English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మ‌న బ్యాంకు ఖాతా ఎప్పుడు ఇన్ఆప‌రేటివ్‌గా మారుతుంది?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

వినియోగదారులు వివిధ కారణాల రీత్యా చాలా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి అన్నింటినీ ఉపయోగించే పరిస్థితి ఉండదు. కొన్నింటిలో ఖాతాలను అలాగే వదిలేస్తారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాల పాటు ఎలాంటి డెబిట్‌, క్రెడిట్‌ జరగకపోతే అటువంటి వాటిని ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలుగా పరిగణిస్తారు. ఒక్కోసారి ఖాతా నంబరు కూడా మరిచిపోతూ ఉండొచ్చు. అయితే ఆర్‌బీఐ ఈ మేరకు ఇలాంటి ఖాతాదారులను ఊరించే ప్రకటన చేసింది.

పదేళ్లపాటు ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాదారుల పేర్లు, చిరునామాలను వెబ్‌సైట్లలో ఉంచాల్సిందిగా బ్యాంకులను ఆదేశించింది. ఇన్‌ఆపరేటివ్‌ అకౌంట్ సంబంధించి ఆర్‌బీఐ నిబంధ‌న‌లను ఇక్క‌డ తెలుసుకోండి

 మ‌న బ్యాంకు ఖాతా ఎప్పుడు ఇన్ఆప‌రేటివ్‌గా మారుతుంది?

ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాల విషయంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలు:

* నిర్ణీత కాలంలో లభించే వడ్డీ, బ్యాంకు రుసుములు కాకుండా ఖాతాల్లో సంవత్సరం పాటు ఏ ఇతర లావాదేవీలు జరగని వాటిపై వార్షిక సమీక్ష జరపాలి. ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న విషయాన్ని ఖాతాదారులకు రాతపూర్వకంగా తెలియజేస్తూ అందుకు గల కారణాలను అడిగి తెలుసుకోవాలి. ఏ కారణం చేతైనా ఖాతాదారుడు మరో కొత్త ఖాతాను నిర్వహిస్తుంటే అందులోకి పాత ఖాతాలోని నగదున బదిలీ చేయవచ్చు.

* ఖాతాదారుడికి సమాచారం అందించేందుకు ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తి గురించి ఎటువంటి వివరాలను రాబట్టలేకపోతే, సదరు వ్యక్తిని బ్యాంకుకు పరిచయం చేసిన వ్యక్తికి సమాచారం అందించాలి. ఫోన్‌, ఈమెయిల్‌ ద్వారా అతడిని చేరుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఇంకా వీలు కాకపోతే అతడు పని చేసే సంస్థ ద్వారా వివరాలు తెలుసుకుని సమాచారం అందించే ప్రయత్నం చేయాలి.

* వినియోగదారుడు ఖాతాను నిర్వహించకపోవుటకు గల కారణాలను తెలియపరిస్తే, సంవత్సరం పాటు ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాలను గడువును విధిస్తూ మళ్లీ వాడాల్సిందిగా సూచించవచ్చు. ఇచ్చిన గడువులోపు ఖాతాలను మళ్లీ పట్టించుకోకుండా వదిలేస్తే వాటిని ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలుగా ప్రకటించవచ్చు.

* ఖాతాదారులకు పంపించే ఉత్తరాలు చేరకుండా వెనక్కి వస్తుంటే, చట్టబద్ధ వారసులు లేదా బంధువులు, స్నేహితుల ద్వారా ఖాతాదారుడి చిరునామా కోసం ప్రయత్నించాలి.

* రెండేళ్లపాటు పొదుపు ఖాతాలో ఖాతాదారుడి వైపు నుంచి లావాదేవీలు జరగకపోతే అలాంటి ఖాతాలను, ఇన్‌ఆపరేటివ్‌ అకౌంట్‌లుగా పరిగణించవచ్చు.

* ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలుగా ప్రకటించే విషయంలో ఖాతాదారుడు చేసే డెబిట్‌, క్రెడిట్‌లను పరిగణలోకి తీసుకుంటూ, బ్యాంకు జమ చేసే వడ్డీ, వసూలు చేసే సేవా రుసుములను లెక్కలోకి తీసుకోరు. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ ఖాతాలో జమ అవడం, బీమా పాలసీ ప్రీమియం కోసం ఖాతాలో నుంచి డబ్బు డెబిట్‌ అవడం లాంటి థర్డ్‌ పార్టీ లావాదేవీలు సైతం ఖాతాదారుడు జరిపే లావాదేవీలే అవుతాయి.

* మోసపూరిత ఖాతాల విషయంలో బ్యాంకులు నిరంతర నిఘా ఉంచడం సాధారణం. ఈ నేపథ్యంలో ఖాతాలను వర్గీకరించేటప్పుడు ఖాతాదారునికి సమాచారం లేకుండా బ్యాంకులు వివరాలను రాబడుతూ ఉంటాయి. ఏ విధంగా చేసినా ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాగా ప్రకటించినప్పటికీ సదరు ఖాతాదారులకు ఎటువంటి అసౌర్యాన్ని కలుగచేయరాదు. అనుమానాస్పద లావాదేవీలపై, ఖాతాలపై బ్యాంకులు నిరంతరం పర్యవేక్షణ ఉంచడం వారి బాధ్యతలో భాగమే.

* భద్రతా చర్యలో భాగంగా ఒకవేళ ఖాతాను తాత్కాలికంగా ఇన్‌ఆపరేటివ్‌గా ప్రకటించినా, ఖాతా వర్గీకరణ ఆధారంగా నియమ నిబంధనల మేరకు ఖాతా కొనసాగింపుకై వీలు ఉంటుంది. ఇలా కొనసాగించే ముందు లావాదేవీ/ఖాతా కచ్చితత్వాన్ని, ఖాతాదారుడి వ్యక్తిగత గుర్తింపును నిర్ధారించి తదుపరి చర్యలు ఉంటాయి. ఈ విధమైన బ్యాంకు జాగ్రత్తల్లో భాగంగా ఖాతాదారుని ఇబ్బంది పెట్టకూడదు.

* ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలను ఉపయోగించేలా చేసేందుకు ఎటువంటి రుసుములు విధించరాదు.

* పొదుపు ఖాతాను నిర్వహిస్తున్నా లేకపోయినా అందుకు తగిన వడ్డీని మాత్రం బ్యాంకు తప్పనిసరిగా జమ చేయాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ విషయంలో మెచ్యూరిటీ తీరిన తర్వాత పొదుపు ఖాతాకు వర్తించే వడ్డీ అమలవుతుంది.

* పదేళ్లకు పైబడిన అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లు, ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలకు సంబంధించి, వారి పేరు, చిరునామాలను బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో పొందుపరచాల్సిందింగా ఆర్‌బీఐ సూచించింది. ఖాతా సంఖ్య, ఖాతా రకం, బ్రాంచి వంటి వివరాలు వెబ్‌సైట్లో పెట్టరాదు.

ఆర్‌బీఐ సూచించిన మేరకు బ్యాంకులన్నీ వెబ్‌సైట్‌ హోం పేజీలో ఫైండ్‌/సెర్చ్‌ ఆప్షన్‌తో కూడిన ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాల జాబితాను ఇవ్వాలి. పేరు టైప్‌ చేస్తే మనం చిరునామాతో కూడిన సమాచారాన్ని రాబట్టవచ్చు. తదుపరి ఖాతాను యాక్టివేట్‌ చేసుకోవాలనుకుంటే బ్యాంకు మాతృ శాఖ‌ను సంప్రదించాలి.

Read more about: bank account, banking, bank
English summary

what is inoperative account in a bank in India

The bank considers two year of transactions for the purpose. You need to give fresh know your customer documents, in case you decide to make the account operative once again.
Story first published: Tuesday, August 1, 2017, 17:36 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC