కావడానికి కొద్ది రోజులు నిరీక్షించవలసి ఉంటుంది.

స్టేటస్ తెలుసుకోవాలి...

స్టేటస్ తెలుసుకోవాలి...

ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి మీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. www.incometaxindia.gov.in లేదా www.tin-nsdl.com ద్వారా తెలుస్తుంది.

Status of Tax Refunds కు వెళ్లి పాన్ నెంబర్, అసెస్‌మెంట్ ఇయర్ పేర్కొనాలి. అప్పుడు మీకు పాపప్ సందేశం వస్తుంది. చెల్లింపు మోడ్, రిఫరెన్స్ నెంబర్, స్టేటస్, రీఫండ్ డేట్ వంటి వివరాలు ఉంటాయి. అయితే రీఫండ్ చేయబడితేనే ఈ స్టేటస్ తెలుస్తుంది. అయితే ఏదైనా సమస్య వల్ల రీఫండ్ కాకుంటే అందుకు అనుగుణంగా సందేశం ఉంటుంది.

బ్యాంకు అకౌంట్ వివరాలు తప్పుగా ఇవ్వొచ్చు

బ్యాంకు అకౌంట్ వివరాలు తప్పుగా ఇవ్వొచ్చు

ఉదాహరణకు రీఫండ్ అన్‌పెయిట్ అని వస్తే కనుక మీరు బ్యాంకు అకౌంట్ వివరాలు తప్పుగా ఇవ్వడమో లేక మరో సమస్యనో ఉండి ఉంటుంది. బ్యాంకు ఖాతా కావొచ్చు లేదా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కావొచ్చు. ఇంతకుముందు సమర్పించిన బ్యాంకు వివరాలు వెరిఫై చేసుకోండి. సేవింగ్స్, కరెంట్ అకౌంట్.. ఇలా అన్ని వివరాలు కచ్చితంగా ఆదాయపు పన్ను విభాగం నిబంధనల మేరకు ఇవ్వాలి. కనీసం మూడేళ్లు అంతకంటే ఎక్కువ కాలంగా పని చేయని అకౌంట్ వివరాలు అవసరం లేదు.

ఏ బ్యాంకు అకౌంట్ ఇవ్వకుంటే జమ కాదు

ఏ బ్యాంకు అకౌంట్ ఇవ్వకుంటే జమ కాదు

ట్యాక్స్ పేయర్ రీఫండ్ కోసం బ్యాంకు అకౌంట్ నెంబర్ అందించాల్సి ఉంటుంది. రీఫండ్ కాకపోయినా లింక్ చేసుకోవాలి. మీకు విదేశాల్లో బ్యాంకు అకౌంట్ ఉంటే ఆ వివరాలు ఇవ్వాలి. అంటే బ్యాంకు పేరు, అకౌంట్ నెంబర్, 11 డిజిట్ ఐఎఫ్ఎస్‌ కోడ్ ఇవ్వాలి. ఏ బ్యాంకు వివరాలు ఇవ్వకపోతే రీఫండ్ కాదు.

English summary

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా రీఫండ్ కాలేదా? ఇలా చేసి చూడండి! | Not received your tax refund? Here is what you should do

Filed your income tax return (ITR) for the assessment year (AY) 2019-20 on time but yet not receive your refund? Don't worry. You may just have furnished incorrect bank details. Of course, there may be other reasons for the delay, though this is the most prominent.
Story first published: Friday, October 25, 2019, 14:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X