For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ తిరస్కరించారా? డోంట్ వర్రీ, ఇక్కడ లోన్ వస్తుంది కానీ...

|

పెళ్లి కోసమో లేక ఇళ్లు కొనుగోలు చేసేందుకో లేక మరో కారణంతోనే వేతనజీవులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు. ఇటీవల బ్యాంకుల నుంచి రుణం పొందడం సులువైంది. అయితే కొన్ని సందర్భాల్లో లోన్లు రిజెక్ట్ అవుతుంటాయి. లేదా ఆశించిన మేర రుణం పొందకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఆటోమొబైల్స్, ప్రాపర్టీస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో వీటిని కొనుగోలు చేసేందుకు వేతనజీవులు బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటారు. దరఖాస్తు తిరస్కరణకు అనేక కారణాలు ఉంటాయి. లోన్ అప్లికేషన్ తిరస్కరించబడకుండా ఉండాలంటే వీటిని చూసుకోండి....

సిబిల్ స్కోర్ బాగుండేలా చూసుకోండి

సిబిల్ స్కోర్ బాగుండేలా చూసుకోండి

సిబిల్ స్కోర్ బాగా లేకుంటే లోన్ తిరస్కరించబడటం లేదా అమౌంట్ తక్కువ రావడం వంటివి ఉంటాయి. బ్యాంకులు సిబిల్ స్కోర్ ప్రాతిపదికనే రుణాలను మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం పొందడం కష్టమవుతుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే పెండింగ్ లోన్స్‌ను వెంటనే క్లియర్ చేయండి. క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకున్నాక రుణం కోసం దరఖాస్తు చేయండి. క్రెడిట్కార్డ్ రీపేమెంట్ సర్కిల్, లోన్ తదితరాలు బాగుండేలా చూసుకోండి. చాలామందికి తమ డిఫాల్ట్స్ గురించి తెలియవు. ఉదాహరణకు ఎవరైనా తమ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసే నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవడం మరిచిపోతారు. అప్పుడు రూ.50 తక్కుువ అమౌంట్ ఉన్నా పెనాల్టీ, వడ్డీ రేటుతో కలిపి భారీ మొత్తం అవుతుంది. ఇది కూడా మీ సిబిల్ స్కోర్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది.

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే మరింత జాగ్రత్త

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే మరింత జాగ్రత్త

హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు సిబిల్ స్కోర్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. సిబిల్ స్కోర్ సహా అన్ని సరిగా ఉన్నప్పటికీ అప్లికేషన్ తిరస్కరించబడితే ప్రాపర్టీతో ప్రాబ్లమ్ అయి ఉంటుంది. అలాగే కొంతమంది తమ ఆదాయం కంటే ఎక్కువ రుణాన్ని ఆశిస్తారు. రీపేమెంట్ కెపాసిటీ కంటే ఎక్కువ రుణానికి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించే అవకాశముంది. అందుకే రుణ మొత్తం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇది రెస్కూ చేస్తుంది కానీ ఇదే డ్రాబ్యాక్

ఇది రెస్కూ చేస్తుంది కానీ ఇదే డ్రాబ్యాక్

మీ లోన్ అప్లికేషన్ తిరస్కరించబడితే బాధపడకండి. ఇతర మార్గాల్లో కూడా రుణం తీసుకోవచ్చు. గోల్డ్, స్టాక్స్, మ్యుచువల్ ఫండ్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ వంటి వాటిని తనఖా పెట్టి రుణం పొందవచ్చు. లోన్ అగైనెస్ట్ గోల్డ్, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ ద్వారా లోన్ తీసుకోవచ్చునని చెబుతున్నారు. బ్యాంకులు నో చెబితే కీలక సమయంలో NBFCలు మిమ్మల్ని రెస్క్యూ చేయవచ్చు. అయితే బ్యాంకులతో పోలిస్తే ఇక్కడ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. అంతేకాకుండా, ఇది ట్యాక్సబుల్. ఇక్కడ రుణం తీసుకుంటే మీ నెల వేతనం నుంచి మంత్లీ ఈఎంఐ డిడక్ట్ అవుతుంది. మీరు గతంలో ఏవైనా రుణాలు తీసుకుంటే వెంటనే చెల్లించాలి. ఎక్కువ ఈఎంఐలు చెల్లించే వారికి బ్యాంకులు రుణాన్ని మంజూరు చేసేందుకు ఆసక్తి చూపించకపోవచ్చు.

English summary

మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ తిరస్కరించారా? డోంట్ వర్రీ, ఇక్కడ లోన్ వస్తుంది కానీ... | Was your bank loan application rejected? Don't worry, here is how you can still raise money

With the prices of automobiles and properties skyrocketing, it has become tough for most people to buy them. In such situations, bank loans come as a relief, allowing dreams and desires to be fulfilled.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X