For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ కస్టమరా.. ఈ బ్యాంక్ 5 సర్వీస్ ఛార్జీలు, ఇవి తప్పకుండా తెలుసుకోండి

|

బ్యాంకింగ్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అతిపెద్దది. ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 24వేల బ్రాంచీలు, 59వేల ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. 36 దేశాల్లో 195 ఓవర్సీస్ ఫారెన్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ బ్యాంకు తమ తమ కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. కొన్నింటికి ఛార్జీలు వసూలు చేస్తాయి. ముఖ్యమైన 5 ఛార్జీల గురించి మీరు తెలుసుకోవాలి.

<strong>రూ.15వేల కంటే తక్కువ ఆదాయం వస్తుందా, ఈ స్కీం మీకోసమే?</strong>రూ.15వేల కంటే తక్కువ ఆదాయం వస్తుందా, ఈ స్కీం మీకోసమే?

 మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుంటే ఛార్జీలు

మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుంటే ఛార్జీలు

మెట్రో సెంట్రల్ బ్రాంచీలలో కనీసం రూ.5వేల మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ (కనీస నగదు నిల్వ) చేయకుంటే నెలకు రూ.50 (జీఎస్టీ కాకుండా) ఛార్జీ చేస్తుంది. యాభై శాతం కంటే ఎక్కువగా అకౌంట్ బ్యాలెన్స్ పడిపోతే రూ.75 వరకు ఛార్జ్ చేస్తుంది. 75 శాతం, అంతకంటే ఎక్కువ శాతానికి పడిపోతే రూ.100 వరకు ఛార్జ్ చేస్తుంది. అర్బన్ సెంటర్ బ్రాంచీలలో కనీస నగదు నిల్వ రూ.3వేలు లేకుంటే నెలకు రూ.40, రూ.60, రూ.80 ఛార్జ్ చేస్తుంది. సెమీ అర్బన్ సెంట్రల్ బ్రాంచీలలో కనీస నగదు రూ.2వేలు లేకుంటే రూ.25, రూ.50, రూ.75 ఛార్జ్ చేస్తుంది. రూరల్ బ్రాంచిలో అయితే కనీసం రూ.1000 లేకుంటే నెలకు రూ.20, రూ.30, రూ.50 ఛార్జ్ చేస్తుంది.

 ఏటీఎం యూసేజ్ ఛార్జీలు

ఏటీఎం యూసేజ్ ఛార్జీలు

కొందరు పదేపదే ఏటీఎం సెంటర్‌లకు వెళ్లి డబ్బులు తీస్తుంటారు. కానీ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత చార్జ్ ఉంటుంది. నెలకు 5 ట్రాన్సాక్షన్ల వరకు ఉచితం. ఇది దాటితో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.10, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ఛార్జ్ చేస్తారు. అయితే అంతకుముందు నెలలో రూ.25వేల వరకు మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఉంటే ఇది వర్తిస్తుంది. ఒకవేళ అకౌంట్‌లో రూ.25వేలకు పైగా నగదు నిల్వ ఉంటే మాత్ర ఎస్బీఐ ఏటీఎం విత్ డ్రా ఛార్జీ ఉండదు.

ఎస్బీఐ ఏటీఎంలో ఇతర బ్యాంకు ఏటీఎం కార్డును ఉపయోగిస్తే.. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు 20 శాతం, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు 8 శాతం ఛార్జ్ చేస్తారు. అయితే మెట్రో సెంటర్‌లలో మూడు, నాన్ మెట్రో సెంటర్‌లలో 5సార్లు ఉచితం. ఆ తర్వాతనే పై ఛార్జ్ వర్తిస్తుంది. ఇక్కడ కూడా ఓ కండిషన్ ఉంది. కస్టమర్ గత నెలలో తన అకౌంట్లో కనీసం రూ.1 లక్ష వరకు ఉంటే ఇది వర్తిస్తుంది. అంతకుముందు నెల రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి తీసినా ఛార్జీలు ఉండవు.

 చెక్ బుక్ జారీ ఛార్జీలు

చెక్ బుక్ జారీ ఛార్జీలు

ఖాతాదారు క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ (క్యూఏబీ) రూ.1 లక్ష వరకు ఉంచితే ఫైనాన్షియల్ ఇయర్‌లో మొదటి 25 చెక్ లీవ్స్‌ను బ్యాంకు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత నుంచి 10, 25, 50 చెక్ లీవ్‌లకు వరుసగా రూ.30, రూ.75, రూ.150లను తీసుకుంటుంది. క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.1 లక్ష అంతకంటే ఎక్కుగా ఉంటే సీనియర్ సిటిజన్లకు చెక్ బుక్ జారీ చేసేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఎమర్జెన్సీ చెక్ బుక్ కోసం 10 చెక్ లీవ్స్ సెట్‌కు రూ.50 చార్జ్ చేస్తుంది. ఇది కరెంట్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు వర్తిస్తుంది.

 చెక్ రిటర్న్ ఛార్జీలు

చెక్ రిటర్న్ ఛార్జీలు

చెక్ రిటర్న్స్ ఛార్జీలకు ఎస్బీఐ రూ.500 వరకు వసూలు చేస్తుంది. ఖాతాలో సరైన అమౌంట్ లేకుంటే చెక్ బౌన్స్ అవుతుంది. అలాంటప్పుడు పై విధంగా ఛార్జ్ పడుతుంది. టెక్నికల్ కారణాలతో చెక్ రిటర్న్ అయితే రూ.150 వరకు ఛార్జ్ చేస్తారు. మరో ముఖ్య విషయం.. కస్టమర్ పొరపాటు లేకుండా టెక్నికల్ కారణాల వల్ల చెక్ రిటర్న్ అయితే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎలాంటి ఛార్జ్ ఉండదు.

డిమాండ్ డ్రాఫ్ట్ ఛార్జీలు

డిమాండ్ డ్రాఫ్ట్ ఛార్జీలు

డిమాండ్ డ్రాఫ్ట్స్, బ్యాంకర్ల చెక్స్ జారీ చేసినప్పుడు రూ.5000 వరకు రూ.25 ఛార్జ్ చేస్తారు. రూ.5వేల నుంచి రూ.10వేల వరకు రూ.50 చార్జ్ చేస్తారు. రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు వెయ్యికి రూ.5 చార్జ్ చేస్తారు. రూ.లక్షకు పైగా వెయ్యికి 4 శాతం వసూలు చేస్తారు. దీని మొత్తం కనిష్టంగా రూ.600 గరిష్టంగా రూ.2వేలుగా ఉంది.

English summary

ఎస్‌బీఐ కస్టమరా.. ఈ బ్యాంక్ 5 సర్వీస్ ఛార్జీలు, ఇవి తప్పకుండా తెలుసుకోండి | SBI Charges: 5 service charges of SBI you must be aware of as a customer

The State Bank of India (SBI) is the largest and one of the most popular scheduled commercial banks in India. Apart from having over 24,000 branches and over 59,000 ATMs in India, the SBI has an overseas presence through 195 foreign offices spread across 36 countries.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X