For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఐదూ పాటిస్తే మీ ఆర్థిక జీవితం బాగుంటుంది

కొంత నిబ‌ద్ద‌త‌, డ‌బ్బు సంబంధిత విష‌యాల‌పై జిజ్ఞాస, వీటితో పాటు ప్ర‌ణాళిక‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌కుండా అమ‌లు చేయ‌గ‌ల నేర్ప‌రిత‌నం ఉండాల్సిందే. ఆ విధంగా ఒక ప్రణాళిక బ‌ద్దంగా వెళ్లాల‌నుకునేవారు పాటించి

|

భార‌త‌దేశం యువ‌శ‌క్తితో అల‌రారుతోంది. 35 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్నవారి సంఖ్య 65%గాను, 25 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ ఉన్న జ‌నాభా 50శాతంగానూ ఉంది. అంటే శ్రామిక జ‌నాభా విష‌యంలో మ‌న దేశం చాలా సానుకూలంగా ఉంది. ఇప్పుడిప్పుడే సంపాద‌న వ‌య‌సులో ఉన్న‌వారి సంఖ్య బాగా పెరుగుతుండ‌గా ఇదివ‌ర‌కే కుటుంబ ముఖ్య ఆర్జ‌న‌దారులుగా చాలా మంది ఉన్నారు. ఎంత సంపాదిస్తున్నా ఆర్థిక ప్ర‌ణాళిక‌పై అవ‌గాహ‌న అంద‌రికీ ఉండ‌దు. ఆర్థిక విష‌యాల్లో ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని అని భావించే వారికి కొంత నిబ‌ద్ద‌త‌, డ‌బ్బు సంబంధిత విష‌యాల‌పై జిజ్ఞాస, వీటితో పాటు ప్ర‌ణాళిక‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌కుండా అమ‌లు చేయ‌గ‌ల నేర్ప‌రిత‌నం ఉండాల్సిందే. ఆ విధంగా ఒక ప్రణాళిక బ‌ద్దంగా వెళ్లాల‌నుకునేవారు పాటించి తీరాల్సిన 5 విష‌యాలు ఇవే...

బ‌డ్జెట్ త‌యారుచేసుకోవ‌డం

బ‌డ్జెట్ త‌యారుచేసుకోవ‌డం

ఒక్కసారి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నాక నెల‌నెలా ఆ మేర‌కు పెట్టుబ‌డులు పెట్టాలి. అయితే ఒక‌సారి అనుకోని ఖ‌ర్చులు ఎదుర‌వుతాయి. అందుకే మొద‌టే నెల‌వారీ బడ్జెట్ వేసుకోవాలి. ఖర్చులపై నిత్యం ఒక క‌న్నేసి ఉంచాలి. ఒక నెల, రెండు నెలలు లేదా త్రైమాసికానికి ఇలా బడ్జెట్ వేసుకుని, దేని కోసం ఎంత‌ ఖర్చు పెడుతున్నాం? ఎక్కడ తగ్గించుకోవచ్చు? ఎంత ఆదా చేసుకోవచ్చు? అని చూసుకుంటూ పోతే మీకే తెలుస్తుంది. మీ ఆర్థిక ప‌రిస్థితి, స‌వ‌రించుకోవాల్సిన అంశాలను కూడా బేరీజు వేసుకోవ‌చ్చు. దీని వల్ల అనవసరమైన వ్య‌యాలు, రుణాలు తగ్గించుకుని, ఆదాయం ఆధారంగా ప్ర‌ణాళిక వేసుకోవ‌డం సాధ్యపడుతుంది. అవసరాలను తీరుస్తూనే వృథా ఖర్చులను పక్కకు తప్పించగలిగేలా బడ్జెట్‌ను రూపొందించుకోగలిగితే అన్నివిధాలా శ్రేయస్కరం. తెలివిగా ఖర్చు పెట్టడమంటే పొదుపు చేయడం కూడా అని గుర్తుపెట్టుకోండి.

2. ఖర్చులపై స్వీయ నియంత్రణ:

2. ఖర్చులపై స్వీయ నియంత్రణ:

