English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఏటీఎమ్ మెషీన్ల ద్వారా ఈ ప‌నుల‌న్నీ చేయొచ్చా?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ఏటీఎమ్‌ల్లో రోజువారీ చేయ‌గ‌లిగే ప‌నులు

ఈ రోజుల్లో అంద‌రూ ఏటీమ్ కార్డులు వాడ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. ఒక‌ప్పుడు డ‌బ్బులు డ్రా చేసేందుకు మొద‌లైన ఏటీఎమ్ వాడ‌కం, ఇప్పుడు ఎన్నో ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను చేసేందుకు వీలు క‌ల్పిస్తోంది. న‌గ‌దు వాడ‌కాన్ని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఆన్‌లైన్‌, మొబైల్ బ్యాంకింగ్ వాడ‌కం బాగా ఎక్కువైంది. ఈ రెండింటిల్లో చేసే ఎన్నో ప‌నుల‌ను నేడు ఏటీఎమ్‌ల్లో కూడా చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. ఆన్‌లైన్ కార్య‌క‌లాపాలు పెరిగిన‌ప్ప‌టికీ ఏటీఎమ్ విస్త‌ర‌ణ మాత్రం అలానే ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం బ్యాంకుల‌కు వెళ్ల‌కుండానే ఏటీఎమ్‌ల్లో ఎన్నో ప‌నుల‌ను చాలా సులువుగా చేయ‌వ‌చ్చు. అలాంటి ప‌నుల జాబితాను ఇక్క‌డ తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు చెల్లింపులు:

క్రెడిట్ కార్డు చెల్లింపులు:

ఏటీఎమ్‌ను క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల కోసం సైతం ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇది చాలా సుల‌భ విధానం. ఉదాహ‌ర‌ణ‌కు ఐసీఐసీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎమ్‌ల‌లోకి వెళితే 'పే యువ‌ర్ క్రెడిట్ కార్డ్ బిల్' అనే ఆప్ష‌న్ క‌న‌బ‌డుతుంది. అక్క‌డ మీరు చెల్లించాల్సిన సొమ్ము వివ‌రాలు, క్రెడిట్ కార్డు నంబ‌రు న‌మోదు చేస్తే స‌రిపోతుంది. మీ ఖాతాలోంచి నేరుగా డ‌బ్బు డెబిట్ అవుతుంది. ర‌సీదును భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం ఉంచుకోవ‌చ్చు.

మొబైల్ రీచార్జీ:

మొబైల్ రీచార్జీ:

మీ మొబైల్ రీచార్జీ చేసుకునేందుకు రిటైల‌ర్ల ద‌గ్గ‌ర‌కి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఏటీఎమ్‌ల్లోకి వెళ్లి మీకు అవ‌స‌ర‌మైనంత సొమ్ముకు రిచార్జీని చేసుకోవ‌చ్చు. కేవ‌లం మీ ఫోన్‌కే కాదు, బంధుమిత్రుల ఫోన్ నంబ‌ర్ల‌కు సైతం రీచార్జీ చేయించే వీలుంది. ఇందుకోసం ఏటీఎమ్ ఆప్ష‌న్ల‌లో మొబైల్ రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకుని మొబైల్ నంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రీచార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే లావాదేవీ పూర్తవుతుంది.

నగదు బదిలీ:

నగదు బదిలీ:

నెట్‌బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్ సౌకర్యం లేని వారు కార్డు ఉంటే ఏటీఎమ్‌ కేంద్రానికి వెళ్లడం ద్వారా ఆన్‌లైన్ మనీ ట్రాన్‌‌సఫర్ చేసుకునే వీలుంది. ఇందుకోసం న‌గ‌దు పంపాల్సిన వ్య‌క్తి బ్యాంకు ఖాతాను ల‌బ్దిదారులుగా జ‌మ చేసుకుని ఉండాల్సి ఉంటుంది.

యుటిలిటీ బిల్లు చెల్లింపులు:

యుటిలిటీ బిల్లు చెల్లింపులు:

టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు చెల్లింపులను సైతం ఏటీఎమ్‌ నుంచి చేసుకునే సౌక‌ర్యం ఉంది. అయితే, బిల్లర్ వివరాలను నెట్ బ్యాంకింగ్ ద్వారా నమోదు చేసుకోవాలి.

