For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC పాలసీదారులకు గుడ్‌న్యూస్, ప్రీమియం చెల్లింపు ఈజీ: ఇలా చేయండి..

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (LIC) పాలసీదారులకు శుభవార్త. ఎల్ఐసీ ప్రీమియం తేదీని గుర్తుకుంచుకోవడం, వరుసలో నిలుచొని దానిని చెల్లించడం పాలసీదారులకు కాస్త ఇబ్బందికరమే. అయితే ఇక నుంచి మీరు ప్రీమియం తేదీని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రీమియంను నెట్ బ్యాకింగ్‌కు అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మీరు 'ఇన్‌స్టా పే సర్వీస్' ఆప్షన్ ఎంచుకుంటే ప్రీమియం చెల్లింపు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో నుంచి కట్ అవుతుంది.

BSNLను బెయిలవుట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలుBSNLను బెయిలవుట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు

రూ.50వేల వరకు సింగిల్ ట్రాన్సాక్షన్

రూ.50వేల వరకు సింగిల్ ట్రాన్సాక్షన్

ఆటో పేమెంట్ ద్వారా భవిష్యత్తులోని ప్రీమియంను సెట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్‌కు ఎక్స్‌ట్రా ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఏమీ ఉండవు. అయితే గరిష్టంగా రూ.50,000 వరకు మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుంది. ఇందులో జీఎస్టీ, ఒకవేళ ఆలస్యమైతే... లేట్ ఫీతో కలిపి రూ.50 వేల వరకు సింగిల్ ట్రాన్సాక్షన్‌లో చెల్లించవచ్చు.

ఎల్ఐసీ ప్రకటన... INSTAPAY Service

ఎల్ఐసీ ప్రకటన... INSTAPAY Service

ఎల్ఐసీ పాలసీహోల్డర్స్ తమ రిన్యూవల్ ప్రీమియం చెల్లించేందుకు ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యాన్ని విస్తృతం చేస్తున్నామని, ఇందులో భాగంగా కొత్తగా INSTAPAY Service ను తీసుకు వచ్చామని, దేశంలోని అన్ని బ్యాంకుల ఖాతాదారులు ఈ సేవలు పొందవచ్చునని, దీనిని బిల్ డెస్క్ ప్లాట్ ఫాం ద్వారా అందిస్తున్నామని ఎల్ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఎల్ఐసీ పాలసీదారులు తమ నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా ప్రీమియం చెల్లించవచ్చు.

ఇలా చెల్లించాలి....

ఇలా చెల్లించాలి....

మీరు అకౌంట్ కలిగిన బ్యాంక్ వెబ్‌సైట్‌ను తెరిచి, అందులో పే బిల్స్‌ ఆప్షన్‌కు వెళ్లాలి. ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, మీ ఇన్సూరెన్స్ కంపెనీ పేరును ఎంచుకోవాలి. అందులో కనపడే ఎల్‌ఐసీపై క్లిక్ చేస్తే పాలసీ నెంబరు తదితర వివరాలు అడుగుతుంది. ఆ వివరాలు ఇవ్వడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు. ప్రీమియం చెల్లించాల్సిన ప్రతిసారి బ్యాంక్ ఖాతాను తెరిచే అవసరం లేదు. ఆటో ప్లే ఆప్షన్ ద్వారా మీరు భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంను సెట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

స్టెప్ బై స్టెప్

స్టెప్ బై స్టెప్

ఎల్ఐసీ కొత్తగా తీసుకు వచ్చిన సేవలను వినియోగించుకోవడం కోసం స్టెప్ బై స్టెప్...

- మీరు అకౌంట్ కలిగి ఉన్న బ్యాంక్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవండి. లేదా మీ మొబైల్‌లో బ్యాంక్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. లాగిన్ అవండి.

- Pay Bills ను సెలక్ట్ చేసుకోండి

- బిల్లర్ కేటగిరీలో insurance ను ఎంచుకోండి.

- Insurance పైన క్లిక్ చేయండి. అప్పుడు ఇన్సురెన్స్ కంపెనీల పేర్లు కనిపిస్తాయి.

- Life Insurance corporation Of India పైన క్లిక్ చేయండి.

- పాలసీ నెంబర్, పేరు, ప్రీమియం అమౌంట్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ నెంబర్ వివరాలు ఇవ్వాలి.

- ప్రీమియం డ్యూ డేట్, ప్రీమియం అమౌంట్ కనిపిస్తాయి. (జీఎస్టీ, లేట్ ఫీ కలుపుకొని).

- Auto Payను ఎంచుకోండి. అప్పుడు మీరు ప్రీమియం తేదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.

- ప్రీమియం రిసిప్ట్ కావాలనుకుంటే.. ఎలక్ట్రిక్ మోడ్, ఫిజికల్ మోడ్‌లో పొందవచ్చు.

- submit బటన్ పైన క్లిక్ చేస్తే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ చెల్లింపులు మీరు ఇచ్చిన తేదీకి పూర్తవుతాయి.

- రూ.50,000 వరకు మాత్రమే చెల్లించవచ్చు. అది జీఎస్టీ, లేట్ ఫీ కలిపి.

- ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేవు.

- ఈ-రిసిప్ట్ మీ ఈమెయిల్ అడ్రస్‌కు వస్తుంది. పీడీఎఫ్ మోడ్‌లో కూడా రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ బ్యాంకుల్లో సేవలు...

ఈ బ్యాంకుల్లో సేవలు...

కొన్ని బ్యాంకులు ప్రీమియం చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఆటో పే విధానం అమలులోకి రావడం వల్ల గ్రేస్ పీరియడ్ ముగియడానికి ఏడు రోజుల ముందే ప్రీమియం జమ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. Allahabad Bank, Bandhan Bank, Bank of India, Canara Bank, Catholic Syrian Bank, Central Bank of India, Central Union Bank, Dena Bank, Deutsche Bank, Dhanlaxmi Bank, HDFC Bank, ICICI Bank, IDBI Bank, India Overseas Bank, Jammu and Kashmir Bank, Karnataka Bank, Punjab National Bank, RBL Bank, Saraswat Bank, State bank of India, Syndicate Bank, UCO Bank, United Bank of India, Yes Bank.

English summary

LIC పాలసీదారులకు గుడ్‌న్యూస్, ప్రీమియం చెల్లింపు ఈజీ: ఇలా చేయండి.. | Good news: You may now auto pay your LIC premium by adding it to net banking

The customers of LIC of India need not worry anymore about remembering the due date of paying the LIC premium or take out time to stand in a queue as they now have the options to pay their premium through net banking as well as adding the insurance company to the list of billers and auto pay the future premiums.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X