ఈ పథకాన్ని ఎల్ఐసీ నిర్వహిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడమే కాకుండా, ఈ పథకంలో బీమా పొందే వారి తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడమే కాకుండా, ఈ పథకంలో బీమా పొందే వారి తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు వ్యవహరిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా యోజన ద్వారా ఎటువంటి ఆర్థిక ఆసరా లేని, గ్రామీణ ప్రాంతాల్లోని అసంఘటిత రంగంలో వారు ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకాన్ని ఎల్ఐసీ నిర్వహిస్తోంది. దాని గురించి కూలంకషంగా మరిన్ని వివరాలు మీ కోసం...

అర్హత
బీమా చేయించుకునే వ్యక్తి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఆ వ్యక్తి భూమి లేని గ్రామీణ కుటుంబ పెద్ద, లేదా ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయి ఉండాలి.

ప్రయోజనాలు
బీమాదారు కాలవ్యవధి ముగియకముందే హఠాత్తుగా మరణిస్తే, బీమా చేయబడిన మొత్తం రూ.30వేలను నామినీకి అందజేస్తారు. భూమి లేని నిరుపేదలు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారు ఎవరైనా ఈ పథకానికి అర్హులు. ** పాలసీ గురించిన మరిన్ని వివరాల కోసం **
https://www.licindia.in/Products/Aam-Aadmi-Bima-Yojana

ప్రమాద ప్రయోజనాలు:
బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదం కారణంగా మరణించినా, ప్రమాదంలో పూర్తి లేదా పాక్షిక అంగవైకల్యం పొందినా ఈ కింది విధంగా ప్రయోజనాలను అందిస్తారు.
ప్రమాదం కారణంగా మరణిస్తే రూ.75,000
ప్రమాదం వల్ల పూర్తి, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.76,000
ప్రమాదంలో రెండూ కళ్లూ, రెండు అవయవాలూ,
లేదా ఒక కన్ను, ఒక కాలో, ఒక చేయి కోల్పోతే రూ.75,000
ఒక కన్ను, లేదా ఒక కాలో, ఒక చెయ్యి పోయినప్పుడు రూ.37,500

ఉపకార వేతనాలు
ఈ బీమా పథకం కింద దీనిలోని సభ్యుల పిల్లలకు ఉపకారవేతనం రూపంలో ఒక అదనపు ఉచిత ప్రయోజనం చేకూరుతుంది. ఇద్దరికి మించకుండా 9 నుంచి 12 తరగతులు చదువుతున్న పిల్లలకు నెలకు రూ.100 చొప్పున ఉపకార వేతనం అందుతుంది. ఈ మొత్తాన్ని ఆరు నెలలకొకసారి ప్రతి సంవత్సరం జనవరి 1న, జులై 1న చెల్లిస్తారు.

ప్రీమియం
ఈ పథకంలో ప్రీమియం రూ. 200, ఇందులో 50% మొత్తాన్ని ఇందుకోసం కేంద్రప్రభుత్వంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన నిధి నుంచి సబ్సిడీ నుంచి చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

వయసుకు సంబంధించి రుజువులు
- రేషన్ కార్డు
- పుట్టిన తేదీకి సంబంధించి రిజిస్టర్‌లోనిది
- పాఠశాల సర్టిఫికేట్లో పుట్టిన తేదీ రుజువు
- వోటర్ జాబితాలో పేరు
- ప్రభుత్వం లేదా పేరున్న సంస్థలు జారీ చేసే రుజువు
- ఆధార్ కార్డు
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications