For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్: భారత్ లో బీమా తీసుకుంటే లాభాలెన్నో!

|

ప్రవాస భారతీయులు (ఎన్ ఆర్ ఐ) తమ స్వదేశంలో జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు భారత్ లో ఇన్సూరెన్స్ కొనుగోలు చేయని వారు ఇప్పుడు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో పెట్టుబడులపై మంచి రాబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్ఆర్ఐల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీమా కంపెనీలు తగిన పాలసీలు అందిస్తున్నాయి. అయితే వీటిని తీసుకునే ముందు కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. అవేమిటంటే..

చిన్నదానికీ క్లెయిమ్ చేసుకుంటే చిక్కులే మరి...చిన్నదానికీ క్లెయిమ్ చేసుకుంటే చిక్కులే మరి...

అర్హతలు

అర్హతలు

* కొన్ని షరతులకు లోబడి ఎన్ఆర్ఐలు భారత్ లో జీవిత బీమాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

* బీమా తీసుకోవలనుకునే వ్యక్తికి తప్పనిసరిగా భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్ట్ ఉండాలి.

* వ్యక్తి లేదా అతని తల్లిదండ్రులు లేదా తాతలు భారత పౌరులై ఉండాలి.

ఎంపిక...

ఎంపిక...

బీమా తీసుకోవడానికి అవసరమైన అర్హతలు ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత మీకు ఎక్కువ విశ్వాసం ఉన్న కంపెనీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనదేశం లో20 కి పైగా బీమా కంపెనీలు వివిధ రకాల బీమా పాలసీలు అందిస్తున్నాయి. అయితే మీరు బీమా కంపెనీ యాజమాన్యం ఏవిధంగా ఉందొ చూసుకోవాలి. అంతేకాకుండా ఇంతకు ముందు ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏవిధంగా ఉందొ చూసుకోవాలి. కంపెనీ ట్రాక్ రికార్డ్, ఒక వేళ ఆ కంపెనీకి మాతృ సంస్థ ఉంటే దాని పని తీరు కూడా చూసుకోవాలి.

* బీమా కంపెనీల సేవలు ఏవిధంగా ఉన్నాయో ఆన్ లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కంపెనీకి ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాలు ఉంటున్నాయి.వాటి ద్వారా కంపెనీ సర్వీసులకు సంభందించి కస్టమర్లు తమ అభిప్రాయాలు చెబుతుంటారు. అంతేకాకుండా రేటింగ్ ఇస్తుంటారు కాబట్టి దాన్ని బట్టి కంపెనీని ఎంచుకోవచ్చు.

ప్రయోజనం చూసుకోండి

ప్రయోజనం చూసుకోండి

* జీవిత బీమాను తీసుకోవడం వల్ల మీకు లభించే ప్రయోజనం గురించి తెలుసుకోండి.

* మనదేశంలోనే కాకుండా ప్రస్తుతం మీరు ఉంటున్న దేశంలో అమల్లో ఉన్న పన్ను చట్టాల గురించి తెలుసుకోండి.

* పాలసీ కొనుగోలు కోసం పెట్టే పెట్టుబడి మొత్తం, పాలసీ సొమ్ము, మెచురిటీ సమయంలో వచ్చే సొమ్ముకు సంబంధించి పన్నులు ఏవిధంగా ఉన్నాయో చూసుకోండి.

* మన దేశంలో అయితే వీటిపై పన్ను లేదు. మీరు ఉంటున్న దేశంలో కూడా ఇదే విధంగా ఉన్నదో లే దో చూసుకోండి.

* ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో బీమా ఖర్చు తక్కువగానే ఉంటుంది. బీమా పై ఎక్కువ ప్రయోజనం కలుగు తుంది.

* మన దేశంలో బీమా పాలసీలు చవకగా ఉండటమే కాకుండా సమగ్రంగా ఉంటాయి.

చెల్లింపులు...

