For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ బంకులో మీరు ఈ సేవలు ఉచితంగా పొందవచ్చు

|

న్యూఢిల్లీ: పెట్రోల్ లేదా డీజిల్ కోసం మనం పెట్రోల్ బంకుల్లోకి వెళ్తుంటాం. మనం రోడ్లపై వెళ్లే సమయంలో ఎమర్జెన్సీ అయితే మనకు పెట్రోల్ బంకులు గుర్తుకురావు. కేవలం వెహికిల్స్‌ల్లో ఇంధనం లేకుంటే మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ పెట్రోల్ బంకుల్లోనూ మీరు వివిధ సేవలు పొందవచ్చుననే విషయం మీకు తెలుసా. ఉచిత టాయిలెట్, ఉచిత మంచినీరు, వాహనాలకు ఉచిత గాలి వంటి పలు సౌకర్యాలు ఉంటాయి. పెట్రోల్ బంకుల్లో ఉచితంగా అందించే సేవలు ఏమిటో తెలుసుకుందాం...

HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!

క్వాలిటీ, ప్యూరిటీ చెక్

క్వాలిటీ, ప్యూరిటీ చెక్

వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తిని, సరైన పరిమాణాన్ని సరైన ధర వద్ద అందించాలి. ఏ పెట్రోల్ బంకులో అయినా మీరు పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యతను తెలుసుకునేందుకు ఫిల్టర్ పేపర్ టెస్ట్ అడగవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జ్ వసూలు చేయరు. క్వాంటిటీ పైన అనుమానం అది కూడా చెక్ చేయించుకోవచ్చు. ఇది మీ హక్కు. పెట్రోల్ బంక్ యాజమాన్యం నిరాకరించరాదు. అలాగే, ఛార్జీ కూడా వసూలు చేయలేరు.

ఫస్ట్ ఎయిడ్ కిట్

ఫస్ట్ ఎయిడ్ కిట్

రోడ్ల పైన తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. మీరు రోడ్డుపై వెళ్లే సమయంలో ఎక్కడైనా ఎవరైనా ప్రమాదం బారినపడితే సమీపంలోని పెట్రోల్ బంకుకు తీసుకువెళ్లి ఫస్ట్ ఎయిడ్ అడగవచ్చు. పెట్రోల్ బంకులు ఫుల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కలిగి ఉండాలి.

ఎమర్జెన్సీ కాల్

ఎమర్జెన్సీ కాల్

మీరు అత్యవసరమై ఫోన్ కాల్ చేసేందుకు కూడా పెట్రోల్ బంకుకు వెళ్లవచ్చు. అత్యవసర సమయంలో స్నేహితుడికి లేదా ప్రమాదం బారిన పడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు లేదా ఎవరికైనా ఫోన్ చేయడానికి పెట్రోల్ బంక్స్ ఉచిత కాల్ సౌకర్యం అందించాలి. సో.. ఈసారి మీ ఫోన్లో హఠాత్తుగా బ్యాటరీ అయిపోతే, ఏదైనా సమస్య వస్తే అందుబాటులోని పెట్రోల్ బంకుకు వెళ్లి ఫోన్ కాల్ చేయవచ్చు.

వాష్ రూమ్స్

వాష్ రూమ్స్

పెట్రోల్ బంకుల్లో వాష్ రూమ్స్ కూడా తప్పనిసరి. ప్రయాణించే సమయంలో మహిళలు, చిన్నపిల్లలు బయటకు వెళ్లేందుకు ఇవి అందుబాటులో ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. హైజెనిక్ టాయిలెట్స్, మరుగుదొడ్లు పెట్రోల్ బంకుల్లో తప్పనిసరి. దీనికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కస్టమర్ కాకపోయినప్పటికీ.. అంటే ఆ సమయంలో మీరు పెట్రోల్, డీజిల్ కొనకపోయినప్పటికీ.. టాయిలెట్స్ ఉపయోగించవచ్చు.

తాగునీరు

తాగునీరు

పెట్రోల్ బంకుల్లో పరిశుభ్రమైన తాగునీరు తప్పనిసరి. మంచి నీరు మీరు అక్కడ తాగవచ్చు లేదా బాటిల్స్‌లో తీసుకు వెళ్లవచ్చు.

ఫ్రీ ఎయిర్

ఫ్రీ ఎయిర్

పెట్రోల్ బంకుల్లో మీరు ఉచితంగా మీ వాహనాల్లో గాలిని నింపించుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైనా మీరు డబ్బులు చెల్లించి టైర్లలో గాలిని నింపించుకుంటే మీరు నష్టపోతున్నట్లే. ఎందుకంటే ఉచితంగా ఫ్రీ ఎయిర్. గాలిని నింపినప్పుడు డబ్బులు నామమాత్రంగా అయినా డబ్బులు తీసుకుంటే మీరు ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని....

మరిన్ని....

మీరు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిన తర్వాత బిల్లును కచ్చితంగా అడిగి తీసుకోవచ్చు. సలహా/ఫిర్యాదు పుస్తకాన్ని ఎల్లప్పుడూ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. దీన్ని కస్టమర్లకు తెలియజేయాలి. పనివేళలు, సెలవుల పట్టికను వినియోగదారులకు తెలియజేసేలా బోర్డు ఏర్పాటు చేయాలి. టాయిలెట్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. డీలర్, చమురు కంపెనీ సిబ్బంది పేరు, ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలి. శిక్షణ పొందిన సిబ్బందితో పాటు భద్రతా సాధనాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. పెట్రోల్ పంప్‌ను శుభ్రంగా ఉంచాలి. 24 గంటలు నీటి సౌకర్యం కలిగి ఉండాలి. తలుపులకు తప్పనిసరిగా గొళ్ళెం కలిగి ఉండాలి. ఈ-సేవలను పెట్రోల్ బంకులు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. పెట్రోల్ బంక్ యజమాని ఈ నిబంధనలను పాటించకపోతే, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. మొదటి ఉల్లంఘన కింద 15 రోజుల పాటు ఇందన అమ్మకాలను రద్దు చేయొచ్చు. రెండో నిబంధన కింద పెట్రోలు బంకును 30 రోజుల పాటు ఇందన అమ్మకాలను రద్దు చేయొచ్చు. మూడోసారి నిబంధనలను అతిక్రమిస్తే పెట్రోల్ పంపు డీలర్ షిప్‌ను రద్దు చేయొచ్చు.

English summary

Know your rights, Free services to avail at petrol pumps

We may not think of a petrol pump during a roadside emergency, because we mostly go there only when our vehicles indicate an empty tank and leave right after.
Story first published: Saturday, July 20, 2019, 14:13 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more