For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల కోసం 5 అద్భుతమైన ఆన్లైన్ బిజినెస్ ఐడియాలు

సాధారణంగా మహిళలు చాలామంది సొంతంగా డబ్బు సంపాదించి తమ కాళ్ళమీద తాము నిలబడాలని ఆకాంక్క్షిస్తుంటారు.కాలేజీకి వెళ్లే అమ్మాయిలు,పెళ్లయిన మహిళలు మరియు పిల్లలకోసం తమ కారియర్ ను మధ్యలోనే ఆపేసినవారు

By Bharath
|

సాధారణంగా మహిళలు చాలామంది సొంతంగా డబ్బు సంపాదించి తమ కాళ్ళమీద తాము నిలబడాలని ఆకాంక్క్షిస్తుంటారు.కాలేజీకి వెళ్లే అమ్మాయిలు,పెళ్లయిన మహిళలు మరియు పిల్లలకోసం తమ కారియర్ ను మధ్యలోనే ఆపేసిన ఈతరం అమ్మాయిల కోసం, మగవారికంటే తాము ఏమాత్రం తీసిపోము అని నిరూపించుకోవాలనే తపన ఉన్న మహిళా యువత కోసం ఇంటివద్దే ఉండి డబ్బు సంపాదించే కొన్ని చక్కటి ఆన్లైన్ బిజినెస్ ఐడియాలు ఎవో తెలుసుకుందాం.

1.ఫ్యాషన్ కన్సల్టింగ్:

1.ఫ్యాషన్ కన్సల్టింగ్:

ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలకు మేకప్ అనేది అలంకరనే కాదు అవసరం కూడా.మేకప్ లేనిదే చాల మంది అసలు బయటకు కూడా రాలేని రోజులివి.ప్రతిఒక్కరు తాము వేసుకునే దుస్తులు వారికీ తగ్గట్టు డిజైన్ కోరుకుంటారు, ఇంకొంతమంది ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది అని వెతుకుతూ ఉంటారు.

మీకు ఈ మేకప్ రంగంలో కాస్త అనుభావం ఉంటే మంచి బిజినెస్ మొదలు పెట్టొచ్చు . మేకప్ కోరుకునే వారికోసం మీరు సలహాలు,సూచనలు ఇస్తూ చిన్న మొత్తంలో ఛార్జ్ చేసి డబ్బు సంపాదించవచ్చు.ఇవి మీరు సొంతంగా యూట్యూబ్ లో అకౌంట్ తెరచి ఆన్లైన్ లో క్లాసులు చెప్పి కూడా డబ్బు సంపాదించవచ్చు.

ఇలా చేయండి:

మీకు ముందుగానే ఈ రంగంలో ప్రవేశం ఉండి కాస్త అనుభవం ఉంటే చాలు సొంతంగా మొదలు పెట్టొచ్చు.

మేకప్ మరియు డ్రెస్ డిజైన్ల గురించి వివరిస్తూ మీరు మీ సొంత వెబ్సైటు తెరచి ఆన్లైన్ లో క్లాసులు చెప్పి కూడా సంపాదించవచ్చు.

2.మేకప్ వీడియోస్:

2.మేకప్ వీడియోస్:

బ్యూటీ క్లినిక్కులు ఎప్పటి కాలంలో అన్ని చోట్లా సర్వ సాధారణం ఐపోయాయి కానీ ప్రస్తుతం అమ్మాయిలు ఆన్లైన్లో వీడియోలు చూసి మేకప్ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటున్నారు.

ఇలా చేయండి:

దీని కోసం మీరు మీదగ్గర ఉన్న కెమెరా ను తీసి వీడియో చిత్రీకరించి వాటిని మీ వెబ్సైటు లో అప్లోడ్ చేయండి,అందులో వచ్చే యాడ్స్ ద్వారా డబ్బు పొందవచ్చు.

మీ బ్లాగ్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని ద్వారా కొన్ని బ్యూటీ టిప్స్ చెప్పి యాడ్స్ ద్వారా కొంత డబ్బు సంపాదించచ్చు.

