For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ స్కోర్ లేకుంటే.. రుణానికి విద్యార్హత, జాబ్ ప్రొఫైల్ అవసరం

|

మీకు క్రెడిట్ స్కోర్ లేదా? రుణ అవసరం ఉందా? ఇది మీ కోసమే. ఉన్నత చదువులు లేదా మంచి డిగ్రీ, అధిక వేతనం, క్రమబద్దమైన పెట్టుబడులు, వివేకవంతమైన స్పెండింగ్స్ అలవాట్లు ఉంటే మీకు క్రెడిట్ స్కోర్ లేకపోయినా రుణం పొందే అవకాశముంది. సాధారణంగా రుణం తీసుకోవడానికి క్రెడిట్ స్కోర్ చాలా కీలకం. అయితే కొంతమందికి క్రెడిట్ స్కోర్ ఉండదు.

అలాంటి వారికి రుణం తీసుకోవడంపై సంశయం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ జీరో ఉంటే....? క్రెడిట్ స్కోర్ 300 పాయింట్ల నుండ 900 పాయింట్ల మధ్య ఉంటుంది. మీ గత ట్రాన్సాక్షన్స్ ఆధారంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్ (CIBIL) స్కోర్ ఇస్తుంది.

సిబిల్ స్కోర్

సిబిల్ స్కోర్

CIBIL క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. క్రెడిట్ స్కోర్ బాగుంటే వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. రుణం కూడా ఎక్కువ వస్తుంది. క్రెడిట్ స్కోర్ రేంజ్ సున్నా నుండి ఐదు వరకు ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ సున్నా లేదా ప్రతికూలంగా ఉంటే రుణం పొందటం కాస్త కష్టం. అలాగే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. జీరో లేదా ప్రతికూలంగా ఉంటే ఇమ్మిడియేట్ క్రెడిట్ ట్రాక్ రికార్డ్ అందుబాటులో లేదని అర్థం. ప్రతికూల క్రెడిట్ మీ క్రెడిట్ రిపోర్ట్‌ను దెబ్బతీస్తుంది. అలాంటి రుణగ్రహీతల విషయంలో బ్యాంకులు కూడా అప్రమత్తంగా ఉంటాయి.

వీరికి సులభంగా రుణం

వీరికి సులభంగా రుణం

బ్యాంకులకు రుణ ఎగవేత ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో రుణగ్రహీత క్రెడిట్ హిస్టరీ అంతా చూస్తాయి. రుణగ్రహీత చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీని క్రెడిట్ స్కోర్ వెల్లడిస్తుంది. దీని ఆధారంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. 750 పాయింట్ల నుండి 900 పాయింట్ల మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు కాస్త సులభంగా రుణాలు అందిస్తాయి.

ఇదివరకు రుణం తీసుకోకుంటే..

ఇదివరకు రుణం తీసుకోకుంటే..

అయితే క్రెడిట్ స్కోర్ లేకుంటే... జీరో క్రెడిట్ హిస్టరీతో హోమ్ లోన్ తీసుకోవచ్చు. సాధారణంగా రుణం తీసుకోకుండా క్రెడిట్ హిస్టరీ ఉండదు. కాబట్టి క్రెడిట్ స్కోర్ లేకుంటే రుణానికి అర్హులు కారు అని చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో పని చేసే సంస్థ, విద్యార్హత, జాబ్ ప్రొఫైల్ వంటి వాటిని కూడా బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులకు హోమ్ లోన్ చాలా ఈజీగా వస్తుంది. గతంలో ఎలాంటి రుణాలు తీసుకోకపోయినప్పటికీ ఈజీగా వస్తుంది.

English summary

క్రెడిట్ స్కోర్ లేకుంటే.. రుణానికి విద్యార్హత, జాబ్ ప్రొఫైల్ అవసరం | Your education and job profile can get you a home loan despite don't have credit score

An education, high salary, regularity in making investments and prudent spending habits can help you get a loan even without a credit score.
Story first published: Tuesday, June 15, 2021, 15:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X