ఈపీఎఫ్ఓ డిజిటల్ బాట పట్టింది. తద్వారా పీఎఫ్ విత్‌డ్రాయల్స్ ఆన్‌లైన్లో చేసుకోవడం సులభతరమైంది. అయితే దీనికి యూఏఎన్ తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులందరికీ యూఏఎన్ ద్వారా ప
ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయింల కోసం యూఏఎన్ ఆధార్ అనుసంధానం తప్పనిసరి
ప్రైవేటు రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగికి ఇప్పుడు ఈఎస్ఐ లేదా పీఎఫ్ వంటి సౌకర్యాలు తప్పనిసరి. ఈపీఎఫ్ఓ క్లెయింలు మాన్యువల్‌గా చేయాలంటే సమయం వృథా అయ్యేది. అందుకే ఇప్పుడు మొత్తం ఈపీఎఫ్ఓ డిజిటల్ బాట పట్టింది. తద్వారా పీఎఫ్ విత్‌డ్రాయల్స్ ఆన్‌లైన్లో చేసుకోవడం సులభతరమైంది. అయితే దీనికి యూఏఎన్ తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులందరికీ యూఏఎన్ ద్వారా పీఎఫ్ సొమ్మును క్లెయిం చేసుకోవడం సులువైంది. ఇది ఎలాగో తెలుసుకుందాం.

ఆధార్, యూఏఎన్ అనుసంధానం
ఆర్థిక ప్రయోజనం ఉండే ప్రతి చోటా ఆధార్ అనుసంధానం జరుగుతోంది. అంతే కాకుండా ఆధార్‌ను కేవైసీ రుజువుగా సైతం వాడుతున్నారు. దాంతో భవిష్య నిధి నియంత్రణ సంస్థ(ఈపీఎఫ్‌వో) కూడా ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. తద్వారా డేటాబేస్‌లో తికమకకు తావు లేకుండా చేశారు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలు లేకుండా చూసుకునేందుకు ఇది ఉపయోగపడింది. పీఎఫ్ యూఏఎన్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేస్తే మీ పని సులువు అవుతుంది. దీన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ రెండు విధాలుగా చేయవచ్చు.

యూఏఎన్ యాక్టివేషన్
ఒకసారి మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత రెండు నెలల తర్వాత పీఎఫ్ చందాదారులవుతారు. మీ పీఎఫ్ ఖాతాలో జమయిన సొమ్ము మీ మొబైల్‌కు సంక్షిప్త సందేశ రూపంలో వస్తుంది. అయితే పీఎఫ్ ఖాతా సంఖ్య రాగానే మీరు చేయాల్సిన పని యూఏఎన్ నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవడం. ఇది పీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు. యూఏఎన్ యాక్టివేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

దీని వల్ల ప్రయోజనమేంటి?
ఇంతకుముందు పీఎఫ్ క్లెయిం చేసుకోవాలంటే యాజమాన్యాలపై ఆధారపడి ఉండేది. ఇప్పుడంతా ఆన్‌లైన్. యూఏఎన్ యాక్టివేషన్ ద్వారా పీఎఫ్ క్లెయిం ఆన్‌లైన్ చేసుకోవచ్చు. కేవైసీ పూర్తయిన పీఎఫ్ చందాదార్లు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సైతం చేసుకునే వీలుంది. పీఎఫ్ వెబ్‌సైట్లో కేవైసీ, చిరునామా వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చు.

ఆన్‌లైన్ చేసే విధానం
ఒకసారి యూఏఎన్ నంబర్ జనరేట్ అయిన తర్వాత మీరు పీఎఫ్ మెంబర్ వెబ్‌సైట్లో లాగిన్ అవ్వొచ్చు. యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ సాయంతో పీఎఫ్ వెబ్‌సైట్లో మీ సొంత వివరాలను మార్చుకోవచ్చు. పీఎఫ్ వెబ్‌సైట్‌కు సంబంధించి మీరు చేసే పనులన్నీ ఆన్‌లైన్ అయినందున అక్కడ మీ ఆర్థిక వివరాలు ఉంటాయి. ఒకసారి వివరాలన్నీ సరిచూసుకుని తప్పులుంటే సరిచేయడానికి ప్రయత్నించండి. అన్నీ సరిచేసిన తర్వాత సేవ్ మీట(ట్యాబ్)ను నొక్కండి.

ఆప్‌లైన్ విధానం
దేశంలో అందరికీ సాంకేతికత అందుబాటులో లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆప్‌లైన్ విధానాన్ని సైతం అందుబాటులో ఉంచారు. దీని ద్వారా ఆధార్, యూఏఎన్ అనుసంధానాన్ని ఆప్‌లైన్ ద్వారా సైతం చేయొచ్చు. ఇందుకోసం పీఎఫ్ చందాదారులు కస్టమర్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ)(csc) లేదా పీఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించి ఆప్‌లైన్ విధానం ద్వారా పూర్తిచేయవచ్చు. మీ యాజమాన్యం సాయం ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తిచేయడం చాలా సులువు. ఇలా వీలుకాకపోతే ఆఫ్‌లైన్ విధానాన్ని అనుసరించవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications