For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IRCTC గుడ్‌న్యూస్: 4గంటల ముందు బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు కానీ ఇవి గుర్తుంచుకోండి!

|

IRCTC ప్రయాణీకులా, ఈ వేసవి కాలంలో మీకో గుడ్ న్యూస్! ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రైల్వేస్ ఎన్నోసార్లు తమ నిబంధనల్లో ఎన్నో సార్లు మార్పులు చేసింది. దూర ప్రాంత రిజర్వేషన్ రైలు ప్రయాణీకులకు ఇటీవల మరో శుభవార్త అందించింది. రిజర్వేషన్ చేయించుకున్న స్టేషన్లో కాకుండా మరోచోట రైలు ఎక్కాలంటే రైలు కదిలే సమయానికి కనీసం 24 గంటల ముందు మార్చుకోవాల్సి వచ్చేది. ఈ నిబంధనలో ఐఆర్‌సీటీసీ మార్పులు చేసింది. రిజర్వేషన్ చార్ట్ తయారీ అయ్యే వరకు ఎప్పుడైనా బండి ఎక్కే స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

బోర్డింగ్ స్టేషన్ ఇలా మార్చుకోండి

బోర్డింగ్ స్టేషన్ ఇలా మార్చుకోండి

రైలు డిపార్చర్‌కు 4 గంటల ముందు ఇక ట్రెయిన్ బోర్డింగ్ స్టేజీని మార్చుకోవచ్చు. అయితే కౌంటర్లలో తీసుకునే టిక్కెట్లకు ఈ వెసులుబాటు లేదు. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో రిజర్వేషన్ తీసుకున్న వారికి బోర్డింగ్ స్టేషన్‌ను చార్ట్ తయారీ ముందు వరకు మార్చుకోవచ్చు.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి. బుకింగ్ టిక్కెట్ హిస్టరీ పైన క్లిక్ చేయాలి. రైలు నెంబర్ ఎంచుకొని బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాలి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు బోర్డింగ్ స్టేషన్, 139కు డయల్ చేయడం ద్వారా కూడా మార్చుకోవచ్చు.

ఇవి గుర్తుంచుకోండి

ఇవి గుర్తుంచుకోండి

బోర్డింగ్ స్టేషన్ మార్చుకున్నప్పటికీ మొదట ఎంచుకున్న స్టేషన్‌కు సంబంధించిన ఛార్జీ తిరిగి రాదు. అలాగే, బోర్డింగ్ స్టేషన్‌ను ఒకేసారి మార్చుకోవచ్చు. టిక్కెట్ సీజ్ అయితే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోలేరు. వికల్ప్ ఆప్షన్ ద్వారా పీఎన్ఆర్‌స్ మార్చుకోలేరు. కరెంట్ బుకింగ్ టిక్కెట్స్‌కు బోర్డింగ్ పాయింట్ చేంజ్‌ను అలో చేయరు.

ఛార్జీ వెనక్కి రాదు

ఛార్జీ వెనక్కి రాదు

బోర్డింగ్ స్టేషన్ మార్చుకుంటే మరో ముఖ్యమైన అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీరు బోర్డింగ్ పాయింట్ మార్చుకుంటే కనుక, ఆ తర్వాత మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం ఛార్జీ వెనక్కి రాదు. పాత విధానంలో అయితే 12 గంటల ముందు టిక్కెట్ రద్దు చేసుకుంటే 25 శాతం, నాలుగు గంటల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం ఛార్జీ మినహాయించుకుంటారు. బోర్డింగ్ మార్చుకుంటే ఈ వెసులుబాటు ఉండదు.

English summary

IRCTC గుడ్‌న్యూస్: 4గంటల ముందు బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు కానీ ఇవి గుర్తుంచుకోండి! | IRCTC allows its passengers to change boarding station 4 hours

IRCTC travellers, good news for you! The railways have tweaked their rules regarding change of train's boarding point prior to preparation of the first passenger chart i.e., four hours before the departure time of the train.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X