చెల్లింపులు...

* మీరు తీసుకునే బీమా పాలసీకి సంబంధించి బీమా ప్రీమియం చెల్లింపు విధానాలు ఏవిధంగా ఉన్నాయో ముందుగానే చూసుకోవాలి. దీని వల్ల ప్రీమియం చెల్లింపులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది.

* విదేశీ కరెన్సీ లేదా ఎన్ఆర్ఈ /ఎఫ్ సీఎన్ఆర్ ఖాతా లేదా ఎన్ఆర్ఓ ఖాతాల ద్వారా ప్రీమియం ను రూపాయల్లో చెల్లించే సదుపాయం ఉంటుంది. కాబట్టి వీటిలో ఏది మీకు సౌకర్యం గా ఉంటుందో చూసుకోవాలి.

ఆరోగ్య పరీక్షలు....

ఆరోగ్య పరీక్షలు....

* జీవిత బీమాను కొనుగోలు చేసే సమయంలో ఆరోగ్య పరీక్షలు కూడా అవసరం ఉంటాయి. వీటి కోసం అవసరమైతే మీరు భారత్ కు రావాల్సి ఉంది. లేదా విదేశాల్లోనే పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్టులు బీమా కంపెనీకి పంపాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన ప్రక్రియ ఏవిధంగా ఉంటుందో బీమా కంపెనీని సంప్రదించి తెలుసుకోవడం మంచిది.

* ముఖ్యంగా ఈ పాలసీ ల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందడానికి వీలుగా సరైన పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిపుణులను సంప్రదించడం మంచిది.

* టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను చాలా తక్కువ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు.

* తమకే కాకుండా తమ కుటుంబ సభ్యులకు కూడా బీమా తీసుకోవచ్చు.

* బీమా కొనుగోలు చేసేటప్పుడు దేశంలొనే ఉండాల్సిన అవసరం లేదు. అయితే దేశంలో ఉన్నప్పుడే బీమాను తీసుకుంటే... ఆరోగ్య పరీక్షలు అవసరమైనప్పుడు సులభం అవుతుంది. ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది.

* కొన్ని బీమా కంపెనీలు విదేశాల్లో కూడా తమ కార్యాలయాలను ఏర్పాటుచేస్తున్నాయి. వీటివల్ల బీమాను సంబంధించిన డాక్యుమెంటేషన్ ను సులభంగా పూర్తి చేయవచ్చు.

దేశాన్ని బట్టి ప్రీమియం

దేశాన్ని బట్టి ప్రీమియం

* ప్రస్తుతం మీరు నివసిస్తున్న దేశం కూడా మీ బీమా పాలసీని ప్రీమియం ను నిర్ణయిస్తుంది.

* మీరు ఉంటున్న దేశంలో అస్థిర ప్రభుత్వం ఉన్నా లేక అల్లర్లు, జరుగుతుండటం లేదా లా అండ్ ఆర్డర్ సరిగ్గలేకపోయినా బీమా కంపెనీ మీ పాలసీని తిరస్కరించవచ్చు. లేదా ఎక్కువ ప్రీమియం వసూలు చేయవచ్చు.

* ప్రశాంతంగా ఉండే దేశాలు, సుస్థిర ప్రభుత్వం ఉండే దేశాల్లో ని వారు చాలా సులభంగా బీమా పాలసీ తీసుకోవచ్చు.

* ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయడం చాలా సులభం. ఇలాంటి సందర్భంలో వివిధ కంపెనీలు ఆఫర్ చేస్తున్న పాలసీల వివరాలు తెలుసుకోవచ్చు.

English summary

ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్: భారత్ లో బీమా తీసుకుంటే లాభాలెన్నో! | Good news for NRIs: more profit with insurance in India

Good news for NRIs. more profit with insurance in India. Many NIRs are interested to invest in India insurance.
Story first published: Monday, September 16, 2019, 9:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X