ఇప్పుడు అన్ని చోట్ల జేబు, పర్సులో నుంచి డ‌బ్బు తీయ‌డం మానేసి కార్డ్ స్వైప్ చేయ‌డం అలవాటు అయిపోయింది. అందుకే ఇంత‌కు ముందులా కాకుండా ప్ర‌తి ఒక్క‌రి ఖ‌ర్చులు ఎక్కువైపోయాయి. అవ‌స‌రం-కోరిక మ‌ధ్య తేడా గ‌మ‌నించ‌కుండా ఎడాపెడా వ‌స్తువుల‌ను కొనేసి ఇళ్ల‌ను నింపేస్తున్నారు. కొన్ని నెల‌ల త‌ర్వాత ఆ వ‌స్తువు ఉప‌యోగించ‌డం కూడా చేయ‌రు. అందుకే ఏ వ‌స్తువును కొనే ముందు అయినా స‌రే దాని అవసరమెంత? మీ ఆర్థిక పరిస్థితులపై దాని ప్రభావమెంత? ఇది లేకుండా మ‌నం రోజుల‌ను గ‌డ‌ప‌లేమా? వంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. ఒకవేళ అది తప్పనిసరి అయితే, మీ ఆర్థిక పరిస్థితిని దిగ‌జార్చ‌దు అని భావిస్తేనే ముందుకెళ్లాలి. అలాగ‌ని వీకెండ్ వినోదాలు, క‌నీస అవ‌స‌రాల‌ను వ‌దిలేయ‌మ‌ని కాదు. నియంత్ర‌ణలో సాగాల‌నేదే ప్ర‌ణాళిక ఉద్దేశం. అదే సమయంలో అవసరం లేని వాటిని కూడా కొనేసుకోవాలి అన్న ఆలోచనను నియంత్రించుకోవాలి. బ‌య‌ట‌కు వెళ్లినప్పుడల్లా డెబిట్‌, క్రెడిట్ కార్డులను వెంట తీసుకెళ్లే అలవాటుంటే తగ్గించుకోవడం మంచిది. ఇది ఎందుకు చెబుతున్నామంటే ఆధునిక జీవ‌న శైలి వ‌ల్ల కార్డుంటే ఒక్కోసారి నియంత్ర‌ణ లేకుండా ఖ‌ర్చు చేసే అలవాటు వ‌చ్చేసింది.

3. లక్ష్యాలకు కట్టుబడి ఉండటం:

3. లక్ష్యాలకు కట్టుబడి ఉండటం:

ఉద్యోగంలో చేరినప్పట్నుంచీ.. అంతకు ముందే నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలి. ఈ ఆర్థిక లక్ష్యాలు స్వల్పకాలికం, మధ్య కాలికం లేదా దీర్ఘకాలికమైనవిగా ఉండొచ్చు. గడువు ఎంత పెట్టుకున్నప్పటికీ.. వాటిని సాధించే దిశగానే పనిచేయండి. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటి సాధనపై దృష్టి పెట్టడం వల్ల డబ్బును, సమయాన్ని సరైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం సాధ్యపడుతుంది.

4. అత్యవసరాల కోసం ఆదా:

4. అత్యవసరాల కోసం ఆదా:

ఉద్యోగ భద్రత రోజులు పోయాయి. ఎప్పుడుంటాయో, ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం ఉద్యోగాలు ఉంటున్నాయి. పని చేసే కంపెనీ వ్యాపార విధానాలు మారడం వల్ల కావొచ్చు లేదా సంస్థ ఆర్థిక పరిస్థితులు బాగోలేక పోవడం వల్ల కావొచ్చు ఉద్యోగాలకు సమస్య వచ్చి పడొచ్చు. ఇలాంటి కష్టకాలంలో ఆదుకోవడానికి చేతిలో కొంతైనా డబ్బు ఉంచుకోవాల్సిందే. ఇందుకోసమే రెగ్యులర్‌గా ప్రతి నెలా కొంత మొత్తాన్ని తీసి పక్కన పెట్టి అత్యవసర నిధిని తయారు చేసుకోవాలి.

5. కుటుంబానికి భద్రత:

5. కుటుంబానికి భద్రత:

ఆర్థికంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉండాలి. అనుకోని విధంగా ఇంటి పెద్ద ఆస్పత్రి పాలైనా లేదా వారికి అవాంఛనీయమైనదేదైనా జరిగినా కుటుంబ ఆర్థిక పరిస్థితిలో ఒక్క‌సారిగా పెద్ద ఇబ్బంది లేకుండా బీమా రక్షణ ఉండాలి. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు తగినంత కవరేజీ ఉండేలా చూసుకోవాలి. సాధార‌ణంగా సంపాద‌న‌కు 10 రెట్లు ఉండేలా బీమా పాల‌సీ ఉండాల‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తారు.

English summary

ఈ ఐదూ పాటిస్తే మీ ఆర్థిక జీవితం బాగుంటుంది | best financial plan for young adults

Personal finance, despite its importance, is yet to be taught as a subject in high school or colleges in India. Hence, most youngsters when they join their first job or embark on a professional career are fairly clueless about how to manage their money. Here we are giving 5 simple steps for financial plan
Story first published: Friday, October 27, 2017, 14:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X