For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్ ఐఫోన్ 11 ధరలు, ఫీచర్స్: బుకింగ్, సేల్స్ ఎప్పటి నుంచి అంటే?

|

ఆపిల్ అభిమానులు సహా ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఐఫోన్ విడుదలైంది. ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లను ఆపిల్ హెడ్ క్వార్టర్స్‌లో వినియోగదారులు, డెవలపర్ల మధ్య కంపెనీ సీఈవో టిమ్ కుక్ లాంఛనంగా ప్రారంభించారు. మన కాలమానం ప్రకారం కాలిఫోర్నియా ఆపిల్ క్యాంపస్‌లో మంగళవారం రాత్రి వివిధ వేరియంట్లను పరిచయం చేశారు. ఐఫోన్ 11 ఆరు రంగుల్లో లభ్యం కానుంది. కొత్తగా గ్రీన్, పర్పుల్ రెడ్, యెల్లో కలర్లలో రానుంది.

SBI ఖాతాదారులకు షాక్, RDపై తగ్గిన వడ్డీ రేట్లు ఇలా...SBI ఖాతాదారులకు షాక్, RDపై తగ్గిన వడ్డీ రేట్లు ఇలా...

13వ తేదీ నుంచి బుకింగ్... 20వ తేదీ నుంచి విక్రయాలు

13వ తేదీ నుంచి బుకింగ్... 20వ తేదీ నుంచి విక్రయాలు

ఆధునాతన ఫీచర్లు, అద్భుతమైన స్పెసిఫికేషన్లతో ఈ ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లతో పాటు సెవంత్ జనరేషన్ ఐప్యాడ్ 10.2 అంగుళాల పరిమాణంలో పరిచయం చేశారు. దేశీయ మార్కెట్లో ఈ నెల 20వ తేదీ నుంచి కొత్త ఐఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. 20 నుంచి విక్రయాలు ప్రారంభించనున్న ఈ ఫోన్లను 13వ తేదీ నుంచి బుక్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 11 ప్రత్యేకతలు

ఐఫోన్ 11 ప్రత్యేకతలు

ఐఫోన్ 11లో 6.1 ఇంచుల ఎల్ఆర్ డిస్‌ప్లే ఉంది. 64/256/512 GB స్టోరేజ్ ఆప్షన్స్ కలిగి ఉంది. 12, 12 మెగాపిక్సల్ సామర్ష్యంతో ఈ బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు కలిగి ఉంటాయి. ఫోటోలు, వీడియోల కోసం అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 12 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 4GB రామ్‌తో పాటు 3110 Mah కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేసారు. దీంతో ఐఫోన్ 11 బ్యాటరీ బ్యాకప్ గత ఐఫోన్ల కంటే ఎక్కువ వస్తుంది. శబ్దనాణ్యత కోసం డోల్బీ అట్మాస్ విధానం ఉపయోగించారు. బ్లాక్, గ్రీన్, ఎల్లో, పర్పుల్, వైట్, రెడ్ కలర్లలో లభిస్తుంది. ఇఫ్పటి వరకు ఐఫోన్‌లో లేని అత్యధిక స్పష్టమైన వీడియోలు తీయవచ్చు. అత్యంత వేగంతో పని చేసే ఏ13 బయోనిక్ సీపీయూ, వేగంగా పని చేసే జీపీయూ, ఐఫోన్ టెన్ఆర్ కంటే గంట అదనపు బ్యాటరీ. అత్యంత వేగంగా ముఖం గుర్తించే కెమెరా. 64GB ఐఫోన్ 11 ధర 699 డాలర్లు.

ఐఫోన్ 11ప్రో ప్రత్యేకతలు

ఐఫోన్ 11ప్రో ప్రత్యేకతలు

ఐఫోన్ 11ప్రోలో 5.8 ఇంచుల డిస్ ప్లే. మిడ్ నైట్ గ్రీన్, స్పేస్ గ్రే, సిల్వర్/వైట్, గోల్డ్ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. 40 శాతం తక్కువ విద్యుత్ వినియోగం, ఐఫోన్ టెన్ఎస్ కంటే 4 గంటల అదనపు బ్యాటరీ. వెనుకవైపు సింగిల్ పీస్ గ్లాస్, స్టెయిన్‌లెస్ స్టీల్. 3 బ్యాక్ కెమెరాలు. డోల్బీ అట్మోస్ శబ్దం, సెకనుకు లక్ష కోట్ల ఆపరేషన్లు జరిపే సీపీయూ. 128GB ఐఫోన్ 11ప్రో ధర 999 డాలర్లు.

ఐఫోన్ 11ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు

ఐఫోన్ 11ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు

ఐఫోన్ 11ప్రో మ్యాక్స్‌లో 6.5 ఇంచులో డిస్ ప్లే. ఐఫోన్ టెన్ఎస్ మ్యాక్స్ కంటే 5 గంటలు అదనంగా వచ్చే బ్యాటరీ. 3 బ్యాక్ కెమెరాలు. ఒకే సమయంలో మూడు భిన్న రకాలుగా ఫోటోలు తీసే వెసులుబాటు. కనురెప్పల మధ్య చోటును కూడా స్పష్టంగా చూపే కెపాసిటీ దీని సోంతం. 128GB ఐఫోన్ 11మ్యాక్స్ ధర 1099 డాలర్లు.

