For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త... అందుబాటులోకి మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం

|

పోస్టాఫిసు సేవింగ్స్ ఖాతాదారులకు మరో నూతన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తన సేవింగ్స్ ఖాతా కస్టమర్ల కోసం మొబైల్ బ్యాంకింగ్ సేవను ప్రారంభించింది. ఈ సదుపాయాన్ని కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) పోస్టాఫీసుల్లోని మొత్తం సేవింగ్స్ ఖాతాదారులకు అక్టోబర్ 15 నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు సర్క్యులర్ ను జారీ చేశారు. ఇప్పటికే తపాలా శాఖా తన సేవింగ్స్ ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రారంభించిన ఏడాది తర్వాత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును ప్రారంభించారు.

ఎవరు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వాడుకోవచ్చంటే...

ఎవరు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వాడుకోవచ్చంటే...

* సీబీఎస్ పోస్ట్ ఆఫీస్ లో కస్టమర్లు తప్పనిసరిగా సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి.

* ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు సంభందించి వాలిడ్ లాగిన్, ట్రాన్సాక్షన్ పాస్ వర్డ్ కలిగి ఉండాలి.కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ తో పాటు మొబైల్ బ్యాంకింగ్ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలి.

* సింగిల్ లేదా జాయింట్ 'బి' ఖాతా రకం కస్టమర్లు అర్హులు.

* జాయింట్ 'ఏ' మైనర్, నిరక్షరాస్యులు, బ్రాంచ్ ఆఫీస్ అకౌంట్స్ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందటానికి అవకాశం ఉండదు.

మొబైల్ బ్యాంకింగ్ కు ఇవి అవసరం..

మొబైల్ బ్యాంకింగ్ కు ఇవి అవసరం..

* మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకుంటే దానికి కొన్ని వివరాలు అందించాల్సి ఉంటుంది. అవేమిటంటే..

* కస్టమర్ కు తప్పనిసరిగా వినియోగంలో ఉన్న ఇమెయిల్ ఐడీ ఉండాలి.

* వాలిడ్ పాన్ తప్పనిసరి

* మొబైల్ నెంబర్

* సీఐఎఫ్ ఐడీ లేదా కస్టమర్ ఐడీ ఉండాలి. ఇది కస్టమర్ పాస్ బుక్ లోని మొదటి పేజీలో ప్రింట్ చేసి ఉంటుంది.

దరఖాస్తు ఇలా ...

దరఖాస్తు ఇలా ...

* అర్హత కలిగిన పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారులు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కోసం బ్రాంచ్ ఆఫిసులో కాకుండా సీబీఎస్ హెడ్/సబ్ పోస్టాఫీసులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* కేవైసీకీ సంబందించిన ప్రక్రియను పూర్తి పూర్తి చేయాలి. సేవింగ్స్ ఖాతా ఉన్న సీబీఎస్ పోస్టాఫీసులో ఫామ్ ను ఇవ్వాల్సి ఉంటుంది.

* మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కోసం మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఒకే నెంబర్ ను మరో కస్టమర్ ఐడీకి వినియోగించరాదు.

* దరఖాస్తు సమర్పించిన తర్వాత మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఎనేబుల్ చేస్తారు.

* ఇండియా పోస్ట్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ సదుపాయాలు ఉంటాయి...

ఈ సదుపాయాలు ఉంటాయి...

* మొబైల్ బ్యాంకింగ్ ద్వారా సేవింగ్స్, రీకరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, పీపీఎఫ్ పై లోన్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కు సంబంధించిన వివరాలు పొందవచ్చు..

* లావాదేవీల వివరాలు

* సేవింగ్, పీపీఎఫ్ మినీ స్టేట్ మెంట్

* సొంత సేవింగ్స్ అకౌంట్, ఇతర పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు.

* ఆర్దీ అకౌంట్ ఓపెనింగ్, టైం డిపాజిట్ అకౌంట్ ఓపెనింగ్

* చెక్ పేమెంట్ నిలిపివేత అభ్యర్థన

మొబైల్ బ్యాంకింగ్ అవసరం లేదనుకుంటే పోస్టాఫీసు శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఈ సదుపాయాన్ని డిజేబుల్ చేస్తారు.

English summary

పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త... అందుబాటులోకి మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం | India Post launches mobile banking facility for savings accounts

Using your post office savings account just became easier. The Department of Post, through a circular on Monday, announced that it has launched mobile banking for its savings account customers.
Story first published: Sunday, October 20, 2019, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X