లోన్, ఓవర్‌డ్రాప్ట్ మధ్య గల తేడా: ఏది ఉత్తమం?
బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని అప్పుగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు రెండు అంశాలపై దృష్టి సారిస్తే మంచిది. అవేంటంటే బ్యాంకు నుంచి మనం పెద్ద మొత్తంలో నగదుని అప్పు తీసుకునే సమయంలో లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ అనే రెండు పదాలను వింటూ ఉంటాం.
లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ రెండు పదాలను కూడా బ్యాంక్ నుంచి నగదు తీసుకునే సందర్భంలోనే ఉపయోగిస్తుంటారు. అయితే వినియోగదారుడు తీసుకున్న అప్పు చెల్లించే కాలాన్ని బట్టి ఈ రెండింటి మధ్య వడ్డీరేటులో తేడా ఉంటుంది.
ఎవరైతే వ్యాపారవేత్తలు, కార్పోరేట్ కంపెనీలను నిర్వహిస్తున్న సంస్ధలు కరెంట్ అకౌంట్‌ను కలిగి ఉంటారో వారు తప్పనిసరిగా బ్యాంకు 'లోన్' కంటే బ్యాంకు 'ఓవర్ డ్రాఫ్ట్'కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. లోన్, ఓవర్‌డ్రాఫ్ట్‌కు మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం.

లోన్, ఓవర్‌డ్రాప్ట్ మధ్య గల తేడా?
ఓవర్ డ్రాఫ్ట్ అనేది కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు వ్యతిరేకంగా ఓ సంస్ధకు లేదా కంపెనీకి ఇచ్చే అప్పు.
లోన్ అనేది బ్యాంకు నుంచి మీరు తీసుకున్న అప్పు

లోన్, ఓవర్‌డ్రాప్ట్ మధ్య గల తేడా?
ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా అప్పుగా తీసుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీరేటు ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌లో లిమిట్‌పై మాత్రం కాదు.
లోన్ ద్వారా అప్పుగా మీరు తీసుకున్న మొత్తంపై వడ్డీ రేటు ఉంటుంది. అంతేకాదు లోన్ తీసుకునేందుకు సెక్యూరిటీగా కొంత మొత్తాన్ని బ్యాంకు వద్ద తనఖా పెట్టాలి.

లోన్, ఓవర్‌డ్రాప్ట్ మధ్య గల తేడా?
ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా నగదుని తక్కువ కాలానికే అప్పుగా ఇస్తారు. ఈ కాలపరిమితి అనేది బ్యాంకు తీసుకున్న సంస్ధను బట్టి ఉంటుంది.
లోన్ అనేది వినియోగదారుడు ఎంచుకున్న కాలపరిమితిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు లోన్ కాలపరిమితి 3 నుంచి 25 సంవత్సరాలుగా ఉంటుంది.

లోన్, ఓవర్‌డ్రాప్ట్ మధ్య గల తేడా?
తక్కువ డాక్యుమెంట్లతో తక్కువ సమయంలో ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరిస్తాయి.
బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. బ్యాంకులు సూచించిన డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా సమర్పించిన తర్వాతే బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతాయి.

లోన్, ఓవర్‌డ్రాప్ట్ మధ్య గల తేడా?
ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకున్న మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు బ్యాంకులు ఆమోదిస్తాయి. ఏ సమయంలోనైనా ఓవర్ డ్రాఫ్ట్‌ను క్లోజ్ చేసుకోవచ్చు.
లోన్ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.