For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్ధిక నిర్వహణ కోసం కొత్తగా పెళ్ళైన జంటలకు 5 అద్భుతమైన ఆర్ధిక ప్రణాళిక చిట్కాలు

మొత్తానికి, ఆర్ధిక శ్రేయస్సు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగాల‌ శ్రేయస్సు కంటే ఎక్కువ ప్రాధాన్యత కలది. మీరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే ముందు భ‌విష్య‌త్తులో డబ్బు కొర‌కు ఇబ్బందులు ప‌డ‌కూడ‌దంటే

|

ఆర్ధిక నిర్వహణ కోసం కొత్తగా పెళ్ళైన జంటలకు 5 అద్భుతమైన ఆర్ధిక ప్రణాళిక చిట్కాలు
వివాహం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే ఒక పెద్ద నిబద్ధత. ఇది కేవలం పెళ్లిరోజు కోసం ఏర్పాటు చేయబడిందే కాదు, జీవితం ముందుకు సాగడానికి కూడా. కాబట్టి, మీరు వివాహానికి ప్రణాళిక చేసుకుంటుంటే, అంత పెద్ద అడుగు వేసే ముందే మీరు మీ ఆర్ధిక స్ధితి ని మెరుగుపరుచుకోవడం మంచిది. మొత్తానికి, ఆర్ధిక శ్రేయస్సు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగాల‌ శ్రేయస్సు కంటే ఎక్కువ ప్రాధాన్యత కలది. మీరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే ముందు భ‌విష్య‌త్తులో డబ్బు కొర‌కు ఇబ్బందులు ప‌డ‌కూడ‌దంటే అవ‌స‌ర‌మైన‌ ఆర్ధిక పరమైన విషయాలు కొన్ని కింద ఇవ్వబడ్డాయి

1. మీ ఆర్ధిక స్ధితిని అంచనా వేయండి:

1. మీ ఆర్ధిక స్ధితిని అంచనా వేయండి:

మీ కాబోయే భాగస్వామికి మీ ఆర్ధిక పరిస్ధితి గురించి తెలియచేయడం ఎల్లప్పుడూ మంచిదని సూచన. ఆ వివరాలను పంచుకోవడంలో ఎటువంటి సందిగ్ధత ఉన్నా అది ఆ అనుబంధానికి హాని కలిగించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఒకరికొకరు ఆర్ధిక స్థితిగతులు తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఖర్చులను చాలా క్రమబద్దీకృత పద్ధతిలో ప్రణాళిక వేసుకోవడానికి సహాయపడుతుంది.

 2. మీ డెబిట్ లు, బాధ్యతలు, అప్పుల గురించి ప్రతి విషయం చెప్పడం

2. మీ డెబిట్ లు, బాధ్యతలు, అప్పుల గురించి ప్రతి విషయం చెప్పడం

సాధారణంగా, ప్రజలు వారి అప్పులను దాచిపెట్టి, వారు చాలా ఆర్ధికపరమైన చరిత్ర కలవారుగా చూపించుకోవాలి అనే పద్ధతి కలిగి ఉంటారు. ఇది మీ అనుబంధం ఎక్కువ కాలం నిలబడడానికి సహాయపడదు. మీ ఆర్ధిక, బెబిట్ లు, రుణాలు, బాధ్యతల గురించి మీ భార్యకు వివాహం అయిన తరువాహ ఆశ్చర్యాన్ని కలిగించ కూడదు. అప్పు లేదా ఆర్ధిక బాధ్యతలు అనేవి సిగ్గుపడే విషయాలు కావు.

3. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియచేయడం:

3. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియచేయడం:

మీ బ్యాంక్ అకౌంట్ ల వివరాలు మొత్తం మీ భాగస్వామికి తెలియచేయ చేస్తే ఎక్కడెక్కడ ఎంత డబ్బులు ఉన్నాయో వారికి తెలియడం మంచిది. అంతేకాకుండా, మీ భాగస్వామికి బ్యాంక్ అకౌంట్ లేకపోతే కొత్త ఖాతా తెరవండి లేదా జాయింట్ అకౌంట్ పెట్టండి. ఇది మీ ఇద్దరి భాగస్వాములకు ఆర్ధిక పరమైన ఆదాయాలు, ఖర్చుల గురించి తెలుసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది.

4. ఇంతవరకు మీకు పెట్టుబడి ప్రణాళిక లేకపోతే ఇపుడు మొదలు పెట్టండి:

4. ఇంతవరకు మీకు పెట్టుబడి ప్రణాళిక లేకపోతే ఇపుడు మొదలు పెట్టండి:

మీరు ఒక్కరే ఉన్నపుడు, మీకు తిరిగి చెల్లించే పెట్టుబడి పాలసీల మీద అంత ఆశక్తి ఉండక పోవచ్చు. వివాహం తరువాత, మీరు తప్పకుండా పెట్టుబడుల గురించి తెలుసుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే పరిస్ధితులు లేదా ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి.

మీరు జీవిత భీమా పాలసీ లేదా ఆరోగ్య భీమా పాలసీ ఎదోకదాన్ని ప్రమాదాన్ని కవర్ చేసుకోవడానికి తీసుకోవడం మంచిది.

5. డ‌బ్బును దుర్వినియోగం చేయకండి:

5. డ‌బ్బును దుర్వినియోగం చేయకండి:

మీరు జాగ్రత్తగా ఖర్చు పెడతారు, కానీ మీ జీవిత భాగస్వామికి ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం కావొచ్చు. ఇంటి బడ్జెట్ ని నిర్వహించడం లేదా ఖర్చు చేసే విషయంలో కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ పాటించడం మంచిది. ఇది ఇద్దరి మధ్య ఆర్ధిక దుర్వినియోగాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు అనవసరమైన ఖర్చులను మానుకుని ప్రతి ఖర్చుకు కూడా బడ్జెట్ వేసుకోండి.

భావోద్వేగాల‌ను నియంత్ర‌నించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం లాగా, ఆర్ధిక శ్రేయస్సు అనేది కూడా భార్యాభర్తలు ఇద్దరూ తప్పక సంభాషించుకోవాల్సిన అంశం, దీనివల్ల అనవసరమైన తగాదాలు, ఒత్తిడులు తగ్గి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందగలుగుతారు.

English summary

ఆర్ధిక నిర్వహణ కోసం కొత్తగా పెళ్ళైన జంటలకు 5 అద్భుతమైన ఆర్ధిక ప్రణాళిక చిట్కాలు | 5 amazing financial planning tips for newly-married couples for money management

Marriage is a big commitment between two people. It is not just about preparing for the wedding day, but also for the life ahead. Hence, if you are planning to get married, it’s best to sort out your financial position before taking that big plunge. After all, financial security is as important as emotional well-being between couples.Below are a few money moves you would like to take before you take the marriage plunge:
Story first published: Friday, November 24, 2017, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X