For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎం నుంచి డబ్బులు రాకుండానే క్రెడిట్ అయితే ఏం చేయాలి?

|

కొన్ని సందర్భాలల్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినప్పుడు.. మన చేతికి సొమ్ము అందదు. కానీ అకౌంట్లో మాత్రం డెబిట్ చూపిస్తుంది. ఇలాంటి సమయంలో కస్టమర్ ఫిర్యాదు చేయాలి. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి. మీ కార్డ్ ఇష్యూయర్ లేదా బ్యాంకును సంప్రదించండి. ఏం జరిగిందో తెలుసుకొని ఏటీఎం ఆపరేటర్‌తో కలిసి మీ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది.

నగదు మీ చేతికి రాకుండానే, మీ అకౌంట్‌లో డెబిట్ అయితే మీరు హోం బ్రాంచ్‌లో ఫిర్యాదు చేయవచ్చు లేదా దగ్గర్లోని సదరు బ్యాంకు శాఖకు వెళ్లి విషయం తెలియజేయాలి. ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయం ఆయా బ్యాంకు వెబ్ సైట్లలో ఉంటాయి. అలాగే, బ్యాంకులకు వెళ్లినా అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆన్ లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేసిన తర్వాత అందుకు సంబంధించిన కాపీని దగ్గర పెట్టుకోవాలి. ఇలాంటి సమస్యను ఏడు రోజుల్లో పరిష్కరిస్తారు.

ఈపీఎఫ్‌ అకౌంట్‌కు నామినీ తప్పనిసరి!: ఇలా యాడ్ చేసుకోండిఈపీఎఫ్‌ అకౌంట్‌కు నామినీ తప్పనిసరి!: ఇలా యాడ్ చేసుకోండి

 What happens if ATM doesnt give you money?

ఏటీఎం కార్డు చేసిన బ్యాంకు, శాఖ..., మీకు ఏ ఏటీఎం సెంటర్‌లో, ఏ సమయంలో సమస్య తలెత్తింది..., ఎంత మొత్తం విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించారు..., ఇందుకు సంబంధించి ఏదైనా రిసిప్ట్ ఉంటే అది.. ఇలాంటివి దగ్గర ఉంచుకోవాలి.

మీరు రాతపూర్వకంగా రాసిచ్చినా నెల రోజుల్లో కూడా బ్యాంకు మీ సమస్యను పరిష్కరించకుంటే మీరు మరింత ముందుకు వెళ్లవచ్చు. అన్ని వివరాలు చెప్పి, అన్ని స్థాయిల్లో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకుంటే బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ దృష్టికి తీసుకు వెళ్లాలి. ఆర్బీఐ వెబ్ సైట్లో, పోస్ట్ ద్వారా కూడా అంబుడ్స్‌మెన్‌కు పంపించవచ్చు. ఆన్ లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేసే సమయంలో లావాదేవీకి సంబంధించి ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ ఏటీఎం సంబంధిత శాఖలో తీసుకోవచ్చు. అవసరమైతే ఆ తర్వాత వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు. ఏడు రోజుల్లో మీ సమస్య పరిష్కరించకుంటే ఆ రోజు నుంచి ప్రతి రోజుకు రూ.100 బ్యాంకు పరిహారంగా ఇవ్వాలి.

English summary

ఏటీఎం నుంచి డబ్బులు రాకుండానే క్రెడిట్ అయితే ఏం చేయాలి? | What happens if ATM doesn't give you money?

Call Your Card Issuer or Bank. File a claim with your credit card company immediately (if it was a credit card) or your bank (if it was a debit card). Let them know exactly what happened, as this is the fastest way to get funds credited to your account. Your card issuer will sort things out with the ATM operator.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X