For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది మీకు తెలుసా?: DigiLockerతో ఎంతో లాభం, ఎలా ఓపెన్ చేయాలి, లాభాలేమిటి?

|

ముఖ్యమైన పత్రాలను చాలామంది సూటుకేసుల్లో, ఫైళ్లలో దాచిపెడతారు. ఇప్పుడు అందరు కూడా తమ ఈ-మెయిల్స్, గూగుల్ డ్రైవ్ వంటి వాటిలో స్టోర్ చేసుకుంటున్నారు. మీ పత్రాలను ప్రభుత్వ ప్లాట్‌ఫారం డిజిలాకర్ (https://digilocker.gov.in/)లోను దాచుకోవచ్చు. తమ ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకునేందుకు కేంద్రం డిజి లాకర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ సర్టిఫికేట్లను వెంట తీసుకెళ్లకుండా దీని ద్వారా కావాల్సినప్పుడు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఉంటే డిజిటల్ లాకర్ తెరిచి, 10 ఎంబీ డేటా భద్రపరుచుకునే సౌకర్యం ఉంది. ఇది క్లౌడ్ బేస్డ్ ప్రభుత్వ ప్లాట్ ఫారం. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితరాలను స్టోర్ చేసుకోవచ్చు.

<strong>ATM ఫ్రాడ్-ఫేక్ ట్రాన్సాక్షన్: మూడ్రోజుల్లో 61 ఖాతాల్లో నుంచి రూ.15 లక్షలు గల్లంతు</strong>ATM ఫ్రాడ్-ఫేక్ ట్రాన్సాక్షన్: మూడ్రోజుల్లో 61 ఖాతాల్లో నుంచి రూ.15 లక్షలు గల్లంతు

DigiLockerతో ఎన్ని లాభాలు

DigiLockerతో ఎన్ని లాభాలు

డీజీ లాకర్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉదాహరణకు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను మీ డిజీ లాకర్ ద్వారానే చూపించవచ్చు. ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు డిజిటల్ ఆధార్, డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను వాలిడ్ ఐడీ ప్రూఫ్స్‌గా ఆమోదిస్తోంది. సాధ్యమైనంతగా పేపర్ ఉపయోగాన్ని దీని ద్వారా తగ్గిస్తున్నారు. డిజి లాకర్‌లో 30 కోట్ల మందికి పైగా తమ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్‌ను దాచుకున్నారు. ఈ-సైనింగ్ ద్వారా ఈ డాక్యుమెంట్లను మనమే అప్ లోడ్ చేసుకోవచ్చు.

 DigiLockerలో వేటిని దాచుకోవచ్చు?

DigiLockerలో వేటిని దాచుకోవచ్చు?

DigiLocker యూఐడీఏఐతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఆధార్ కార్డు నెంబర్ ద్వారా యాక్సెస్ కావొచ్చు. డిజి లాకర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్‌తోను భాగస్వామ్యం కలిగి ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ సిటిజన్స్‌కు అందుబాటులో ఉంటాయి. యూజర్లు తమ పాన్ కార్డును కూడా స్టోర్ చేసుకోవచ్చు. డిజి లాకర్ సీబీఎస్ఈతోను భాగస్వామ్యం కలిగి ఉంది. ఇందులో విద్యార్థుల మార్కు షీట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ డిజిటల్ సేవ ఉచితం. విద్యార్హత, నివాస ధ్రువపత్రాలు డైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, వ్యక్తిగత పత్రాలతోపాటు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆదాయ పన్ను ఖాతా, పాన్ కార్డు నంబర్, వంటి కీలక పత్రాలను దాచుకోవచ్చు. ఈ పత్రాలన్నీ క్లౌడ్ పద్ధతిలో సురక్షితంగా ఉంటాయి. ఆయా డిజిటల్ పత్రాలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదిస్తుంది. కనుక ఎక్కడైనా ముద్రించి తీసి ఇవ్వవచ్చు. పత్రాలను మోసుకెళ్లే బాధ తప్పుతుంది.

