For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మస్తు మస్తు... మనీ బ్యాక్ పాలసీలు

By Jai
|

బీమా కంపెనీలు పాలసీదారుల అవసరాలు, ప్రయోజనాలు, సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు నూతన బీమా పాలసీలను అందుబాటులోకి తెస్తుంటాయి. వీటిలో తమకు నచ్చిన పాలసీని బీమా తీసుకోవాలనుకునే వారు ఎంచుకుంటారు. సాధారణంగా జీవిత బీమా పాలసీల్లో నిర్దేశిత గడువు వరకు మూడునెలలు, ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి బీమా ప్రీమియం చెంల్లించాల్సి ఉంటుంది. గడువు తీరిన తర్వాత ఏక మొత్తంగా బీమా సొమ్ము చేతికి అందుతుంది. బీమా పాలసీ గడువులోపు పాలసీదారు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పాలసీ కింద లభించే ప్రయోజనాలను నామినీకి లేదా కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ఇలా సొమ్ము అందడం వల్ల ఆ కుటుంబానికి ఆర్ధిక పరంగా కొంత ఊరట లభిస్తుంది.

అయితే పాలసీదారుల్లో అందరు పాలసీ గడువు ముగిసిన తర్వాతనే దాని ప్రయోజనాన్ని పొందాలనికోరు. కొంత మంది పాలసీని ప్రారంభించిన తర్వాతి కొన్నాళ్ళకు తమ అవసరాలు తీర్చే విధంగా ఆ పాలసీ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటారు. ఇలాంటివారికోసమే బీమా కంపెనీలు మనీ బ్యాక్ పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. చాలా బీమా కంపెనీలు ఇప్పుడు మనీ బ్యాక్ పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి.

LIC మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్: ప్రీమియం, ఇతర వివరాలుLIC మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్: ప్రీమియం, ఇతర వివరాలు

మనీ బ్యాక్ పాలసీ అంటే?

మనీ బ్యాక్ పాలసీ అంటే?

* ఇది ఒక రకమైన సాంప్రదాయ జీవిత బీమా ప్లాన్. ఇది రెండు రకాల ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ఒకవైపు పెట్టుబడి, మరోవైపు బీమా రక్షణ ప్రయోజనం దీని ద్వారా పొందవచ్చు.

* ఈ పాలసీ ద్వారా రిటర్న్ కు హామీ ఉంటుంది. పాలసీ గడువు తర్వాత సమ్ అస్యూరెన్సు పాలసీదారు చేతికి అందుతుంది.

* ఈ పాలసీని ఎంచుకున్నవారు సాధారణంగా ప్రతి ఐదేళ్ల తర్వాత కొంత సొమ్మును బీమా కంపెనీ నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది.

* పాలసీదారు బీమా కాలంలో మరణిస్తే సమ్ అషురెన్సు కుటుంబ సభ్యులకు అందజేస్తారు.

* ఈ పాలసీ తీసుకున్నవారు కొన్ని రకాల రైడర్లను కూడా ఎంచుకోవచ్చు. వీటిలో టర్మ్ రైడర్, పర్సనల్ యాక్సిడెంట్ రైడర్, అంగవైకల్యానికి సంబంధిచిన రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్, హాస్పిటల్ కాష్ రైడర్, ప్రీమియం ఎత్తివేత రైడర్ వంటివి ఉంటాయి.

*బోనస్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది.

* ఈ పాలసీ ద్వారా నిర్దేశిత కాలం తర్వాత సొమ్ము చేతికి అందుతుంది. అయితే దీని వల్ల పాలసీ గడువు ముగిసిన తర్వాత లభించే ప్రయోజనం తగ్గుతుందన్న విషయం గమనించాలి.

పన్ను ప్రయోజనం

పన్ను ప్రయోజనం

* మనీ బ్యాక్ పాలసీ తీసుకున్నా చెల్లించే బీమా ప్రీమియంపై ఆదాయపన్ను చట్టం లోని సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది.

* రిస్క్ తక్కువ

ఎవరికి బెస్ట్

ఎవరికి బెస్ట్

* తన పెట్టుబడులకు తక్కువ రిస్కు తక్కువ ఉండటంతో పాటు రిటర్న్ లకు హామీ ఉండాలని కోరుకునేవారు, బీమా రక్షణ కావాలకునే వారు మనీ బ్యాక్ పాలసీని ఎంచుకోవచ్చు.

* నిర్ణీత కాలం తర్వాత అవసరాలు తీర్చుకోవాలనే వారు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇలాంటి పాలసీలు పొదుపు మొత్తాలు పెరగడానికి దోహదపడతాయి.

English summary

మస్తు మస్తు... మనీ బ్యాక్ పాలసీలు | What is LIC money back policy in detail?

As part of the policy, 20% of Sum Assured is paid as survival benefit at the end of 5, 10 and 15 years. Also, a simple reversionary bonus is payable on maturity.
Story first published: Friday, July 12, 2019, 13:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X