For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 బెస్ట్ పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్: మరిన్ని వివరాలు తెలుసుకోండి, విత్ డ్రా చేసుకోవచ్చు.. కండిషన్స్

|

మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్‌లో తొమ్మిది రకాల స్మాల్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ పథకాలు ఉన్నాయి. indiapost.gov.in వెబ్‌సైట్ ప్రకారం.. పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్ స్కీం అకౌంట్, 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, సుకన్య సమృద్ధి స్కీం వంటి పలు రకాల పథకాలు ఉన్నాయి. ఈ పోస్టాఫీస్ స్కీముల్లో ఎక్కువ వరకు తక్కువ ఇన్‌స్టాల్‌మెంట్ కలిగినవే. కాబట్టి చాలామందికి ఇవి అనుకూలంగా ఉండే స్కీంలు. కాలపరిమితిని చూసుకొని ఆయా స్కీముల్లో చేరితే మంచి రిటర్న్స్ ఉంటాయి. పీపీఎఫ్ స్కీం మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు కాగా, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం 5 ఏళ్లు. పీపీఎఫ్‍‌కు ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంది. పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న స్కీంలు.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీం అకౌంట్, 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడంట్ ఫండ్ అకౌంట్, సుకన్య సమృద్ధి అకౌంట్, అయిదేళ్ల పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం తదితరాలు ఉన్నాయి.

<strong>రూ.15వేల కంటే తక్కువ ఆదాయం వస్తుందా, ఈ స్కీం మీకోసమే?</strong>రూ.15వేల కంటే తక్కువ ఆదాయం వస్తుందా, ఈ స్కీం మీకోసమే?

 పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీం అకౌంట్

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీం అకౌంట్

ఇది నెలసరి వాయిదా పథకం. ఒకే అకౌంట్‌లో మాగ్జిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ రూ.4.5 లక్షలు. మీరు సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే మాగ్జిమం లిమిట్ రూ.9 లక్షలు. ఇందులో వడ్డీ రేటు ఏడాదికి 7.3. నెల వాయిదాలు ఉంటాయి. మెట్యూరిటీకి ముందు కూడా మీరు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ ఏడాది తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మూడేళ్లకు ముందు మీ డబ్బు తీసుకుంటే 2 శాతం, మూడేళ్ల తర్వాత తీసుకుంటే ఒక శాతం ఛార్జ్ ఉంటుంది. 8.12.07 నుంచి 30.11.2011 మధ్య తెరిచిన అకౌంట్లకు 5 శాతం బోనస్ ఉంటుంది. 1.12.2011 తర్వాత తెరిచిన అకౌంట్లకు బోనస్ లేదు.

15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్

15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్

ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. 12 వాయిదాల్లో లేదా ఒకేసారి ఈ మొత్తాన్ని చెల్లించవచ్చు. దీని మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు. ఈ ఖాతాను నిర్ణీత సమయాని కంటే ముందు (15 ఏళ్లు) క్లోజ్ చేయరాదు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. పీపీఎఫ్ వడ్డీ ఏడాదికి 8 శాతం. పూర్తి ట్యాక్స్ ఫ్రీ.

సుకన్య సమృద్ధి అకౌంట్

సుకన్య సమృద్ధి అకౌంట్

చట్టబద్దమైన గార్డియన్ లేదా తల్లిదండ్రులు తమ కూతుళ్ల పేరు మీద ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒకేసారి మొత్తం లేదా రూ.100 చొప్పున పలుమార్లు చెల్లించవచ్చు. ఈ పథకంలో చేరడానికి ఆడపిల్లలకు పదేళ్ల లోపు వయస్సు ఉండాలి. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు వచ్చాక ఆమె ఉన్నత చదువుల కోసం లేదా వివాహం కోసం ఖాతాలోని మొత్తం నుంచి 50 శాతం నగదును ఉపసంహరించుకునే అవకాశముంది. 21 ఏళ్లకు అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఏడాదికి 8.5 శాతం వడ్డీ.

 5 ఏళ్ల పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్

5 ఏళ్ల పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్

రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో నెలలో పలుమార్లు తక్కువలో తక్కువగా రూ.5 నుంచి నెలకు రూ.10కి తగ్గకుండా డిపాజిట్ చేయవచ్చు. ఇందులో మాగ్జిమమ్ లిమిట్ లేదు. ఈ ఖాతాను కనీసం అయిదేళ్లు కొనసాగించాలి. నామినీని ఎప్పుడైనా పేర్కొనవచ్చు. వడ్డీ రేటు ఏడాదికి 7.3 శాతంగా ఉంది. ఆర్డీ ఖాతాను ఎలాంటి రుసుము లేకుండా ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు. ఒకరి పేరుపై ఉన్న ఖాతాను ఉమ్మడి ఖాతాగా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఉమ్మడి ఖాతాను కూడా ఒకే వ్యక్తికి బదలీ చేయవచ్చు. నిర్ణీత సొమ్మును నెల నెల నిర్ణీత తేదీల్లో చెల్లించాలి. ముందస్తు చెల్లింపులకు రిబేట్ అవకాశం ఉంటుంది. వరుసగా నాలుగుసార్లు చెల్లించకుంటే నిలిపేస్తారు. డిఫాల్ట్ ఫీజు రూ.0.05 నుంచి రూ.5 వరకు ఉంటుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం

55 ఏళ్ల నుంచి 66 ఏళ్ల రిటైర్మెంట్ సమయంలో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం బాగుంటుంది. విధి నిర్వహణలో ఉన్న వ్యక్తి లేదా వీఆర్ఎస్‌లో ఉన్న వ్యక్తి కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పదవీ విరమణ ప్రయోజనాలు స్వీకరించడానికి నెల రోజులు ముందే ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి. అలాగే మొత్తం పదవీ విరమణ బెనిఫిట్స్‌కు మించవద్దు. రూ.1000 నుంచి రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ అయిదేళ్లు. ఏడాది తర్వాత ప్రీమెచ్యూర్ క్లోజింగ్‌కు అవకాశముంది. మీ మొత్తానికి 1.5 శాతం డిడక్షన్ ఉంటుంది. రెండేళ్ల తర్వాత 1 శాతం డిడక్షన్‌తో క్లోజ్ చేసుకోవచ్చు. ఏడాదికి 8.7 శాతం వడ్డీ.

English summary

5 బెస్ట్ పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్: మరిన్ని వివరాలు తెలుసుకోండి, విత్ డ్రా చేసుకోవచ్చు.. కండిషన్స్ | Post Office Saving Schemes: From PPF to SCSS, 5 best post office schemes you can bet on for better return

These schemes are popular as an investment option among customers in India because most of these schemes can be started with minimal investment amounts and offer high interest to the customers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X