సెవంత్ జనరేషన్ ఐపాడ్

సెవంత్ జనరేషన్ ఐపాడ్

ఐఫోన్ 11, ఐఫోన్ 11ప్రో, ఐఫోన్ 11ప్రో మ్యాక్స్‌లను ఆవిష్కరించడంతో పాటు సిరీస్ 5 యాపిల్ వాచ్‌ను, సెవంత్ జనరేషన్ ఐప్యాడ్‌ను కూడా లాంచ్ చేసింది ఆపిల్ సంస్థ. 10.2 ఇంచుల ఏడో తరం ఐ ప్యాడ్‌ను, ఐప్యాడ్ ఓఎస్‌ను కూడా పరిచయం చేశారు. ప్రస్తుతం కంటే రెండు రెట్ల అధిక సామర్థ్యంతో ఇది పని చేస్తుంది. దీని బ్యాటరీ 10 గంటలు ఉంటుంది. ఈ నెల 30వ తేదీ నుంచి లభించే ఈ ఐప్యాడ్ ధర 329 డాలర్ల నుంచి ప్రారంభం.

ఫిఫ్త్ జనరేషన్ యాపిల్ వాచ్

ఫిఫ్త్ జనరేషన్ యాపిల్ వాచ్

ఇదే సమయంలో లాంచ్ చేసిన ఫిఫ్త్ జనరేషన్ వాచ్ ధర 399 డాలర్లు, 499 డాలర్లుగా ఉంది. వీటి విక్రయాలు కూడా 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రోజువారీ ఎంతసేపు వ్యాయమం చేశారు, ఎంత శక్తిని వినియోగించారు, హృదయ స్పందన ఎలా ఉంది, శబ్ద-మహిళల ఆరోగ్య అధ్యయనం వంటివి తెలుసుకోవచ్చు. కాంపాస్‌గా కూడా ఉపయోగపడుతుంది. అత్యవసర ఇంటర్నేషనల్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఓసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుంది. రీసైక్లింగ్ అల్యూమినియం, ఆర్సెనిక్ రహిత గ్లాస్ ఉపయోగించి తయారు చేశారు.

డ్యూయల్ సిమ్ కానీ...

డ్యూయల్ సిమ్ కానీ...

గత ఐఫోన్ల మాదిరిగా ఈసారి కూడా ఐఫోన్ 11లో డ్యుయల్ సిమ్ ఫీచర్ అందిస్తున్నారు. కానీ ఒక్క స్లాట్‌లోనే ఫిజికల్ సిమ్ వేసుకునే వీలుంటుంది. రెండో సిమ్‌ను ఇంతకుముందులాగే ఇ-సిమ్ రూపంలో ఉపయోగించాలి. ఈ ఫోన్‌లో IOS 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. టచ్ ఐడీకి బదులు ఇందులో ఫేస్ ఐడీతో ఫోన్‌ను లాక్/అన్‌లాక్ చేసుకోవాలి. అయితే అందరూ ఈసారి ఐఫోన్లలో 5G ఫీచర్ వస్తుందని భావించినా, ఈసారికి ఈ ఐఫోన్లలో ఆపిల్ 4G ఫీచర్‌ను మాత్రమే అందించారు. ఐఫోన్ 11లో ఆపిల్ A13 బయానిక్ ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. మల్టీమీడియా, గేమ్స్ కోసం ఫోర్ కోర్ గ్రాఫిక్స్ ఆపిల్ జీపీయూను ఈ ఫోన్లో అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్ల ఉన్నాయి. కూడా ఫోన్ 11లో అందిస్తున్నారు.

అప్ డేటెడ్ ప్రాసెసర్, ర్యామ్

అప్ డేటెడ్ ప్రాసెసర్, ర్యామ్

గత ఏడాది విడుదలైన ఐఫోన్లలో ఆపిల్ A12 బయోనిక్ ప్రాసెసర్ ఉపయోగించారు. వీటిల్లో మాత్రం A13 బయోనిక్ ప్రాసెసర్ ఉపయోగించారు. గతంలో వాటి కంటే వేగంగా పని చేస్తుంది. స్మార్ట్ ఫోన్లలో అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌గా ఆపిల్ దీనిని పేర్కొంది. గత ఏడాది విడుదలైన ఐఫోన్‌లలో 4GB ర్యామ్ వినియోగించగా, ప్రస్తుత ఫోన్లలో 6GB ర్యామ్ వినియోగించారు.

English summary

ఆపిల్ ఐఫోన్ 11 ధరలు, ఫీచర్స్: బుకింగ్, సేల్స్ ఎప్పటి నుంచి అంటే? | Apple iPhone 11 Series Finds A Lot of Its Intelligence From iOS 13

Apple's new iPhone 11, iPhone 11 Pro, and iPhone 11 Pro Max are here. Unveiled at a press event at Apple Headquarters in Cupertino, California earlier today, the new iPhone models pack several new features like the A13 Bionic SoC.
Story first published: Wednesday, September 11, 2019, 9:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X