For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్తి ఉండగా అప్పు కోసం ఎందుకు చింత!

By Jai
|

చేతిలో ఏదైనా స్థిరాస్తి ఉన్నప్పుడు రుణం పొందడం చాలా ఈజీ. ఎవరినైనా అప్పు అడిగినప్పుడు వారి చరిత్రతో పాటు వారి ఆస్తుల గురించి కూడా కాస్త సమాచారం తెలుసుకొని అప్పు ఇస్తుంటారు. ఒకవేళ అప్పు తిరిగి ఇవ్వక పోయినా వారి ఆస్తులు ఉన్నాయి కదా అని రుణం ఇచ్చే వారికి ధీమా ఉంటుంది. తెలిసిన వాళ్లే ఇలా ఆలోచించినప్పుడు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఎలా ఆలోచిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మీ వద్ద స్థిరాస్తులు ఉన్నప్పుడు మీరు చాలా సులభంగా రుణం పొందవచ్చు.

ఏపీఎస్ఆర్టీసీకి ఎక్కడెంత అప్పు, జగన్ ప్రభుత్వంపై భారమెంత?ఏపీఎస్ఆర్టీసీకి ఎక్కడెంత అప్పు, జగన్ ప్రభుత్వంపై భారమెంత?

సెక్యూర్డ్ రుణం

సెక్యూర్డ్ రుణం

ఆస్తుల తనఖాతో ఇచ్చే రుణాలను సెక్యూర్డ్ రుణాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే మీరు పొందే రుణానికి ఆస్తిని హామీగా ఉంచుతున్నారు కాబట్టి. ఈ రుణాలను మార్గేజ్ రుణాలు అని కూడా అంటారు. వాణిజ్యపరమైన ఆస్తులు లేదా నివాస గృహాలను తనఖా పెట్టి రుణాలను పొందవచ్చు. మీరు తనఖా పెట్టే ఆస్తి మార్కెట్ విలువ ఎంత ఉందో లెక్కించి అందులో గరిష్టంగా 70 శాతం వరకు బ్యాంకులు రుణాలను ఇస్తుంటాయి. మీ పేరుమీదున్న ఆస్తిని మీరు తనఖా పెట్టి రుణం తీసుకున్నప్పటికీ మీరు దాన్ని నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు. బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకుంటే దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఆస్తులను తనఖా పెట్టినప్పుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. అందుకే మీ దగ్గర ఆస్తి ఉన్నప్పుడు వ్యక్తిగత రుణం తీసుకోవడానికి బదులుగా మార్గేజ్ రుణం తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ రుణంపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

- ఆస్తి తనఖాతో చాలా తక్కువ కాలంలోనే రుణాన్ని పొందవచ్చు.

- నెలవారీ వాయిదాలు తక్కువ స్థాయిలో ఉంటాయి.

- రుణ దరఖాస్తుకు వేగవంతంగా అనుమతి లభిస్తుంది.

- రుణ కాలపరిమితిలో కూడా సౌలభ్యం ఉంటుంది.

- డాక్యూమెంటేషన్ సులభంగా ఉంటుంది.

- రుణ బ్యాలెన్స్ ను ఈజీగా బదిలీ చేసుకోవచ్చు.

ఏ సమయంలో రుణం తీసుకోవచ్చు

ఏ సమయంలో రుణం తీసుకోవచ్చు

- మీరు నిర్వహిస్తున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలనుకున్నప్పుడు..

- మీ పిల్లల వివాహ సందర్భంలో..

- వైద్య ఖర్చుల నిమిత్తం

- ఉన్నత విద్య కోసం

రుణ అర్హత

రుణ అర్హత

- ఆస్తులపై రుణాన్ని రూ.3-4 లక్షల నుంచి రూ.కోటి వరకు కూడా పొందవచ్చు.

- రుణాన్ని పొందాలనుకునే వారు భారతీయులై ఉండాలి

- కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి

- వేతన జీవులు, సొంతగా వ్యాపారం చేసేవారు మార్గేజ్ రుణాలను పొందవచ్చు.

- వేతన జీవులు అయితే ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు తో పాటు రుణ దరఖాస్తు కు ముందటి మూడు నెలల వేతన స్లిప్పులు కూడా సమర్పించాలి.

- ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న కంపెనీ యజమాని ఇచ్చే ఫామ్ -16 అవసరం

- వీటితో పాటు బ్యాంకు అడిగే మరిన్ని సమర్పించాల్సి ఉంటుంది.

- సొంతంగా వ్యాపారం చేస్తున్నవారు, సొంతంగా ఉపాధి పొందుతున్న వృత్తి నిపుణులు కూడా తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

- రుణం తీసుకునేవారి రుణ చరిత్ర బాగుంటే తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందవచ్చు.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

స్థిర, చర వడ్డీ రేట్లతో ఆస్తుల తనఖాతో రుణం పొందవచ్చు. అనేక బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ రుణాలను ఇస్తున్నాయి. వడ్డీ రేటు 8.60 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. రుణం తీసుకోవడానికి ముందే వడ్డీ రేటు గురించి బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోవడం మంచిది.

English summary

ఆస్తి ఉండగా అప్పు కోసం ఎందుకు చింత! | Why are you worry: Loan against assets are easy

if you own assets, you can pledge it and borrow money against it within minutes.
Story first published: Thursday, June 13, 2019, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X