English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

జాతకాన్ని మార్చేసిన కోళ్లు

Written By: Bharath
Subscribe to GoodReturns Telugu

వేల సంవత్సరాల క్రితం మానవుడు ఆసియ,ఆఫ్రికా తదితర దేశాలలో కోళ్ల పందేల కోసం పుంజు కోళ్లను పెంచేవారు.ఒక్కసారి పురాణాలు చూసినటైతే ఈ కోళ్లకు చాల ప్రఖ్యాత ఉంది .ఒక్కప్పుడు కోళ్లను ప్రతేకంగా పెంచడం లాంటివి లేవు ఎందుకంటే అప్పుడు ఇంత గిరాకీ లేదు,కానీ ప్రస్తుత రోజుల్లో మాంస ప్రియులు చాల మందే ఉన్నారు.మానవ జీవితంలో ప్రధాన భాగమైన కోళ్ల మాంసం,కోడి గుడ్లు వంటివి గృహ అవసరాలకు మరియు వాణిజ్య అవసరాలకు గాను వివిధ రకాల కోళ్లను పెంచడం మొదలయింది.వీటినే పౌల్ట్రీ పరిశ్రమ అని పిలుస్తారు.

పౌల్ట్రీ పరిశ్రమ సమాచారం

పౌల్ట్రీ పరిశ్రమ సమాచారం

మాంసం పరిశ్రమలో కోళ్లకు ప్రత్యేకమైన స్ధానముంది. కోళ్లను వుత్పత్తి చేసే రైతులు వీటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం లేదా వాణిజ్య దుకాణాలకు సరఫరా చేయడం ద్వారా డబ్బును సంపాదిస్తున్నారు.వీటిని పెంచడంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే మని లాభాలు పొందవచ్చు.మొదట వీటిని పెంచే పరిసరాల ఉష్ణోగ్రతలు వాటి శరీర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఉండాలి లేదంటే వీటి మనుగడ సాధ్యం కాదు.మంచి ఆరోగ్య కరమైన దాన మరియు గింజలు నంటివి ఆహారంగా ఇస్తే మంచి దిగుబడి సాధించవచ్చు.

ఖమ్మం జిల్లాకు సంబందించిన రైతు

ఖమ్మం జిల్లాకు సంబందించిన రైతు

ఖమ్మం రురల్ మండలం పల్లెగూడం గ్రామానికి చెందిన రుక్మాంగదరావు తన 20 ఎకరాల వ్యవసాయ భూమిలో ఏడాది క్రితం నాటుకోళ్లు పెంచే ఫారం మొదలుపెట్టాడు.వివిధ రకాల జాతులకు సంబందించిన కోళ్లను పెంచి విక్రయిన్చేవాడు.ఇందులోఅతడు మంచి లాభాలు ఆర్జించాడు.

B .Tech చదివిన ఇద్దరు విద్యార్థుల విజయం:

B .Tech చదివిన ఇద్దరు విద్యార్థుల విజయం:

బసవ నవీన్ కుమార్ మరియు శేరెడ్డి శివ రెడ్డి అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అదే ఖమ్మం జిల్లా మల్లెగూడం గ్రామానికి చెందిన వారు నాటు కోళ్ల గురించి తెలుసుకొని రుక్మాంగద రావును కలిసి వివరాలు తెలుసుకున్నారు.వీరిద్దరి ఆసక్తిని గమనించిన తియ్యని వీళ్లకు తన ఫారం నులీజుకిచ్చేందుకు ముందుకొచ్చాడు.ప్రస్తుతం మార్కెట్లో నాటు కోళ్లకు చాల డిమాండ్ ఉండటం గమనించిన వాళ్లు తమ ప్రతిభ నైపుణ్యాలతో మంచి యువ పౌల్ట్రీ రైతులుగా ఎదగారు.అంతేకాకుండా వారి విద్యతో పటు సాంకేతికతను జోడించి పౌల్ట్రీని మంచి లాభాల దిశగా నడిపించారు.ఆలా మొదలుపెట్టి పది మందికి ఉపాధి కల్పించి అందరికి ఆదర్శనంగా నిలిచారు.

నెలసరి ఆదాయం సుమారు 70 వేలు:

నెలసరి ఆదాయం సుమారు 70 వేలు:

వివిధ రకాల నాటు కోళ్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ను గమనించిన ఈ ఇద్దరు ఇతర ప్రాంతాలనుండి కడకనాథ్ కోళ్లుతో పాటు చీమ కోళ్లు,సావేళఎండీగా,టర్కీ,కాకినెమలి ,ఇటుక తదితర జాతులకు చెందిన నాటు కోళ్లను తెచ్చి వాటిమీద మంచి లాభాలను పొందడం మొదలుపెట్టారు.ఈ కోళ్లఫారం లో పెంచుతున్న కోళ్ల నుండి వచ్చే గుడ్లను ఇంక్యూబేటర్ సాయంతో పిల్లలను పొదిగించి ఉత్పత్తి చేస్తున్నారు.నాటుకోడి ,కడకనాథ్ ,కౌజుపిట్టల గుడ్లను మిషన్ ద్వారా పొదిగించడం విశేషం.

కడకనాథ్ కోళ్లు:

కడకనాథ్ కోళ్లు:

కడకనాథ్ కోళ్లు మధ్య ప్రదేశ్ కు చెందినవి.ప్రత్యేకించి చెప్పాలంటే ఈ కోళ్ల రంగు చూడటానికి కారునలుపు లో ఉంటాయి. నాటు కోళ్లకు ఉన్న డిమాండ్ మరి ఏ ఇతర కోళ్లకు ఉండదు.వీటిలో ఉన్న అవుషదా గుణాలు బ్రోఎలర్ కోట్లలో ఉండవు అందుకే వీటికి విపరీతమైన గిరాకీ ఉంది,ఈ మధ్యకాలంలో నాటు కోళ్ల జాతికి చెందిన కడకనాథ్ కోళ్లు బాగా డిమాండ్ కలిగి ఉన్నాయి.మధ్య ప్రదేశ్ లో కొంతమంది గిరిజనులు వీటి పెంపకంద్వారా పేదరికం నుండి బయట పడి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

కడకనాథ్ కోళ్లలో ప్రత్యేకత:

కడకనాథ్ కోళ్లలో ప్రత్యేకత:

వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనుషుల ఆరోగ్యానికి సంబందించిన ఔషధ గుణాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయని అధ్యయనంలో తెలిసింది.దీని వల్ల మధ్య ప్రదేశ్ లోనే కాదు హైదరాబాద్,రాజస్థాన్,చేతిసఘడ్ ప్రాతాల్లో కూడా మంచి గిరాకీ ఏర్పడింది.నరాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడే హోమియో ఔషధ గుణాలు కడకనాథ్ మాంసంలో ఉన్నాయి.ఇందులో ఐరన్ ఎక్కువగా కొవ్వు తక్కువ ఉంటుందని బెంగుళూరుకు చెందిన కేంద్రీయ ఆహార పరిశోధన సంస్థ తెలిపింది.గుండెజబ్బులు మరియు ఆస్తమా వ్యాధితో బాధపడే వాళ్ళకి ఈ మాంసం చాల మంచిదని వైద్యులు తెలిపాడు అందుకే వీటికి ఇంత విపరీతమైన గిరాకీ ఏర్పడి మంచి ధర పలుకుతోంది.

English summary

Engineering Guys Made Successful Poultry Farming Venture

Owing to the increasing demand for chicken, eggs and the quest for self employment, many people are turning to poultry farming with mixed results.
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns