For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI E-Rail ఫెసిలిటీ: రైల్వే టిక్కెట్‌ను ఇలా ఈజీగా బుక్ చేసుకోండి

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్, రివార్డు పాయింట్స్ వంటివి ఎన్నో అందిస్తోంది. ఇండియన్ రైల్వేస్(IRCTC)తో కలిసి ఈ-టిక్కెట్ వెసులుబాటును కూడా కల్పిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ-రైల్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. మీ ఎస్బీఐ కార్డును ఉపయోగించి టిక్కెట్స్ బుక్ చేయాలనుకుంటే ఇలా చేయండి....

డబ్బు సంపాదించడం ఎలా?, మీకు ఫేస్‌బుక్ ఫ్రీగా చెప్పనుందిడబ్బు సంపాదించడం ఎలా?, మీకు ఫేస్‌బుక్ ఫ్రీగా చెప్పనుంది

ట్రావెల్ ప్లాన్

ట్రావెల్ ప్లాన్

- ఇండియన్ రైల్వేస్ www.irctc.co.in వెబ్ సైట్‌లోకి లాగిన్ అవాలి.

- మీరు ఫస్ట్ టైమ్ యూజర్ అయితే, IRCTC సైట్‌లో మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్‌తో రిజిస్టర్ చేసుకోవాలి.

- ఆ తర్వాత Plan My Travel and Book Ticket ను ఎంచుకోండి.

- అక్కడ డిపార్చర్, అరైవల్ టైమింగ్, డేట్, జర్నీ క్లాస్ వంటి వివరాలు ఇవ్వండి.

పేమెంట్ ఆప్షన్

పేమెంట్ ఆప్షన్

- అక్కడ డిస్‌ప్లే అవుతున్న రైళ్లలో మీరు ప్రయాణించే రైలును ఎంచుకోండి. ఆ తర్వాత Book Ticket పైన క్లిక్ చేయండి.

- పాసింజర్ వివరాలు ఎంటర్ చేయండి. టిక్కెట్స్ డెలివరీ కోసం మీ అడ్రస్ కన్‌ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీరు టిక్కెట్‌కు చెల్లించాల్సిన సొమ్ము కనిపిస్తుంది.

- ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో ఎస్బీఐ ఆప్షన్ ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేసి ఎస్బీఐ వెబ్‌సైట్లోకి వెళ్ళాలి.

అడ్రస్‌కు టిక్కెట్లు

అడ్రస్‌కు టిక్కెట్లు

- మీ ఎస్బీఐ ఆన్‌లైన్ యూజర్ నేమ్, పాస్ వర్డ్‌తో ఎంటర్ కావాలి. ఆ తర్వాత పేమెంట్ కన్‌ఫర్మ్ చేయాలి.

- ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యాక, మీకు ట్రాన్సాక్షన్ ఐడీ, ట్రాన్సాక్షన్ డేట్ వస్తుంది.

- మీరు పేర్కొన్న అడ్రస్‌కు ఐఆర్‌సీటీసీ మీ టిక్కెట్స్ డెలివరీ చేస్తుంది. ఈ టిక్కెట్స్ బాధ్యత ఐఆర్‌సీటీసీదే.

- టిక్కెట్ క్యాన్సిలేషన్ కోసం కస్టమైజ్డ్ కౌంటర్ వద్ద టిక్కెట్లను సబ్‌మిట్ చేయాలి. టిక్కెట్స్ క్యాన్సిల్ అయితే ఆ మొత్తం మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.

రివార్డు పాయింట్

రివార్డు పాయింట్

IRCTC SBI Platinum కార్డు హోల్డర్స్ ఇండియన్ రైల్వే వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేయవచ్చు. AC1, AC2. AC3 and AC CCలలో కొనుగోలు చేయడం ద్వారా పది శాతం వ్యాల్యూ బ్యాక్‌ను రివార్డు పాయింట్స్‌గా పొందవచ్చు. ఒక రివార్డు పాయింట్ రూ.1కి మానం. ప్రతి రూ.125 ఖర్చు పైన ఒక రివార్డు పాయింట్ పొందుతారు.

English summary

SBI E-Rail ఫెసిలిటీ: రైల్వే టిక్కెట్‌ను ఇలా ఈజీగా బుక్ చేసుకోండి | SBI E-Rail facility: Here's a step wise process to book railway ticket online

SBI offers its customers a host of services and facilities. It also offers various cashbacks, discounts, reward points, etc., on using SBI credit or debit card.
Story first published: Sunday, July 14, 2019, 14:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X