 డిజి లాకర్‌ను ఎలా ఓపెన్ చేయాలి?

డిజి లాకర్‌ను ఎలా ఓపెన్ చేయాలి?

డిజిలాకర్‌లో పత్రాలు దాచుకునేందుకు ఆధార్ తప్పనిసరి. ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన సెల్‌ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉండాలి. అలా అయితే డిజిలాకర్‌ వెబ్ సైట్లోకి (https://digilocker.gov.in/) వెళ్లి సైన్అప్ క్లిక్ చేయాలి. సైనప్ క్లిక్ చేయగానే సెల్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ వస్తుంది. మెయిల్‌కు కూడా సందేశం వస్తుంది. కింద డబ్బా వంటి బాక్సులో మీకు వచ్చిన సందేశాన్ని నమోదు చేయాలి. యూజర్ నేమ్, పాస్ వర్డ్ అడుగుతుంది. వాటిని పూర్తి చేయాలి. అనంతరం ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆ తర్వాత మీరు మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు దాచుకోవచ్చు.

 DigiLockerలో డాక్యుమెంట్స్ అప్ లోడ్ ఎలా?

DigiLockerలో డాక్యుమెంట్స్ అప్ లోడ్ ఎలా?

డిజిలాకర్‌లో డాక్యుమెంట్స్ ఇలా అప్ లోడ్ చేయవచ్చు. సబ్ స్క్రైబర్స్ డిజిలాకర్‌లోని అప్ లోడింగ్ ఐకాన్‌ (గుర్తు)ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత లోకల్ డ్రైవ్‌లో ఫైల్ లొకేషన్‌కు వెళ్లి ఓపెన్ అని సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు అప్ లోడ్ అవుతుంది. అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్ టైప్ కోసం సెలక్ట్ డాక్ టైప్‌ను క్లిక్ చేయాలి. తగిన డాక్యుమెంట్‌ను ఎంచుకొని సేవ్ పైన క్లిక్ చేయాలి. మీరు ఫైల్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి ఎడిట్ ఐకాన్ ఉపయోగించాలి.

కాగా, మీరు అప్ లోడ్ చేసే ప్రతి పత్రానికి ఓటీపీ వస్తుంది. ప్రతి పత్రానికి సైజ్ లిమిట్ ఉంటుంది. ఒక్కో ఖాతాకు 1 జీబీ వరకు స్పేస్ ఉంటుంది. ఇందులో మీ పత్రాలు సేఫ్‌గా ఉంటాయి. ఆధార్ కార్డులో నమోదైన వివరాలనే డిజి లాకర్ వ్యక్తిగత వివరాలుగా తీసుకుంటుంది. కాబట్టి మోసాలు ఉండవు.

డిజిలాకర్‌లో పత్రాలు భద్రపర్చుకోవడంతో పాటు ఈ-సైన్ కు అవకాశముంది. ఈ-సైన్‌పై క్లిక్ చేస్తే ధ్రువపత్రంపై మన సంతకం చేసినట్లు అవుతుంది. నెట్లో దరఖాస్తులు కోరేవారికి దీని ద్వారా సులభంగా పంపించవచ్చు. ఆధార్‌తో అనుసంధానం ఉంటుంది కాబట్టి మీసేవలో మీరు పొందిన ధ్రువపత్రాలు ఆటోమేటిక్‌గా డీజీలాకర్‌లోని మన ఖాతాలోకి వెళ్తాయి. మీ వివరాలను నేరుగా కంపెనీమెయిల్ కి కాని లేకుంటే మీ ప్రెండ్స్‌కి కాని షేర్ చేసుకునే సౌకర్యం ఉంది.

English summary

ఇది మీకు తెలుసా?: DigiLockerతో ఎంతో లాభం, ఎలా ఓపెన్ చేయాలి, లాభాలేమిటి? | How To Upload Aadhaar Card, PAN Card, Driving License On DigiLocker

DigiLocker, a cloud-based government platform, allows users to store and access electronic versions of their documents such as Aadhaar card, PAN (Permanent account number) card, driving license among others.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X