For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకోండి, బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?

|

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రవేశపెట్టింది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద జనవరి 2015లో దీనిని ప్రారంభించింది. ఈ పథకంలో ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరు మీద సంవత్సరానికి రూ.250 మొదలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. సేవింగ్స్ స్కీమ్‌లపై బ్యాంకులు అందించే వడ్డీ రేటు కంటే సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.

రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన...రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన...

SSY వడ్డీ రేటు

SSY వడ్డీ రేటు

SSY ప్రస్తుత వడ్డీ రేటు ఏడాదికి 8.4 శాతంగా ఉంది. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ ఫ్రీ. మెచ్యురిటీ, వడ్డీ రేటుకు ట్యాక్స్ ఫ్రీ వర్తిస్తుంది. పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. వడ్డీ రేటు క్వార్టర్లీ బేస్‌గా మారుతుంది.

గరిష్టం.. కనిష్టం

గరిష్టం.. కనిష్టం

పదేళ్ల లోపు ఆడపిల్లలు ఇద్దరి పైన ప్రతి నెల కొంతమొత్తం జమ చేయవచ్చు. తల్లిదండ్రులు లేదా చట్టబద్దమైన సంరక్షకులు ఆ ఆడపిల్లల తరఫున ఇన్వెస్ట్ చేయవచ్చు. దత్తత తీసుకున్న బాలిక పేరిట కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఏదైనా పోస్టాఫీస్ లేదా ఆథరైజ్డ్ బ్యాంకుల్లో దీనిని తెరువవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు కనీసం రూ.1,000 వరకు డిపాజిట్ చేయవచ్చు.

విత్ డ్రా

విత్ డ్రా

ఆడపిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ పథకాన్ని శాశ్వతంగా క్లోజ్ చేయవచ్చు. ఆడపిల్లకు మెచ్యూరిటీ నిండిన తర్వాత ఈ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. తొలుత దీనికి అనుమతి లేకపోయింది. ఆడపిల్ల చదువుకు లేదా పదో తరగతి అయినపోయిన తర్వాత కూడా అవసరమైతే పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు.

ఆన్‌లైన్‍‌లో దరఖాస్తు చేయలేరు...

ఆన్‌లైన్‍‌లో దరఖాస్తు చేయలేరు...

ఏదైనా ఆథరైజ్డ్ బ్యాంకు బ్రాంచ్ లేదా పోస్టాఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ప్రస్తుతానికి పోస్టాఫీసులు లేదా బ్యాంకులు ఆన్ లైన్ ద్వారా SSY అకౌంట్ ఓపెనింగ్‌ను అనుమతించడం లేదు. అన్ని డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాత, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఆన్‌లైన్‌లో సెట్ చేయవచ్చు.

ఇవి సబ్‌మిట్ చేయాలి...

ఇవి సబ్‌మిట్ చేయాలి...

- తొలుత మీరు SSY అకౌంట్ ఓపెనింగ్ ఫామ్‌ను నింపాలి.

- అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్, అమ్మాయి బర్త్ సర్టిఫికేట్‌తో పాటు గార్డియన్ లేదా పేరెంట్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్స్ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.

భవిష్యత్తులో ఆన్ లైన్ బదలీ కోసం...

భవిష్యత్తులో ఆన్ లైన్ బదలీ కోసం...

- రూ.250 నుంచి రూ.1.50 మధ్య ఎంత మొత్తమైనా మీరు చెల్లించవచ్చు.

- భవిష్యత్తులో ఆన్ లైన్ బదలీల కోసం మీరు బ్రాంచ్‌లో స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా SSY ఖాతాకు ఆటోమేటిక్‌గా క్రెడిట్ అయ్యేలా సెటప్ చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో SSY ఖాతా బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?

ఆన్‌లైన్‌లో SSY ఖాతా బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?

- సంబంధిత బ్యాంకు నుంచి SSY ఖాతా లాగిన్ వివరాలు తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకోండి.

- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం అన్ని బ్యాంకులు అందించడం లేదు. కొన్ని బ్యాంకులు మాత్రమే ఆన్ లైన్ ద్వారా SSY అకౌంట్ హోల్డర్స్ చెక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

బ్యాలెన్స్...

బ్యాలెన్స్...

- బ్యాంకులు మీకు లాగిన్ డిటైల్స్ ఇచ్చిన తర్వాత బ్యాంకు పోర్టల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లాలి.

- లాగిన్ అయ్యాక అకౌంట్ హోమ్ పేజీకి వెళ్లండి. అక్కడ మీ బ్యాలెన్స్ ఎంతో తెలుస్తుంది. ఖాతా డ్యాష్ బోర్డులోను కనిపిస్తోంది.

SSY అర్హత

SSY అర్హత

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల తరఫున ఒక చట్టపరమైన సంరక్షకులు తెరువవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు లేదా ఒకే కాన్పులో ఇద్దరు ట్విన్స్ (ఇద్దరూ ఆడపిల్లలై ఉండాలి) పుట్టిన సందర్భాల్లో లేదా మొదటి కాన్పులో ఒకేసారి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో ముగ్గురు ఆడపిల్లలు ఈ స్కీంలో చేరవచ్చు.

English summary

సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకోండి, బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? | Sukanya Samriddhi Yojana: How to open an SSY account and check balance online

To benefit girl children, Sukanya Samriddhi Scheme was introduced by the government. It currently offers an interest rate of 8.4 per cent per annum, and under Section 80C of the Income Tax Act, 1961, it comes with tax-free maturity and interest, and tax deductions are also available.
Story first published: Wednesday, September 11, 2019, 14:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X