3.ఆన్లైన్ కేక్ బిజినెస్:

3.ఆన్లైన్ కేక్ బిజినెస్:

ఇది చాల సులభమైనది మరియు తక్కువ ఖర్చు తో కూడుకున్న బిజినెస్.బయట బకెరీల్లో దొరికే కాక్స్ కన్నా ఇంట్లో తాయారు చేసే కేకులకు చాల ప్రాధాన్యత వుంది.ఎందుకంటే ఇంట్లో ఐతే మంచి నాణ్యమైన మరియు శుభ్రాంగా తాయారు చేసి చక్కటి రుచి కలిగి ఉంటాయని భావిస్తారు.మొదట మీకు తెలిసిన బందువులకు లేదా మిత్రులకు తయారుచేయడం మెదలుపెట్టండి.తరువాత మెల్లగా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు.

ఇలా చేయండి:

సోషల్ మాధ్యమాల ద్వారా,ఉదాహరణకు పేస్ బుక్ లాంటి వాటిలో మీరు తాయారు చేసిన వివిధ రకాల కేక్ ఫోటోలు పెట్టి తెలియచేయొచ్చు.

మీకు పరిచయం ఉన్న చిన్న దుకాణాలకు సప్లై చేసి వ్యాపారాన్ని విస్తరించండి.

4.ఆన్లైన్ కుకింగ్:

4.ఆన్లైన్ కుకింగ్:

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాల మందికి ఇంట్లో వండుకునే సమయం లేక హోటల్ ఆహారం తింటున్నారు.కానీ ఎన్ని హోటళ్లు ఉన్న ఇంట్లో ఉండిన ఆహరం రుచే వేరు అని చాల మంది అభిప్రాయ పడుతుంటారు.అటువంటి వారి కోసం మీరు సొంతంగా ఒక వెబ్సైటు ని ఓపెన్ చేసి అందులో వారికీ కావాల్సిన ఆర్దార్లు తీసుకోని డెలివరీ బాయ్ ద్వారా ఆహరం అందచేసి డబ్బు సంపాదించచ్చు.నగరాల్లో ఎపుడు ఈ బిజినెస్ కి చాల డిమాండ్ వుంది ఉదాహరణకి బెంగళూరు,హైదరాబాద్,వైజాగ్ తదితర నగరాల్లో మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి.

ఇలా చేయండి:

మీరు సొంతంగా ఒక వెబ్సైట్ ని మొదలు పెట్టండి.

ఇంటి నుండే మీ తయారియాను డెలివరీ బాయ్ ద్వారా పంపడం

లేదా ఫుడ్ డెలివరీ బిజినెస్ సైట్ లో మీ వివరాలు ఉంచడం

ఆన్లైన్ క్లాసులు:

ఆన్లైన్ క్లాసులు:

కొంత మంది అమ్మాయిలు పెద్ద చదువులు చదివి కొన్ని కారణాల వల్ల ఉద్యోగం చేయని వారు,ఇంతకు ముందు ఉద్యోగం చేసి పెళ్లి చేసుకున్న వారు తమ సబ్జెక్టు మర్చిపోకుండ ఆన్లైన్ లో క్లాసులు చెప్తూ డబ్బు పొందవచ్చు ఇంకా ఉద్యోగం చేస్తూ కూడా ఆన్లైన్ క్లాసులు చెప్తూ డబ్బు సంపాదించవచ్చు.

ఇలా చేయండి:

మీకు తెలిసిన సబ్జెక్టును మీ బ్లాగ్ ద్వారా సంబంధిత విద్యార్థులకు చెప్పడం ద్వారా

మీరు పని చేసిన టెక్నాలజీ గురించి ఆన్లైన్ లో కొంతమంది విద్యార్థులకు ట్రైనింగ్ క్లాసులు చెప్పి డబ్బు సంపాదించచ్చు.

English summary

మహిళల కోసం 5 అద్భుతమైన ఆన్లైన్ బిజినెస్ ఐడియాలు | 5 Top Business Ideas For Women

Small business ideas for women are pretty the same but why is it so important to start with ‘Business Ideas for Women’, Why not men or why would we need to designate the gender? Indicates something good.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X