For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారు బీమా క్లెయిమ్ ఎందుకు తిరస్కరిస్తారో తెలుసా?

|

కొత్త కారును కొనుగోలు చేసినా పాత కారును నడిపిస్తున్నా వాహన బీమా తప్పని సరి. బీమా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కలిగే ప్రాణ, ఆస్తి నష్ఠానికి పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇతర ఇబ్బందులు తప్పవు. అయితే బీమా తీసుకున్న వారు తమ కారుకు ఏమయినా క్లెయిమ్ చేసుకుంటారు. కానీ బీమా కంపెనీ అన్ని క్లెయిమ్ లను చెల్లించక పోవచ్చు. అందుకు కారణాలుంటాయి. అవేమిటో తెలుసుకుంటే మీరు బీమా క్లెయిమ్ చేసినప్పుడు అది తిరస్కరణకు గురి కాకుండా ఉంటుంది.

LIC మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్: ప్రీమియం, ఇతర వివరాలుLIC మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్: ప్రీమియం, ఇతర వివరాలు

ఆటో బీమా కంపెనీలు

ఆటో బీమా కంపెనీలు

* ఆటో బీమా కంపెనీలు అన్ని క్లెయిమ్ లను అనుమతించవు. కొన్ని సందర్భాల్లో క్లెయిమ్ లను తిరస్కరించడం లేదా చెల్లించే మొత్తాన్ని తక్కువగా చేయడం చేస్తుంటాయి.

* క్లెయిమ్ చేసిన కారణాల్లో వాస్తవం ఉంటే బీమా కంపనీలు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా క్లెయిమ్ చేస్తాయి.

* క్లెయిమ్ చేసుకోవడం లేదా తగిన పరిహారాన్ని పొందడం కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది కరంగా మారవచ్చు. అందుకు చాలా కారణాలు ఉంటాయి.

* ఉదాహరణకు కారు దొంగతనానికి గురైన సందర్భంలో అందుకు కారణం దాన్ని నడిపించిన డ్రైవర్ కారణం కావచ్చు. ఇందుకు సంబంధిన క్లెయిమ్ చేసినప్పుడు సరైన కారణాలు వెల్లడించనట్టయితే ఆ క్లెయిమ్ ను బీమా కంపెనీ తిరస్కరించే అవకాశం ఉంటుంది.

* బీమా పరిహారం కోసం దరఖాస్తు చేసినప్పుడు అందులో వాస్తవాలను తెలియజేయాలి. సమాచారం సరిగ్గా లేకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చినా మీ బీమా క్లెయిమ్ ను తిరస్కరించే అవకాశం ఉంటుంది.

వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే...

వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే...

* కొంత మంది కారును ప్రయివేట్ అవసరాల కోసం తీసుకుంటారు. బీమా కూడా అలాగే ఉంటుంది. ఆ కారును వాణిజ్య పరమైన అవసరాల కోసం వినియోగించినప్పుడు ఏదైనా జరగ వచ్చు. అప్పుడు బీమా క్లెయిమ్ చేసుకుంటే కంపెనీ దాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది.

* కారును వాణిజ్య పరమైన అవసరాల కోసం వినియోగించుకుంటే ఆ మేరకు అదే బీమాను తీసుకోవాలి.

* ప్రమాదం కారణంగా మీ కారుకు డ్యామేజ్ జరిగితే మీరు వెంటనే క్లెయిమ్ చేసుకుంటారు. కానీ డ్యామేజీకి సంబంధించి మీరు అనుకున్నంత సొమ్ము రాకపోవచ్చు. ఎందుకంటే క్లెయిమ్ చెల్లించే సమయంలో కంపెనీ ఆ కారుకు సంబంధించిన తాగడాలను లెక్కలోకి తీసుకుంటుంది.

* మీరు ఇచ్చే సమాచారం బీమా కంపెనీ కోరే దానికన్నా ఎక్కువగా, విశ్వసనీయంగా ఉండాలి. అప్పుడే మీకు పరిహారం లభిస్తుంది. క్లెయిమ్ చేసే సమయంలో ఏయే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందో చూసుకోవాలి. నియమ నిబంధనలకు అనుగుణంగా మీ సమాచారం ఉండాలి.

* కొందరు మోసపూరిత క్లెయిమ్ లు చేస్తుంటారు. క్లెయిమ్ మొత్తాన్ని ఎక్కువ చేసి చూపుతారు. ఇలాంటి సందర్బంలో ఆ క్లెయిమ్ ను తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది.

సరైన సమయంలో తెలియజేయాలి

సరైన సమయంలో తెలియజేయాలి

* ప్రమాదం జరిగిన వెంటనే బీమా కంపెనీకి తెలియజేయాలి. బీమా కంపెనీలు ఇందుకు 48 గంటల సమయాన్ని ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి. కానీ ప్రమాదం జరగగానే తెలియజేస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురికావడానికి అవకాశం ఉంటుంది.

* మీ బీమా పాలసీని నిర్దేశిత కాలంలో రెన్యూవల్ చేయండి. లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు ఇబ్బందులు ఎదురుకావచ్చు.

English summary

కారు బీమా క్లెయిమ్ ఎందుకు తిరస్కరిస్తారో తెలుసా? | Why car insurance claims are rejected?

Every year, thousands of vehicle insurance claims are either partly or completely rejected by insurers because of policy exclusions or a breach of conditions.
Story first published: Sunday, July 14, 2019, 9:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X