For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను రహిత బాండ్లు అంటే ఏమిటి?

By Nageswara Rao
|

2015-16 సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి మంత్రి రోడ్లు మరియు రైల్వేలకు సంబంధించి పన్ను రహిత బాండ్లను ప్రవేశపెట్టారు. అసలు పన్ను రహిత బాండ్ల అంటే ఏమిటో తెలుసుకుందాం.

పన్ను రహిత బాండ్లలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెడితే తద్వారా వచ్చిన వడ్డీపై ఎలాంటి పన్నును వసూలు చేయరు. మీ మొత్తం సంపాదనతో కలుపుకోకుండా వీటిని పన్ను పరిధి నుంచి తప్పిస్తారు.

2015లో రాబోయే తాజా బాండ్లు జాబితా:

No Companies Amount in Crores
1. National HighwaysAuthority of India (NHAI)
Rs 24000
2. Indian Railways Finance Corporation (IRFC) Rs 6000
3. Housing and Urban Development Corporation (HUDCO)
Rs 5000
4. Indian Renewable Energy Development Agency (IREDA) Rs 2000
5. Power Finance Corporation Limited (PFC) Rs 1000
6. Rural Electrification Corporation Limited (REC)
Rs 1000
7. NTPC Limited
Rs 1000

ఎవరెవరు ఈ పన్ను రహిత బాండ్లను కొనుగోలు చేయొచ్చు?

* చిల్లర వ్యక్తిగత పెట్టుబడిదారులకు (RIIs)
* క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs);
* కార్పోరేట్స్ (including statutory corporations)
* హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (HNIs).

List Of Tax-Free Bonds To Be Launched In 2015-16

పన్ను రహిత బాండ్లపై వడ్డీరేట్లు:

పన్ను రహిత బాండ్లపై వడ్డీని వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఇస్తుంది. AAA కంపెనీలకు 55 పాయింట్ల కంటే తక్కుగా అందిస్తుంది. అదే AA+ రేటింగ్ ఉన్న బాండ్లకైతే AAA కంటే ఇచ్చేదానికంటే 10 బేసిస్ పాయింట్లను అత్యధికంగా అందిస్తుంది.

A లేదా -AA రేటింగ్ ఉన్న బాండ్లకు AAA కంటే ఇచ్చేదానికంటే 20 బేసిస్ పాయింట్లను అత్యధికంగా అందిస్తుంది. పన్ను రహిత బాండ్ల ద్వారా వచ్చే వడ్డీని ఏడాదికొకసారి పెట్టుబడిదారుడి బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా జమ చేస్తారు.

పన్ను రహిత బాండ్ల పరిధి:

పన్ను రహిత బాండ్ల పరిధి 10, 15, 20 సంవత్సరాలుగా ఉంది.

పన్ను రహిత బాండ్లపై పన్ను విధించరు?

పన్ను చట్ట ప్రకారం పన్ను రహిత బాండ్లపై పెట్టుబడులు పెడితే, వాటికి ఎలాంటి పన్ను వసూలు చేయరు.

పన్ను రహిత బాండ్లను కొనుగోలు చేయడం ఎలా?

స్టాక్ మార్కెట్లో షేర్లను ఎలాగైతే ట్రేడింగ్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేస్తారో పన్ను రహిత బాండ్లను అదేవిధంగా కోనుగోలు చేయవచ్చు. బ్రోకర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు లేదా ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా సొంతంగానే పన్ను రహిత బాండ్లను కోనుగోలు చేయొచ్చు.

English summary

పన్ను రహిత బాండ్లు అంటే ఏమిటి? | List Of Tax-Free Bonds To Be Launched In 2015-16

In the Union Budget 2015-16, Finance Minister, Arun Jaitley announced unveiling of tax-free infra bonds for railways and roads.
Story first published: Friday, August 7, 2015, 15:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X