ఫిక్స్‌డ్ డిపాజిట్:

ఫిక్స్‌డ్ డిపాజిట్:

ఏటీఎమ్‌ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం, అప్పటికే చేసి ఉన్న డిపాజిట్‌ను రద్దు చేసుకోవడం నిమిషాల వ్య‌వ‌ధిలో పూర్త‌వుతుంది. బ్యాంకింగ్ ఆప్షన్‌లో ఓపెన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ను ఎంచుకుని కాల వ్యవధి, నగదు మొత్తాన్ని ఎంటర్ చేసి ఎంచుకుంటే చాలు. కాకపోతే మీ ఖాతాలో డిపాజిట్‌కు సరిపడా నగదు ఉండాలి.

ప‌న్ను చెల్లింపులు:

ప‌న్ను చెల్లింపులు:

కొన్ని బ్యాంకులు తమ ఏటీఎమ్‌ల నుంచి ఆదాయపన్ను చెల్లింపునకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి ముంద‌స్తు ప‌న్ను(అడ్వాన్స్‌ ట్యాక్స్), స్వ‌యం మ‌దింపు ప‌న్ను(సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్), ప‌న్ను బ‌కాయిల‌ను సైతం చెల్లించే వెసులుబాటును క‌ల్పిస్తున్నాయి. అయితే, ఇందుకోసం ముందుగా బ్యాంకు శాఖలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏటీఎమ్‌ ద్వారా పన్ను చెల్లించిన అనంతరం వచ్చే యూనిక్ నంబర్‌ను నోట్ చేసుకుని దీని సాయంతో బ్యాంకు వెబ్‌సైట్ నుంచి రసీదు పొందవచ్చు.

బీమా ప్రీమియం:

బీమా ప్రీమియం:

బీమా పాలసీల ప్రీమియం చెల్లించే సౌలభ్యం కూడా ఏటీఎమ్‌లలో ఉంది. బీమా కంపెనీలు ఇందుకోసం పలు బ్యాంకులతో కూడా ఒప్పందాల‌ను కుదుర్చుకొని ఉన్నాయి. ఏటీఎమ్‌లో బిల్ పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత పాలసీ నంబర్‌ను ఎంటర్ చేసి ప్రీమియం మొత్తాని నిర్ధారించుకుని చెల్లించాల్సి ఉంటుంది.

వ్య‌క్తిగ‌త రుణానికి దరఖాస్తు:

వ్య‌క్తిగ‌త రుణానికి దరఖాస్తు:

వ్యక్తిగత రుణం కావాలంటే బ్యాంకు శాఖ వరకూ త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాల్సిన రోజులు పోయాయి. దగ్గర్లో బ్యాంకు ఏటీఎం ఉంటే చాలు. ప్రైవేటు రంగ బ్యాంకులు కొన్ని ఏటీఎమ్‌ల ద్వారా పర్సనల్ లోన్‌‌సకు దరఖాస్తు చేసుకునే సౌల‌భ్యం క‌లగ‌జేస్తున్నాయి. సంబంధిత ఖాతాదారుడి రుణ చరిత్ర ఆధారంగా బ్యాంకు రుణ అర్హ‌త‌ను నిర్ణ‌యిస్తారు. ఖాతాదారుడి లావాదేవీలు, వేతన జమల వివరాలను తదితర సమాచారం ఆధారంగా అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి రెండు రోజుల్లోనే ఆ మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తారుు. దీంతో ఏటీఎమ్‌ నుంచే ఆ రుణాన్ని సైతం డ్రా చేసుకోవచ్చు.

Read more about: atm, fd, loan
English summary

8 Things can be done in ATM other Than cash withdrawals

We often undertake transactions at an ATM, which largely involve cash withdrawal and checking balance. Sometimes, individuals also take a print-out of their statements, though these days the more environment conscious try and avoid the same. In any case, ATM machines have reduced the footfalls at banks and have also saved time for individuals. These days there are many transactions that one can undertake apart from the usual cash withdrawals.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC