For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PMJJBY: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమాను ఎందుకు రెన్యూవల్ చేయించుకోవాలి?

|

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ప్రభుత్వ లైఫ్ ఇన్సురెన్స్ స్కీం. 2015 బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకం గురించి చెప్పారు. ఆ తర్వాత మే 9న కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు కేవలం 20 శాతం మంది భారతీయులకు మాత్రమే బీమా ఉంది. దీనిని పెంచడమే ఈ స్కీం ఉద్దేశ్యం.

SBI, HDFC, ICICI మినిమం బ్యాలెన్స్: పెనాల్టీ తప్పించుకోండి!SBI, HDFC, ICICI మినిమం బ్యాలెన్స్: పెనాల్టీ తప్పించుకోండి!

PMJJBY కి ఆటోమేటిక్‌గా రూ.330 డెబిట్

PMJJBY కి ఆటోమేటిక్‌గా రూ.330 డెబిట్

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సులోని వారికి అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానం ఉంటుంది. ఏడాదికి రూ.330 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల బీమా ఉంటుంది. 55 ఏళ్ల వరకు బీమా కవర్ ఉంటుంది. PMJJBY స్కీంకు జీఎస్టీ ఎగ్జెంప్షన్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా ఏడాది ప్రీమియం రూ.330 డెబిట్ అవుతుంది.

కుటుంబానికి రూ.2 లక్షలు

కుటుంబానికి రూ.2 లక్షలు

నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ లేదా ఫాం నింపి ఇవ్వడం ద్వారా అన్ని బ్యాంకు ఖాతాదారులు PMJJBY స్కీంలో చేరవచ్చు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీం కింద బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసిన అకౌంట్‌తో ఈ స్కీంను లింక్ చేశారు. జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసిన ఖాతాలు చాలా వరకు జీరో బ్యాలెన్స్‌గా ఉన్నాయి. ఇలాంటి స్కీంలు, ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారునికి చేర్చే ఉద్దేశ్యంతో పాటు జీరో అకౌంట్స్‌ను యూజ్ చేసేలా చేస్తున్నారు. PMJJBY అమౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. ఇన్సురెన్స్ చేసే వ్యక్తి హఠాత్తుగా చనిపోతే ఆ కుటుంబానికి రూ.2 లక్షలు అందుతుంది.

అలా అయితే కవరేజ్ ల్యాప్స్ అవుతుంది

అలా అయితే కవరేజ్ ల్యాప్స్ అవుతుంది

PMJJBY బీమా పీరియడ్ జూన్ 1వ తేదీ నుంచి 31 మే గా ఉంది. ఇది ప్రతి ఏడాది రెన్యూవబుల్ స్కీం. కాబట్టి మే నెలలోనే PMJJBYకు ఆమోదం తెలుపుతూ బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. PMJJBY కింద సబ్‌స్క్రైబర్ అకౌంట్ నుంచి ప్రతి ఏడాది మే 31లోపు డెబిట్ అవుతుంది. ఆ లోపు అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ క్రియాశీలకంగా లేకపోయినా లేదా అకౌంట్‌లో తగినంత అమౌంట్ లేకపోయినా కవరేజ్ ల్యాప్స్ అవుతుంది. స్కీం నుంచి ఇలా ఎగ్జిట్ అయిన వారు హెల్త్ డిక్లరేషన్, యాన్యువల్ అమౌంట్ పే చేసి తిరిగి చేరవచ్చు.

సాంకేతిక కారణాలతో ఆగిపోతే

సాంకేతిక కారణాలతో ఆగిపోతే

తగినంత బ్యాలెన్స్ లేకపోవడం, డ్యూ డేట్ దాటిపోవడం, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వంటి సాంకేతిక కారణాలతో ఇన్సురెన్స్ కవర్ సీజ్ చేయబడితే ప్రీమియం కట్టి రిసిప్ట్ పొందితే బీమా కవర్ ఉంటుంది. అయితే ఈ బీమాను ఫ్రెష్‌గా భావిస్తారు. నిబంధనలు వర్తిస్తాయి. ఈ స్కీంను LICతో పాటు ఇతర ఇన్సురెన్స్ సంస్థలు కూడా అందిస్తున్నాయి. ఎవరైనా కొత్తగా ఎన్‌రోల్ చేసుకోవాలనుకుంటే PMJJBY ఫాం ద్వారా బ్యాంకులో అఫ్లై చేసుకోవచ్చు. కవర్ పీరియడ్ 1 జూన్ నుంచి 31 మే వరకు ఉంటుంది.

1 జూన్ 2018 నుంచి 31 మే 2019తో పూర్తవుతున్నందున సబ్‌స్క్రైబర్స్ ఎన్‌రోల్ చేసుకొని, తమ అకౌంట్ నుంచి రూ.330 ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యేందుకు అనుమతివ్వాల్సి ఉంటుంది.

English summary

PMJJBY: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమాను ఎందుకు రెన్యూవల్ చేయించుకోవాలి? | PMJJBY: why you need to renew Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana by May 31

The PMJJBY scheme is a life cover for an annual premium of Rs 330 and is available to people in the age group of 18 to 50 years having a bank account.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X