For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌కం ట్యాక్స్‌ను ఆఫ్ లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా ఇలా చెల్లించండి

|

ట్యాక్స్ పేయర్స్ తమ ఆదాయపన్ను రిటర్న్స్‌ను దాఖలు చేయడానికి ముందు చెల్లించాల్సిన పన్ను బకాయిలు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేయాలి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ట్యాక్స్ చెల్లించే వెసులుబాటు ఉంది. ఆన్ లైన్ ద్వారా సులభంగా చెల్లింపులు జరపవచ్చు. ఆఫ్‌లైన్ అయితే చలాన్ 280ని నింపడం ద్వారా సంబంధిత బ్యాంకు శాఖలో ఇవ్వాలి. చలాన్ 280ని ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Challan No. ITNS 280 ఆదాయపన్ను చెల్లించేందుకు ఉపయోగిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే మీ డ్యూస్ చెల్లించాకే ఐటీఆర్ ఫైల్ చేయాలి.

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇవి కూడా చదవండి...

ఆఫ్ లైన్ ద్వారా ఎలా?

ఆఫ్ లైన్ ద్వారా ఎలా?

- ఆదాయపన్నును ఆఫ్ లైన్ ద్వారా చెల్లించాలనుకుంటే ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ వెబ్ సైట్లోకి వెళ్లి చలాన్ నెంబర్ 280 ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. ట్యాక్స్ అప్లికబుల్‍‌లోని (0021) Income tax (other than companies)ను టిక్ చేయాలి.

- ట్యాక్స్ అమౌంట్, అసెస్‌మెంట్ ఇయర్, అడ్రస్, పాన్ కార్డు నెంబర్ వంటి వివరాలు నింపాలి.

- చలాన రిసిప్ట్ తీసుకోవాలి. ఇందులో 7 డిజిట్స్ బ్యాంకు బ్రాంచ్ BSR కోడ్ ఉంటుంది. చలాన డిపాజిట్ తేదీ, చలాన సీరియల్ నెంబర్ వంటివి ఉంటాయి. వీటిని మీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్‌లో పేర్కొనాలి.

ఆన్ లైన్ ద్వారా ఎలా?

ఆన్ లైన్ ద్వారా ఎలా?

ఆన్ లైన్ ద్వారా చెల్లించేందుకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు చెందిన ఈ-ఫైలింగ్ వెబ్ సైట్‌కు వెళ్లాలి. e-Pay taxes ను సెలక్ట్ చేసుకోవాలి. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ క్విక్ ఐటీఆర్ ఫైలింగ్ ఆప్షన్‌ను కూడా తీసుకు వచ్చింది. ఐటీఆర్ ఫామ్ ఫైల్ చేసే సమయంలోనే ePay ఆప్షన్ కూడా ఉంటుందియ

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్

ఈ లింక్స్ ద్వారా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్ సైట్‌కు వెళ్తారు. అక్కడ Challan no./ITNS 280 ను సెలక్ట్ చేసుకోవాలి. Tax Applicable లోని (0021) Income tax (other than companies)ను ఎంచుకోవాలి. ఆ తర్వాత type of payment navf (300) Self Assessment Tax ను ఎంచుకోవాలి. అందులో పాన్, ఇతర వివరాలు పొందుపర్చాలి. పేమెంట్ అసెస్‌మెంట్ ఇయర్ పేర్కొనాలి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు..

ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు..

మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. పేమెంట్ సక్సెస్ అయిన అనంతరం చలాన డిస్ ప్లే అవుతుంది. ఇందులో చెల్లించిన మొత్తం, బ్యాంకు శాఖకు సంబంధించిన బీఎస్ఆర్ కోడ్, చలాన్ డిపాజిట్ తేదీ, చలాన సీరియల్ నెంబర్ ఉంటాయి. ఆ చలానను సేవ్ చేసుకోవాలి. ఈ వివరాలు ఐటీఆర్‌లో పొందుపర్చాలి. సబ్‌మిట్ చేయాలి.

English summary

ఇన్‌కం ట్యాక్స్‌ను ఆఫ్ లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా ఇలా చెల్లించండి | How to pay income tax online or deposit challan at banks

You have filled up your ITR form and then find out that you have to pay a certain amount of income tax that is due. The taxpayer can do it both online and offline.
Story first published: Wednesday, August 28, 2019, 17:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X