ప్రీమియం సరిగా చెల్లించారు... బీమా క్లెయిం మాత్రం రావ‌డం లేదు... ఎలా?

Subscribe to GoodReturns Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఇన్సూరెన్స్‌కు సంబంధించి చాలా మందికి అపోహ‌లు ఉంటాయి. మ‌న దైనందిన జీవితంలో సైతం బీమా పాల‌సీ చేయించేట‌ప్పుడు ఏజెంట్లు చేసే హ‌డావిడి సైతం అంతా ఇంతా కాదు. అయితే క్లెయిం స‌మ‌యంలో ఇదే త‌ర‌హా స్పంద‌న‌ను మ‌నం ఊహించ‌లేం. పాలసీదారు తదనంతరం కూడా కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా చూడటమే బీమా పాలసీ తీసుకోవడం ముఖ్య ఉద్దేశ్యం. అయితే క్లెయిమ్‌ ప్రక్రియ గురించి సరిగ్గా తెలియకపోతే బీమా సొమ్ము చేతికిరాకపోగా పై పెచ్చు కుటుంబసభ్యులకు మనశ్శాంతి కరువవుతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముఖ్యంగా ఆరుఅంశాలను గుర్తుంచుకుంటే మంచిది. క్లెయిం విష‌యంలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలో ఈ కింద తెలుసుకోండి

  బీమా అంబుడ్స్‌మెన్‌

  బీమా అంబుడ్స్‌మెన్‌

  జీవిత బీమా తీసుకున్నవారు ప్రతిపాదన ఫారంలో వెల్లడించిన విషయాలపై క్లెయిం విషయంలో తుదినిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బీమా ఒప్పందం అత్యంత మెరుగైన విశ్వసనీయతతో కొనసాగే ఒప్పందం.

  బీమాకు సంబంధించిన నిర్ణయాలన్నింటికీ బీమా చట్టాలు మార్గదర్శకాలు. ఐఆర్‌డీఏఐ నిర్ణయమే బీమా క్లెయిం విషయంలో అంతిమ తీర్పు. మీకు ఏదైనా బీమా కంపెనీలో అన్యాయం జరిగిందని భావిస్తే ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మెన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అక్కడా న్యాయం జరగలేదని భావిస్తే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు.

  నామినీకి వివరాలు

  నామినీకి వివరాలు

  ప్రతి బీమాదారు తప్పక గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఇది. మీరు ఏ పాలసీ తీసుకున్నా సరే నామినీకి తప్పనిసరిగా ఆ వివరాలను, దానివల్ల వచ్చే ప్రయోజనాలు, క్లెయిమ్‌ ప్రక్రియ మొదలైన విషయాలన్నింటినీ తెలియజేయాలి. అవసరమైన పత్రాలన్నీ కూడా నామినీకి అందుబాటులో ఉండేలా చూడాలి. లేకపోతే పాలసీ తీసుకుని కూడా వ్యర్థమౌతుంది.

  వ్యక్తిగత వివరాలు

  వ్యక్తిగత వివరాలు

  పాలసీదారు పూర్తి సమాచారాన్ని అందివ్వకపోవడం వల్లే చాలా సందర్భాల్లో క్లెయిమ్‌లు తిరస్కారానికి గురవుతుం టాయి. కనుక, బీపీ, డయాబెటీస్‌ వంటివి ఏమైనా ఉన్నా, స్మోకింగ్‌, ఆల్కాహాల్‌ వంటి అలవాట్లు ఉన్నా తప్పనిసరిగా పాలసీ తీసుకునే సమయంలో పేర్కొనాలి. దీనివల్ల ప్రీమియం కొంత పెరిగితే పెరగొచ్చు. కానీ అంతిమంగా క్లెయిమ్‌ విషయానికొచ్చే సమస్యలు చాలా తగ్గుతాయి.

  పాలసీ గురించి

  పాలసీ గురించి

  తీసుకున్న పాలసీ గురిం చి, దాని నిబంధనలు మొదలైన వాటి గురించి క్షణ్ణంగా అర్థం చేసుకుంటే క్లెయిమ్స్‌ తిరస్కరణకు గురికాకుండా కొంతవరకూ జాగ్రత్తపడొచ్చు. అర్థంకాని నిబంధనలేమైనా ఉంటే బీమా కంపెనీని అడిగి తెలుసుకోవాలి. అంతేకానీ పాలసీ తీసుకునేటప్పుడు ఏజెంటు ఎక్కడ సంతకం పెడితే అక్కడ పెట్టేసి తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు. పాలసీ కొనుగోలు సమయంలో కాకపోయినా 15 రోజుల సమయం ఉన్నప్పుడు పాలసీ నిబంధనలను క్షుణ్ణంగా చదివితే మీకే మంచిది.

  డాక్యుమెం ట్లు

  డాక్యుమెం ట్లు

  క్లెయిమ్‌తో పాటు ఒరిజినల్‌ లేదా అటెస్టెడ్‌ మరణ ధ్రువీకరణ పత్రాన్ని, మెడికల్‌ డాక్యుమెంట్స్‌ ఏమైనా ఉంటే.. వాటిని తప్పనిసరిగా జతచేయాలి. అన్ని డాక్యుమెంట్లు ఒక్కసారే ఇవ్వండి. సాధారణంగా ఒరిజినల్‌ పాలసీ పత్రం, పూర్తి చేసిన క్లెయిమ్స్‌ ఫారం, పాలసీదారుతో తన సంబంధాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం, పోస్ట్‌మార్టం రిపోర్టు, బ్యాంక్‌ అకౌంట్‌, అవసరమైతే ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.

  క్లెయిం నమోదు

  క్లెయిం నమోదు

  ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సాధ్యమైనంత వెంటనే బీమా కంపెనీకి తెలియజేసి క్లెయిమ్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలి. సమాచారాన్ని అందించేందుకు బీమా కంపెనీలు సాధారణంగా సుమారు 60 నుంచి 90 రోజుల దాకా వ్యవధి ఇస్తుంటాయి. కానీ అంతకంటే ముందే సమాచారం అందించడం మంచిది.

   సక్రమంగా ప్రీమియం

  సక్రమంగా ప్రీమియం

  బీమా పాలసీ తీసుకున్నాక.. ప్రీమియంల చెల్లింపులో జాప్యం లేకుండా చూసుకోవాలి. వీలును బట్టి నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి ప్రీమియం చెల్లింపులు కొనసాగించడం కష్టమైనపక్షంలో ఆ విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేయడం మంచిది. పాలసీదారు చెబుతున్నది వాస్తవమేనని కంపెనీ నమ్మిన పక్షంలో పాలసీలో నిబంధనలను తగు విధంగా సవరిస్తుంది.

  Read more about: claim insurance
  English summary

  Are you facing any issues in Insurance claim Do these things

  In order to enable the insurer to process the claims at the earliest the policyholder must submit a written application as soon as the eventuality or the maturity of claim has occurred. The claim form must be duly filled with all the information correctly as per the details required i.e. policy number, name of the insured, cause of death, date of death, name of the nominee/ beneficiary etc
  Story first published: Monday, January 8, 2018, 11:04 [IST]
  Company Search
  Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
  Thousands of Goodreturn readers receive our evening newsletter.
  Have you subscribed?

  Find IFSC

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more