For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్య‌వ‌సాయ భూమి కోల్పోతున్నారా... చ‌ట్టం ద్వారా లాభం ఎలా పొందాలి?

ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లోనూ భూయజమానులు తీవ్రంగా అన్యాయాలకు గురవుతున్న ఉదంతాలు లెక్కకు మించి ఉన్నాయి. 12 వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల అ

|

భూసేకరణ చట్టం,2013
ప్రజా ప్రయోజనాల కోసం చేసే భూసేకరణ (Land Acquisition) లో దశాబ్దాల తరబడి రైతులకు అన్యాయం జరుగుతోంది. పరిహారం పేరుతో వారికి చెల్లించే డబ్బు మార్కెట్ ధర కంటే ఎంతో తక్కువగా ఉండేది. ఆ స్వల్ప పరిహారం చెల్లింపులో కూడా విపరీత జాప్యం చేసేవారు. భూముల కొనుగోలుదారులు నానాటికీ అభివృద్ధి చెందుతుంటే, భూములు కోల్పోయినవారు పేదరికంలో మిగిల్చేరీతిలో భూసేకరణ విధానం కొనసాగుతోంది.

1990 దశకం నుంచి కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణల ప్రభావం వల్ల అభివృద్ధి ప్రక్రియల్లో అనేక పరిమాణాత్మ, గుణాత్మక మార్పులు సంభవించాయి. మౌలిక సదుపాయాల రంగంలో అవసరమైన భారీ పెట్టుబడులకు ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లోనూ భూయజమానులు తీవ్రంగా అన్యాయాలకు గురవుతున్న ఉదంతాలు లెక్కకు మించి ఉన్నాయి. 12 వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనివ్వడమే కాకుండా 2020 నాటికి 60 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి గాను పెద్ద ఎత్తున భూసేకరణ అవసరమవుతోంది. అందువల్ల ఈ ప్రక్రియలో సామాన్య రైతులు, ప్రజలు నష్టపోకూడదన్న మహోన్నత ఆశయంతో భూసేకరణ mచట్టాన్ని రూపొందించారు. నూతన భూసేకరణ చట్టంలోని సానుకూల అంశాలను సమీక్షిద్దాం.

1. ఆహార భద్రత:

1. ఆహార భద్రత:

సానుకూల అంశాలు

1. ఆహార భద్రత: ఇప్పటి వరకు సారవంతమైన భూములను వివిధ కారణాలు, ఒత్తిళ్ల వల్ల ఇతర అవసరాల కోసం యథేచ్ఛగా సేకరిస్తూ వస్తున్నారు. అయితే నూతన చట్టం వ్యవసాయ భూమిని సేకరించేటప్పుడు ఆహార భద్రతకు భంగం కలగకుండా చూడాలని నిర్దేశిస్తోంది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఎలాంటి పరిస్థితులలోనూ రెండు మూడు పంటలు పండే సారవంతమైన భూములను, నీటి పారుదల సదుపాయాలు గల భూములను సేకరించరాదు. దీనివల్ల సారవంతమైన భూములను ఇతర అవసరాలకు సేకరించకుండా అడ్డుకట్టపడుతుంది.

2. బాధితుల అంగీకారం:

2. బాధితుల అంగీకారం:

1894 చట్టంలో భూసేకరణలో బాధితుల అంగీకారానికి చోటు లేదు. కానీ తాజా చట్టంలో ప్రైవేటు కంపెనీలకు భూసేకరణ చేసేటప్పుడు 80 శాతం వరకు, పబ్లిక్ ప్రైవేటు ప్రాజెక్టులకు నిర్వాసితుల్లో 70 శాతం మంది అంగీకారం తప్పనిసరి. దీనివల్ల భూమిని బలవంతంగా సేకరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.

3. నష్టపరిహారం:

3. నష్టపరిహారం:

1894 చట్టంలో నష్టపరిహారంగా మార్కెట్ విలువనే ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. అయితే నూతన చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించాలి. దీనివల్ల సంబంధిత భూయజమానులకు సరైన న్యాయం జరుగుతుంది.

4. మార్కెట్ విలువ:

4. మార్కెట్ విలువ:

1894 చట్టం ప్రకారం ప్రస్తుతం ఆ భూమి నిరుపయోగత, ముందుగా ఊహించని వినియోగం ఆధారంగా భూమి మార్కెట్ విలువను ఖరారు చేసేవారు. నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ సమయంలో సంబంధిత భూమికి సంబంధించి మార్కెట్ విలువను నిర్ణయించడానికి బేసిక్ ధరకు మూడు రెట్లు లేదా గత మూడు సంవత్సరాలలో జరిగిన భూ లావాదేవీల్లో అత్యధిక విక్రయధర ఆధారంగా వీటిలో ఏది ఎక్కువయితే దానిని పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల భూయజమానులకు న్యాయబద్ధమైన ప్రయోజనం చేకూరుతుంది.

5. సామాజిక ప్రభావం అంచనా:

5. సామాజిక ప్రభావం అంచనా:

1894 చట్టంలో సామాజిక ప్రభావ అంచనా నిబంధనే లేదు. కానీ నూతన భూసేకరణ చట్టంలో ప్రతి సేకరణ విషయంలో సామాజిక ప్రభావ అంచనా తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నిబంధనతో నిర్దేశిత భూసేకరణ వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం కలుగుతుందని అంచనా వేస్తే సేకరణ చేపట్టరాదు.

6. భూమి తిరిగి విక్రయిస్తే అనుమతి తప్పనిసరి:

6. భూమి తిరిగి విక్రయిస్తే అనుమతి తప్పనిసరి:

1894 నాటి చట్టంలో భూమి తిరిగి విక్రయించే అంశం ప్రస్తావనే లేదు. అయితే నూతన చట్టం ప్రకారం భూ యజమాని నుంచి కొనుగోలు చేసిన భూమిని తిరిగి విక్రయించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీనివల్ల భూ విక్రయాల్లో పారదర్శకత చోటు చేసుకుంటుంది.

7. లాభాల పంపిణీ:

7. లాభాల పంపిణీ:

1894 చట్టంలో లాభాల పంపిణీ విషయానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదన లేదు. నూతన చట్టం ప్రకారం సేకరించిన భూమిని తిరిగి విక్రయించాలంటే 40 శాతం లాభాలను ఆ భూ యజమానులతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇది భూయజమానులకు అత్యంత ప్రయోజనకరమైన నిబంధన.

8. 100 శాతం తాత్కాలిక పరిహారం:

8. 100 శాతం తాత్కాలిక పరిహారం:

అసౌకర్యానికి గురికావడం, గాయపడడం లేదా ఇతరత్రా కలిగిన నష్టాలకు 30 శాతం తాత్కాలిక పరిహారంగా చెల్లించాలని 1894 నాటి చట్టం నిర్దేశిస్తోంది. అయితే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తాత్కాలిక పరిహారం 100 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల భూ యజమానులకు గతంలో కంటే మూడు రెట్లు అధిక ప్రయోజనం చేకూరుతుంది.

9. భూ బ్యాంకులో జమ:

9. భూ బ్యాంకులో జమ:

భూ సేకరణ జరిగిన తర్వాత భూమిని ఉపయోగించకుండా ఖాళీగా ఉంచితే, ఆ భూమిని తిరిగి సొంతదారుకు అప్పగించడం లేదా రాష్ట్ర భూ బ్యాంకుకు జమచేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రాజెక్టుల్లో జాప్యానికి తెరపడుతుంది. భూమి సేకరించినవారు నిర్లిప్తంగా ఉండకుండా వెంటనే ప్రాజెక్టును పట్టాలెక్కించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు ఫలితాలు సత్వరమే లభిస్తాయి.

10 . ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రయోజనం:

10 . ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రయోజనం:

నూతన చట్టంలో ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేక శ్రద్ధ చూపించటం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా భూమిని కోల్పోయే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి భూమికి భూమినే నష్టపరిహారంగా ఇవ్వాలని చట్టం నిర్దేశిస్తోంది. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యేవారు ఈ వర్గాలవారైతే వారిని మరో జిల్లాకు తరలించాల్సి వస్తే అదనంగా 25 శాతం పునరావాసం పరిహారం చెల్లించాలి. ఏక మొత్తంగా చెల్లించాల్సిన రూ.50 వేలకు ఇది అదనం.

11. సమగ్ర పరిహార ప్యాకేజీ:

11. సమగ్ర పరిహార ప్యాకేజీ:

భూసేకరణ జరిగే సందర్భంలో భూమికి భూమి కేటాయించాలి. ఇళ్లు మంజూరు చేయాలి. ఉపాధిని కల్పించాలి. అదేవిధంగా భూమికి ఏక మొత్తంలో చెల్లించిన నగదుకు అదనంగా జీవితాంతం వడ్డీలాంటి ప్రయోజనాలను కల్పించాలి.

12. గత అన్యాయాలకు పరిహారం:

12. గత అన్యాయాలకు పరిహారం:

గతంలో జరిగిన అన్యాయాలను, నష్టాలను సరిదిద్దడంలో భాగంగా గతంలో భూసేకరణ జరిగి నష్టపరిహారం లభించని వారికి ఇప్పుడు పరిహారం అందించాలని నూతన చట్టం పేర్కొనడం విశేషం. చారిత్రక అన్యాయాలకు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది.

13. పరిహారం తర్వాతే సేకరణ:

13. పరిహారం తర్వాతే సేకరణ:

నష్ట పరిహారం పూర్తిగా చెల్లించేంతవరకు పునరావాసానికి, ప్రత్యామ్నాయ స్థలాలను సిద్ధం చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ జరపడానికి వీల్లేదని నూతన చట్టంలో పేర్కొన్నారు.

14. జీవనోపాధికీ పరిహారం:

14. జీవనోపాధికీ పరిహారం:

భూసేకరణ వల్ల జీవనోపాధిని కోల్పోయిన వారికి నెలకు రూ.3000 చొప్పున మొదటి సంవత్సరం అందించాలి. ఆ తరువాతి ఏడాది నుంచి 20 సంవత్సరాల పాటు నెలకు రూ.2000 నష్ట పరిహారాన్ని అందించాలి. ఇప్పటి వరకు ఉన్న చట్టంలో జీవనోపాధి పరిహారం ప్రస్తావనే ఉండేది కాదు.

15. గృహానికి గృహం:

15. గృహానికి గృహం:

భూసేకరణ వల్ల ఇల్లు కోల్పోయినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100 చదరపు మీటర్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 50 చ.మీ.ల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించి ఇవ్వాలి.

16. ఆయకట్టులో వాటా:

16. ఆయకట్టులో వాటా:

సాగునీటి ప్రాజెక్టుల కోసం భూమిని సేకరిస్తే సాగులోకి వచ్చే ఆయకట్టు పరిధిలో ఒక్కో కుటుంబానికి ఒక ఎకరం భూమిని ఇవ్వాలి. అలాగే ప్రతీ ప్రాజెక్టులోనూ ఒక్కో షెడ్యూల్డ్ తెగ కుటుంబానికి ఒక ఎకరం భూమిని ఇవ్వాలి. ప్రతి నిర్వాసిత కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగాన్ని ఇవ్వాలి.

17. సేకరణ అనంతర ప్రయోజనం:

17. సేకరణ అనంతర ప్రయోజనం:

సేకరణ వల్ల భూమి కోల్పోయిన వారిని సేకరణ అనంతరం జరిగే అభివృద్ధిలో భాగస్వాములను చేయడం, వారి సామాజిక, ఆర్థిక స్థాయిని మెరుగుపర్చడం నూతన చట్టంలోని అత్యంత సానుకూల అంశం.

18. పునరావాసానికి చట్టబద్ధత:

18. పునరావాసానికి చట్టబద్ధత:

ఇప్పటి వరకూ ఉన్న చట్టాలు ప్రధానంగా భూములు కోల్పోయే వారికిచ్చే నష్ట పరిహారాన్ని గురించి మాత్రమే ఉండగా కొత్త చట్టంలో పునరావాస, పునర్నిర్మాణ అంశాలను చేర్చడం విశేషం. నూతన చట్టం ద్వారా భూసేకరణతో పాటు పునరావాసానికి కూడా చట్టబద్ధత కల్పించినట్లయింది.

19. ఉమ్మడి జాబితా:

19. ఉమ్మడి జాబితా:

నూతన చట్టం ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కేంద్రం ఉద్దేశం దెబ్బతినకుండా ఈ అంశంపై రాష్ట్రాలు సొంతంగా చట్టం తీసుకురావచ్చు. అంటే రాష్ట్రాలకు తగినంత స్వేచ్ఛ లభించి తమ అవసరాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది.

20. ముగింపు:

20. ముగింపు:

ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా వ్య‌వ‌సాయేత‌ర ఉద్దేశాల కోసం వ్య‌వ‌సాయ భూమిని తీసుకోవాల‌నుకున్న‌ప్పుడు దాని వ‌ల్ల విశాల ప్ర‌యోజ‌నం ఉండాలి. ప్ర‌భుత్వానికి, సంబంధిత అధికారుల‌కు దానిపై ఎంతో బాధ్య‌త ఉండాలి. రైతుల బాధ‌ను స్య‌యంగా అర్థం చేసుకునే మ‌న‌సు ఉండాలి. ఆఖ‌రి రైతు వ‌ర‌కూ న్యాయం జ‌రిగేలా ఉంటేనే స‌ద‌రు ప‌ని చేయాలి. ఒక్క రైతుకు అన్యాయం జ‌రిగినా అది ఆ ప్రాంతానికి, ప్ర‌భుత్వానికి మంచిది కాదు. ప‌రిహారం కోసం రైతు ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరిగే అవ‌స‌రం క‌ల్పించ‌కుండా మొద‌ట ప్రాజెక్టు, ప‌రిశ్ర‌మ వంటివి చేప‌ట్టేముందే రైతుల ఖాతాల్లోకి వారికి రావాల్సిన మొత్తం అందిన త‌ర్వాతే ముందుకెళ్లాలి.

Read more about: land farmers agriculture
English summary

వ్య‌వ‌సాయ భూమి కోల్పోతున్నారా... చ‌ట్టం ద్వారా లాభం ఎలా పొందాలి? | Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation & Resettlement Act, 2013 what is there in that

2013 land acquisition Act provides for land acquisition as well as rehabilitation and resettlement. It replaces the Land Acquisition Act, 1894.The process for land acquisition involves a Social Impact Assessment survey, preliminary notification stating the intent for acquisition, a declaration of acquisition, and compensation to be given by a certain time. All acquisitions require rehabilitation and resettlement to be provided to the people affected by the acquisition
Story first published: Wednesday, January 3, 2018, 17:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X