For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ ఆన్‌లైన్‌లో

ఇప్పుడంతా డిజిట‌ల్ బాట ప‌డుతుండ‌టంతో మ్యూచువ‌ల్ ఫండ్ నియంత్ర‌ణ సంస్థ సైతం పెట్టుబ‌డిదారుల‌కు ఆన్‌లైన్ స‌దుపాయం క‌ల్పిస్తోంది. ఎటువంటి స‌మ‌యం వృథా కాకుండా సిప్‌ను ప్రారంభించేందుకు వీలు క‌ల్పిస్తున్నా

|

సిప్‌ను ఆన్‌లైన్‌లో ఎలా ప్రారంభించాలి?
ఇప్పుడంతా డిజిట‌ల్ బాట ప‌డుతుండ‌టంతో మ్యూచువ‌ల్ ఫండ్ నియంత్ర‌ణ సంస్థ సైతం పెట్టుబ‌డిదారుల‌కు ఆన్‌లైన్ స‌దుపాయం క‌ల్పిస్తోంది. ఎటువంటి స‌మ‌యం వృథా కాకుండా సిప్‌ను ప్రారంభించేందుకు వీలు క‌ల్పిస్తున్నారు. కాబ‌ట్టి సిప్‌ను ఆన్‌లైన్‌లో ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.

 మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ ఆన్‌లైన్‌లో

సిప్ ప్రారంభానికి కేవైసీ అవ‌స‌రం
ఎవ‌రైనా మొద‌టి సారి మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ మొదలుపెట్టాలంటే, కేవైసీ ప‌త్రాల వెరిఫికేష‌న్ చేయాలి. ఇందుకోసం ఐడీ ప్రూఫ్‌, అడ్ర‌స్ ప్రూఫ్‌,ఇత‌ర రుజువులు ఉండాలి. వీటిని ఇన్ ప‌ర్స‌న్ వెరిఫికేష‌న్ ద్వారా పూర్తిచేయ‌వ‌చ్చు. ఫండ్ హౌస్‌కు వెళ్లి గాని ఇంట‌ర్మీడియ‌ట‌రీల ద్వారా గానీ ఈ ప్ర‌క్రియ‌ను ముగించాలి.
కేవైసీ కోసం ఇంకా పాస్‌పోర్ట్ ఫోటో, చెక్కు పుస్త‌కంలోని క్యాన్సిల్డ్ లీఫ్ ఇవ్వాలి. బ్యాంకు వివ‌రాలు చెకింగ్ పూర్త‌యితే నేరుగా బ్యాంకు ఖాతా నుంచి సిప్ సొమ్మును మిన‌హాయిస్తారు. ఈ-కేవైసీ కోసం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌, ఫండ్ హౌస్ వెబ్‌సైట్‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు.
ఒక‌సారి ఒక ఫండ్ హౌస్ వ‌ద్ద కేవైసీ ప్ర‌క్రియ పూర్త‌యిన‌ట్ల‌యితే దాన్ని అన్ని ఫండ్ హౌస్‌ల వద్ద వాడుకోవ‌చ్చు. ఈ-కేవైసీ ప్ర‌క్రియ కోసం పెట్టుబడిదారు ట్రాన్స్‌ఫ‌ర్ ఏజెంట్స్‌, రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌ను సైతం చూడొచ్చు. ఒక‌సారి కేవైసీ ప్ర‌క్రియ మొత్తం పూర్త‌యిన‌ట్లు ఫండ్ హౌస్ నుంచి మెసేజ్ లేదా మెయిల్ వ‌స్తే పెట్టుబ‌డి ప్రారంభించేందుకు అంతా సిద్ద‌మైన‌ట్లే. ఒక‌సారి ఫండ్ హౌస్ వెబ్‌సైట్లో లాగిన్ అయి మీ సిప్ పెట్టుబ‌డిని మొద‌లుపెట్ట‌వ‌చ్చు.

Read more about: sip mf mutual funds
English summary

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ ఆన్‌లైన్‌లో | Want to Start SIP Online First complete kyc process

After you are done with the necessary KYC procedure, visit the site of the fund house you have chosen for starting SIP investment with. Thereafter, you can enter your details as a new investor. The fund house may ask you to create your log-in credentials for transactions online.
Story first published: Wednesday, June 14, 2017, 14:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X