For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

7 ఉత్త‌మ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

వీటిల్లోలాక్ ఇన్ పీరియ‌డ్ 5 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. ప్ర‌స్తుతం బ్యాంకులు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీల‌పై 6.0-7.65 శాతం వ‌ర‌కూ వ‌డ్డీ రేటును ఇవ్వ‌జూపుతున్నాయి. వీటిల్లో ఉత్త‌మ‌మైన వాటిని ఇ

|

80సీ సెక్ష‌న్ కింద ఆదాయపు పన్ను మిన‌హాయింపులు పొందాల‌ని ప్ర‌తి ప‌న్ను చెల్లింపుదారుడు కోరుకుంటాడు. అలాంటి వాటిలో ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒక ఆప్ష‌న్‌. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో ఇన్వెస్ట్ చేసి రూ.1.50 ల‌క్ష వ‌ర‌కూ పన్ను ఆదాకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అయితే వీటిల్లో లాక్ ఇన్ పీరియ‌డ్ 5 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. ప్ర‌స్తుతం బ్యాంకులు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీల‌పై 6.0-7.65 శాతం వ‌ర‌కూ వ‌డ్డీ రేటును ఇవ్వ‌జూపుతున్నాయి. వీటిల్లో ఉత్త‌మ‌మైన వాటిని ఇక్క‌డ తెలుసుకుందాం.

 భార‌త్ కోఆప‌రేటివ్ బ్యాంకు

భార‌త్ కోఆప‌రేటివ్ బ్యాంకు

భార‌త్ కో ఆపరేటివ్ బ్యాంకు అన్నిటి కంటే ఉత్త‌మంగా భార‌త్ కోఆప‌రేటివ్ ట్యాక్స్ బెనిఫిట్ స్కీమ్ పేరుతో 7.65% వ‌డ్డీ రేటును ఇస్తోంది. అదే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌క‌యితే 7.9% వ‌డ్డీ రేటును అందిస్తోంది. ఇవ‌న్నీ రూ. 1 ల‌క్ష లోపు డిపాజిట్ల విషయంలో అని గుర్తుంచుకోవాలి. ప‌లు రాష్ట్రాల్లో విస్త‌ర‌ణ క‌లిగిన బ్యాంకు ఇది.ఈ బ్యాంకు అందించే డిపాజిట్ల‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలుంటాయి.

ఆర్‌బీఎల్ బ్యాంకు

ఆర్‌బీఎల్ బ్యాంకు

ఈ బ్యాంకు సాధార‌ణంగా టాప్ 3 వ‌డ్డీ రేట్ల‌ను అందించే ఎఫ్‌డీల‌ను ప్ర‌వేశ‌పెడుతూ ఉంటుంది. గ‌త వార‌మే వ‌డ్డీ రేట్ల‌ను కాస్త త‌గ్గించింది. 60 నెల‌ల నుంచి 120 నెల‌ల‌ కాల‌వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల వడ్డీ రేట్ల‌ను 7.5% నుంచి 7.35% మ‌ధ్య‌లో నిర్ణ‌యించింది. బ్యాంకు అందించే ట్యాక్స్ సేవింగ్ ఎప్‌డీలు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద మిన‌హాయింపు కోసం అర్హ‌త క‌లిగి ఉన్నాయి.

అభ్యుద‌య కో ఆప‌రేటివ్ బ్యాంకు

అభ్యుద‌య కో ఆప‌రేటివ్ బ్యాంకు

మార్చి 1,2017 నుంచి అభ్యుద‌య ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌పై వ‌డ్డీ రేటును 7.25 శాతంగా ఇస్తోంది. ఈ డిపాజిట్ 5 ఏళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్‌ను క‌లిగి ఉంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇలాంటి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీల‌పై గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు అవ‌కాశం ఉంది.

డెవ‌ల‌ప్‌మెంట్ క్రెడిట్ బ్యాంకు(డీసీబీ)

డెవ‌ల‌ప్‌మెంట్ క్రెడిట్ బ్యాంకు(డీసీబీ)

ముంబ‌యి కేంద్రంగా ప‌నిచేస్తున్న డెవ‌ల‌ప్‌మెంట్ క్రెడిట్ బ్యాంకు త్రైమాసికానికి ఒక‌సారి చ‌క్ర‌వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని అందిస్తూ 7.25% వ‌డ్డీ రేటుతో ఎఫ్‌డీల‌ను అందుబాటులో ఉంచింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7.75% రేటున వార్షిక వ‌డ్డీని అందిస్తారు. క‌నీస డిపాజిట్ రూ.10 వేలు మొద‌లుకొని గ‌రిష్టంగా రూ.1.50 వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టొచ్చు. అయితే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీల‌ను హామీగా రుణం పొంద‌లేర‌ని గుర్తుంచుకోవాలి.

ఐడీఎఫ్‌సీ బ్యాంకు

ఐడీఎఫ్‌సీ బ్యాంకు

ఐడీఎఫ్‌సీ బ్యాంకు సాధార‌ణ ఎఫ్‌డీల‌పై 7.50% వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తుండ‌గా; రూ. కోటి లోపు ఉడే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీల‌పైన 7.2% వ‌డ్డీని అందిస్తోంది. ఈ వ‌డ్డీ రేట్లు డిసెంబ‌రు7.2016న ప్ర‌క‌టించిన‌వి.

యెస్ బ్యాంకు

యెస్ బ్యాంకు

సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లానే యెస్ బ్యాంకు నుంచి వ‌చ్చిన ప‌న్ను ర‌హిత ఎఫ్‌డీల‌కు సంబంధించిన వ‌డ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ డిపాజిట్ల విష‌యంలో అద‌నంగా 0.50% వ‌డ్డీ ఇస్తారు.

సిటీ యూనియ‌న్ బ్యాంకు

సిటీ యూనియ‌న్ బ్యాంకు

త‌మిళ‌నాడుకు చెందిన సిటీ యూనియ‌న్ బ్యాంకు ట్యాక్స్ ఫ్రీ ఎఫ్‌డీల విష‌యంలో ఇచ్చే వ‌డ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. రూ.1 ల‌క్ష లోపు డిపాజిట్ల విష‌యంలో అమ‌ల‌య్యే వ‌డ్డీ రేట్లు ఇవి.

English summary

7 ఉత్త‌మ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు | 7 banks that offer best interest rates on Tax saving fixed deposits

Tax saving FDs allows you to reduce your tax liability by claiming the investment amount as deduction under section 80C of the Income Tax Act. An investor can claim a maximum deduction of Rs. 1,50,000 by investing in tax-saving FDs that have a lock-in period of 5 years. Currently an interest rate of 6.0-7.65% is offered by banks on tax-saving FD schemes.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X