For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్ఫ్ డ్యామేజ్ ఇన్సూరెన్సు కవర్ విషయంలో ఇలా చేయండి...

|

వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. అయితే దీనితో పాటు ఓన్ (సెల్ఫ్) డ్యామేజ్ పాలసీని కూడా చాలామంది తీసుకుంటారు. దీనివల్ల వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా రక్షణ లభిస్తుంది. అయితే భారత బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీయే) కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ రెండు బీమా కవరేజీలను వేర్వేరుగా కొనుగోలు చేయవచ్చు. వీటిని ఒక బీమా సంస్థ నుంచి లేదా ఇతర బీమా సంస్థలనుంచి తీసుకునే అవకాశం కల్పించారు. ఐఆర్డీయే నూతన మార్గదర్శకాల ప్రకారం స్టాండ్ అలోన్ యాన్యువల్ ఓన్ డ్యామేజ్ పాలసీ (అగ్ని ప్రమాదం, దొంగతనాల కోసం స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీ) ని బీమా కంపెనీలు తమ అభీష్టం మేరకు తీసుకురావచ్చు.

స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీ?

స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీ?

* సాధారణంగా ఓన్ డ్యామేజ్ (ఓడీ) పాలసీ స్టాండర్డ్ మోటార్ ఇన్సూరెన్సు పాలసీలో భాగంగా ఉంటుంది. అంటే ఈ పాలసీలో ఓన్ డ్యామేజ్, థర్డ్ పార్టీ కవరేజీ కలిసి ఉంటుందన్నమాట. ఇంతకు ముందు థర్డ్ పార్టీ బీమా మాత్రమే వేరేగా ఉండేది. ఓడీ పాలసీ ఉండేది కాదు. అప్పుడు ఓడీ పాలసీని థర్డ్ పార్టీ కవర్ తో కలిపి కొనుగోలు చేయాల్సి వచ్చేది.

* ఐఆర్డీయే నూతన మార్గదర్శకాల ప్రకారం ఈ రెండు పాలసీలను కూడా బీమా తీసుకోవాలనుకునే వారు వేర్వేరుగా కొనుగోలు చేయవచ్చు. ఒకే బీమా కంపెనీ లేదా వేర్వేరు బీమా కంపెనీల ద్వారా ఈ పాలసీలను తీసుకోవచ్చు. అప్పుడు ఓడీ పాలసీని స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీగా పరిగణిస్తారు.

* ఓన్ డ్యామేజ్ పాలసీ ద్వారా వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ప్రకృతి విపత్తుల ద్వారా నష్టం జరిగినా బీమా కవరేజీ లభిస్తుంది. మీ వాహనం మూలంగా ఎవరికైనా నష్టం జరిగితే థర్డ్ పార్టీ బీమా ద్వారా కవరేజీ అందుతుంది.

ఇవి ముఖ్యం...

ఇవి ముఖ్యం...

* ఐఆర్డీయే నూతన మార్గదర్శకాల ప్రకారం బీమా కంపెనీలు దీర్ఘకాల స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీలను జారీ చేయడానికి వీలులేదు.

* అంటే కార్లకు మూడేళ్లకు, టూవీలర్లకు 5 ఏళ్లకు ఓడీ ప్లాన్ ఇవ్వరాదు.

* దీని వల్ల ప్రతి ఏడాది ఓడీ పాలసీని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికే బీమా ఇచ్చిన కంపెనీ నుంచి లేదా మరో కంపెనీ నుంచి ఈ బీమాను పొందవచ్చు.

* థర్డ్ పార్టీ బీమా కలిగి ఉన్న వారికి ఓడీ పాలసీని కంపెనీ ఆఫర్ చేయవచ్చు. లేదా రెండింటినీ ఇవ్వవచ్చు.

* ఓడీ పాలసీలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు కు సంబంధించిన బీమా కంపెనీ పేరు, పాలసీ నెంబర్, దాని ప్రారంభ తేదీ, ముగింపు తేదీ వంటి వివరాలు తప్పని సరిగా ఉండాలి.

* ఓడీ పాలసీలను తీసుకునే ముందు ఒకేసారి వివిధ బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్న బీమా ధరలను సరిచూసుకోండి.

* బీమా కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది కాబట్టి తక్కువ ధరలకు బీమా పాలసీ లభించే అవకాశం ఉంటుంది.

స్టాండ్ అలోన్ పార్టీ పాలసీ

స్టాండ్ అలోన్ పార్టీ పాలసీ

* సాధారణంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు ను ఏడాదికి ఇస్తుంటారు.

* అయితే కార్లకు మూడేళ్లకు, టూవీలర్లకు ఐదేళ్లకు థర్డ్ పార్టీ బీమాను ఇచ్చేందుకు గత సంవత్సరంలో ఐఆర్డీయే అనుమతించింది.

* దీని దీర్ఘకాలిక స్టాండ్ అలోన్ థర్డ్ పార్టీ బీమా పాలసీగా వ్యవహరిస్తారు.

* ప్రతి ఏటా బీమాను రెన్యూవల్ చేసుకోవడం ఎందుకు అనుకునే వారు దీర్ఘకాలిక బీమాను తీసుకోవచ్చు.

English summary

సెల్ఫ్ డ్యామేజ్ ఇన్సూరెన్సు కవర్ విషయంలో ఇలా చేయండి... | Why to get self damage car insurance

Your auto insurance company will only pay to repair self inflicted damage to your car (like if you damage your car while parking) if your policy includes collision coverage. So if you have collision coverage in these instances, you're all set.
Story first published: Saturday, September 21, 2019, 18:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X