For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీలునామా వ్రాయకుండా చనిపోతే ఆస్థి ఎవరికీ చెందుతుంది

By girish
|

ఒక వ్యకి కనుక చనిపోతే అంటే వీలునామా రాయకుండా చనిపోతే అతను లేక ఆమె స్థిరాస్థులు కానీ చరాస్తులు కానీ తీసుకోవాలి అంటే ఎవరు క్లయిమ్ చేయాలి ఆ అరహతా ఎవరికీ ఉంటదో చూద్దామా!

వీలునామా

వీలునామా

మాములుగా ఒక వ్యక్తి వీలునామా రాసి చనిపోతే దానిని టెస్టేట్ ప్రాపర్టీ అని అంటారు ఒకవేళ అతను లేక ఆమె వీలునామా రాయకుండా చనిపోతే దానిని ఇంటెస్టేట్ ప్రాపర్టీ అని అంటారు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే అతని తర్వాత అతని ఆస్థి ఎవరికీ చెందాలి అనేది ఒక పెద్ద ప్రశ్న.

హిందూ వారసత్వ చట్టంలో

హిందూ వారసత్వ చట్టంలో

ఇక ఇలా జరిగినప్పుడు కుటుంబాలలో చాలా సందేహాలు వస్తుంటాయి ఎందుకంటే ఆడపిల్లలు మాకు కావాలి అంటారు మగపిల్లలు మాకు కావలి అంటారు ఇక దాయాదులు మాకు ఏమైనా వస్తుందా? అని చూస్తారు. ఇలాంటి పరిస్థితులలో ఏమి చేయాలి అంటే ఆస్తుల పంపకం ఎలా ఉండాలి వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే ఏమి చేయాలి అనేది మనకి హిందూ వారసత్వ చట్టంలో చెప్పడం జరిగింది.

ప్రధమ శ్రేణి వారసులు

ప్రధమ శ్రేణి వారసులు

ఈ చట్టంలో ప్రధమ శ్రేణి వారసులు మరియు ద్వితీయ శ్రేణి వారసులు అని ఒక లిస్టు ఉంటుంది మొదటగా మనం ప్రధమ శ్రేణి వారసులు గురించి తెల్సుకుందాం. ఇలా చనిపోయిన వ్యక్తికి ముందుగా తల్లి ఉందా లేదా అని చూస్తారు. తర్వాత భార్య ఇక్కడ మనం భార్యని విధవరాలిగా చెప్పుకోవాలి మరియు కొడుకు, కూతురు. వీరు ప్రధమ శ్రేణి వారసుల కిందకి వస్తారు. ఒకవేళ కొడుకు చనిపోయిఉన్నట్లు అయితే ఆ కొడుకు యొక్క సంతానం కూడా ప్రధమ శ్రేణి వారసుల క్రిందకి వస్తుంది. కాబ్బటి వీరికి ఆస్తులు సమానంగా వచ్చే అవకాశం ఉంది.

ద్వితీయ శ్రేణి వారసులు

ద్వితీయ శ్రేణి వారసులు

ఇక ద్వితీయ శ్రేణి వారసులు అంటే ఇక చనిపోయిన వారికి సంతానం ఎవరు లేకుండా ఉంటె మనవళ్లు , మనవరాళ్లు, ఇక వీరు కూడా లేనప్పుడు మాములుగా భర్త చనిపోతే భార్య ఉంటుంది. లేదా భార్య చనిపోతే భర్త ఉంటుంది కనుక వీరిలో ఎవరికో ఒకరికి ఆస్తు చెందుతుంది. ఇక ఆ కుటుంబంలో ఎవరు లేకపోతే ముందుగా భర్త తరుపున బంధులకు చెందుతుంది. లేదా తనకు ఎవరు లేకపోతే భార్య తరుపున బంధువులకి ఇస్తారు. కానీ ఎవరు లేకుండా ఎవరు ఉండరు.

 లీగల్

లీగల్

ఇక ఈ ఆస్థిని పంచుకోవాలి అంటే చనిపోయిన ఆ వ్యక్తి యొక్క వివరాలు తెలుసుకోవాలి అతని మరణ ధ్రువీకరణ పత్రము మరియు కుటుంబ సభ్యుల యొక్క ధ్రువీకరణ పత్రము వీటన్నిటిని అమర్చుకొని కోర్ట్ ద్వారా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. చనిపోయిన వ్యక్తికి లీగల్ హెయిర్ గా వీరిని ప్రకటించండి అని చెప్పి కోర్ట్ ద్వారా తెచ్చుకోవాలి. అప్పుడు ఎంతమంది లీగల్ హెయిర్ ఉన్నారో అంతమంది సమానంగా పంచుకోవచ్చు.

ఇక చనిపోయిన వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే?

ఇక చనిపోయిన వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే?

చనిపోయిన వ్యక్తి ఆస్తులు పంచుకొనేటప్పుడు రెండో భార్య పిల్లలు లేదా రెండో భార్య వీరు ప్రధమ శ్రేణి వారసుల కిందకి వస్తారా?లేక ద్వితీయ శ్రేణి వారసుల కిందకి వస్తారా?ముందుగా ఇక్కడ చెప్పుకోవలసింది ఏంటి అంటే చనిపోయిన వ్యక్తి హిందూ అయితే అతని వివాహం ఎప్పుడూ జరిగిందో చూస్తారు. మనకు హిందూవివాహ చట్టము 1955 లో వచ్చింది. 1955 కి ముందు మనకి బహుభార్యతనం ఉంది.

1955 ముందు

1955 ముందు

ఇక 1955 ముందు చనిపోయిన వ్యక్తి ఇద్దరు భార్యలతో వివాహం జరిగింటే ఆస్తుల పంపకం అప్పుడు భార్యలకు వాటా అన్నప్పుడు ఇద్దరు భార్యల వాటా ఒక భార్య వాటా కిందకి వేస్తారు. 1955 తర్వాత చనిపోయిన వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకొంటే తన రెండో భార్యకు ఎంటువంటి ఆస్థి రాదు. కానీ చట్టంలో ఏముంది అంటే రెండో భార్య సంతానం కూడా ప్రధమ శ్రేణి వారసులుగా చేర్చాలి అని ఉంది.

 వ్యక్తి కష్టజీతం

వ్యక్తి కష్టజీతం

ఇక్కడ చనిపోయిన వ్యక్తి కష్టజీతం మాత్రమే రెండో భార్య పిల్లలకి చెందుతుంది ఎలాగా అంటే ఎప్పుడూ చనిపోయిన వ్యక్తి తన తల్లితండ్రుల నుంచి వచ్చే ఆస్తులు ఉంటాయి అవి రెండో భార్యకి మరియు తన పిల్లలకి చెందవు.

Read more about: property
English summary

వీలునామా వ్రాయకుండా చనిపోతే ఆస్థి ఎవరికీ చెందుతుంది | How to Claim Property After Death

If a person dies, he or she will be neither the property nor the chariot,
Story first published: Monday, September 24, 2018, 12:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X