For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగేళ్ల ఇండియన్ స్టార్టప్ కంపెనీలో ఫేస్‌బుక్ పెట్టుబడులు

|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియాకు వచ్చి ఎంతో కాలమైంది. ఇలాంటి దిగ్గజ సంస్థ భారత్‌లో తన మొదటి పెట్టుబడిని మీషో (Meesho)లో పెట్టింది. ఫేస్‌బుక్‌కు 25 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వారిని వినియోగదారులుగా చేసుకొని సరికొత్త ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్వహించేందుకు 'మీషో'తో ముందుకు వస్తోంది. మేరీ షాప్ అనే హిందీ అర్థానికి లేదా మై షాప్ అనే పదానికి... సంక్షిప్తరూపమే 'మీషో'.

ఫేస్‌బుక్ 'మీషో'లో రూ.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. కానీ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. గత ఏడాది నాటికే 'మీషో' 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. ఇందులో ఫేస్‌బుక్‌తో పాటు మరిన్ని సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. ఢిల్లీలోని ఐఐటీలో 2008-2012 బ్యాచ్‌మేట్స్ 27 ఏళ్ల విదిత్ ఆత్రే, 28 ఏళ్ల సంజీవ్ బార్వల్ బెంగళూరుకు కేంద్రంగా 'మీషో' స్టార్టప్‌ను 2015లో స్థాపించారు. పెద్ద పెద్ద మాల్స్ ద్వారా ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్వహించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇప్పుడు చిల్లర వ్యాపారులతో జతకడుతున్నాయి.

Facebook invests in Meesho

చిల్లర వ్యాపారులు తమ వస్తువులను ఈ సంస్థల ద్వారా విక్రయించవచ్చు. అయితే వారికి ప్రత్యేకమైన నెట్ వర్క్ గానీ, యాప్ గానీ లేదు. వారందరినీ ఓ నెట్ వర్క్ పరిదిలోకి తెస్తే, సోషల్ మీడియాకు వారిని లింక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు ప్రతిరూపమే 'మీషో'. చిల్లర వ్యాపారులు తమ కొత్త ఉత్పత్తులకు సంబంధించి వాణిజ్య ప్రకటలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకునే అవకాశం ఉంది. 'మీషో'లో మైనార్టీ స్టేక్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు జూన్ 13న ఫేస్‌బుక్ ప్రకటించింది.

రూ.650 కోట్ల పన్ను ఎగవేత: జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్‌కు షాక్రూ.650 కోట్ల పన్ను ఎగవేత: జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్‌కు షాక్

English summary

నాలుగేళ్ల ఇండియన్ స్టార్టప్ కంపెనీలో ఫేస్‌బుక్ పెట్టుబడులు | Facebook invests in Meesho

Facebook has announced that it has invested in Meesho, a Bengaluru based social commerce platform that helps resellers and emerging brands build businesses using social media. It is the company's second investment in India.
Story first published: Monday, June 17, 2019, 16:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X