For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెట్ న్యూట్రాలిటి కార‌ణంగా సామాన్యుల‌కు ప్ర‌యోజ‌నం ఏమి?

నెట్ న్యూట్రాలిటీ మీద గ‌త మూడేళ్లుగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి ప‌లు సంస్థ‌లు, ప్ర‌జ‌ల విన‌తుల‌ను స్వీక‌రించిన ట్రాయ్ చివ‌ర‌కు గ‌త వారం దీనిపై త‌న నిర్ణ‌యాన్

|

నెట్ న్యూట్రాలిటీ మీద గ‌త మూడేళ్లుగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి ప‌లు సంస్థ‌లు, ప్ర‌జ‌ల విన‌తుల‌ను స్వీక‌రించిన ట్రాయ్ చివ‌ర‌కు గ‌త వారం దీనిపై త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. నెట్ న్యూట్రాలిటి అంటే ఏమిటి? దాని

వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు, సామాన్యుల‌కు ఏ ప్ర‌యోజ‌నం క‌లుగుతోందో తెలుసుకుందాం.

 నెట్ న్యూట్రాలిటి అంటే ఏమిటి?

నెట్ న్యూట్రాలిటి అంటే ఏమిటి?

నెట్ న్యూట్రాలిటి అనేది ఇంటర్నెట్ యొక్క మార్గదర్శక సూత్రం, ఇది మనం ఆన్ లైన్ లో స్వేచ్చగా సంభాశించుకోవడం అనే మన హక్కుని పరిరక్షిస్తుంది. ఇది ఇంటర్నెట్ స్వేచ్చకి నిర్వచనం.

నెట్ న్యూట్రాలిటి అనగా ఇంటర్నెట్ మనకు స్వేచ్చగా మాట్లాడుకోవడానికి ఇవ్వబడిన వేదిక, ఇంటర్నెట్ ప్రొవైడర్ మనకు ఇంటర్నెట్ ని పరిమితి లేకుండా అందిచడం, మనం చెప్పాలకున్నదానిని అడ్డుకోవడం లేదా వివక్ష చూపించకుండా ఉండడం. ఇది ఎలాగంటే, మనం మొబైల్ ఫోనులో ఎవరికి కాల్ చేయాలి, ఎవరికి చేయకూడదు, మనము ఏమి మాట్లాడాము అనే నిబంధన లేకుండా ఎలాగైతే ఉందొ అదే విధంగా ఇంటర్నెట్ లో కూడా మనం ఏమి చేస్తున్నాము, ఎలాంటి సమాచారం చూస్తున్నాము, చదువుతున్నాము అనే దానితో సంబంధం లేకుండా మనకి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం అనేది ఇంటర్నెట్ మొదలైనప్పటి నుండి వస్తున్న సాంప్రదాయం.

ఇంట‌ర్నెట్-టెలికాం ఆప‌రేట‌ర్లు, ఐఎస్‌పీలు

ఇంట‌ర్నెట్-టెలికాం ఆప‌రేట‌ర్లు, ఐఎస్‌పీలు

ఇప్పుడు టెలికాం ఆపరేటర్లు / ISP సర్వీస్ ప్రొవైడర్లు మనము ఎంత వేగంగా, ఎంత ఎక్కువగా ఇంటర్నెట్ ని వాడుతున్నాము, ఎలాంటి సమాచారాన్ని చూస్తున్నాము, ఎలాంటి సేవలు పొందుతున్నాము అనేదాన్ని పరిగణలోకి తీసుకుని మనం వాడే ఇంటర్నెట్ కి వెలకడతారు.

ఇలా స్వేచ్చగా ఇంటర్నెట్ ని అందించటం వలన సమాచారాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం మరియు ఉపన్యాసాలని చూడటం చిన్న తరహ వ్యాపారానికి ఇంటర్నెట్ ని స్వేచ్చగా ఉపయోగించుకోవడం వలన ప్రజలు లబ్ధి పొందటం జరుగుతుంది.

అంద‌రూ కోరుకునేది ఏమిటి?

అంద‌రూ కోరుకునేది ఏమిటి?

అన్ని సైట్ లు సమానంగా అందుబాటులో ఉండాలి.

అన్ని సైట్ లకు ఒకే రకమైనటువంటి వేగాన్ని టెలికాం ఆపరేటర్లు/ISP లు అందిచాలి. (టెల్కో స్వతంత్ర ఎంపిక)

ప్రతి సైట్ యాక్సెస్ కోసం అదే డేటా వ్యయం ఖర్చు అవ్వాలి. (KB /MB )

 నెట్ న్యూట్రాలిటి అనేది వీటిని స‌మ‌ర్థించ‌దు

నెట్ న్యూట్రాలిటి అనేది వీటిని స‌మ‌ర్థించ‌దు

ఇంటర్నెట్ అందిచే సంస్థలకు టెలికాం మాదిరిగా లైసెన్స్ విధానం ఉండకూడదు (కేవలం మీరు ఇది మాత్రమే చూడగలరు వినగలరు అని)

కేవలం కొన్ని ఇంటర్నెట్ ముఖద్వారాలని (గేట్ వే) ఎంపిక చేసుకునే విధంగా ఉండకూడదు.

కొన్ని సైట్ లకు మాత్రం అధిక వేగం, మరికొన్నిటికి తక్కువ వేగం అందిచడం ఉండకూడదు.

"సున్నా రేటింగ్" ఇవ్వడం లేదా కొన్నిమాత్రమే ఉచిత సైట్లు అందివ్వడం చేయకూడదు.

నెట్ న్యూట్రాలిటి ప్రాముఖ్యత

నెట్ న్యూట్రాలిటి ప్రాముఖ్యత

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఇటివల 20 ప్రశ్నలతో కూడిన ప్రజాభిప్రాయ సేకరణ సంగ్రహించేందుకు ఒక పేపర్ ని విడుదల చేసింది. అందులో ముఖ్యంగా స్కైప్ మరియు ఫేస్ బుక్ ల వంటికి ఇంటర్నెట్ లో వేగంగా వ్యాప్తి చెందటం మరియు అధికంగా వినియోగించడం మీద నియంత్రణ మరియు కొన్ని వంవత్సరాల నుండి చాలా సేవలు విరివిగా అందిచడం వలన ఇంటర్నెట్ అనేది ఒక ఆటస్థలంగా మారింది.

ఇది ఇలా ఉండగా ఇంటర్నెట్ లో వ్యాపారం చాలా వేగంగా వ్యాప్తి చెందటం జరుగుతుంది. ఇలాగ ఎన్నో రకాల సేవలు కేవలం నెట్ న్యూట్రాలిటి ఉండటం వలన సాధ్యం అవుతుంది.

నెట్ న్యూట్రాలిటి వలన ఎవరు లాభం పొందుతారు

ఇంటర్ నెట్ వాడే ప్రతి ఒక్కరు ఈ నెట్ న్యూట్రాలిటి వలన లాభం పొందుతారు.

Read more about: internet data
English summary

నెట్ న్యూట్రాలిటి కార‌ణంగా సామాన్యుల‌కు ప్ర‌యోజ‌నం ఏమి? | What is net neutrality in What way it is useful for common man

The Telecom Regulatory Authority of India (TRAI) on Monday barred telecom service providers from charging differential rates for data services, effectively prohibiting Facebook’s Free Basics and Airtel Zero platform by Airtel in their current form.
Story first published: Saturday, December 9, 2017, 14:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X